Actor Sampath: యాక్టర్ సంపత్‌ను బాహుబలి కాజాతో సత్కరించిన మడతకాజా మాతృ సంస్థ..

Actor Sampath: టాలీవుడ్ ప్రముఖ సినీ నటుడు సంపత్ కు గిఫ్ట్ గా బాహుబలి మడతకాజాను ఇచ్చింది.. మడతకాజా మాతృ సంస్థ .. తాపేశ్వరంలోని..

Actor Sampath: యాక్టర్ సంపత్‌ను బాహుబలి కాజాతో సత్కరించిన మడతకాజా మాతృ సంస్థ..
Sampath

Updated on: Oct 31, 2021 | 9:19 AM

Actor Sampath: టాలీవుడ్ ప్రముఖ సినీ నటుడు సంపత్ కు గిఫ్ట్ గా బాహుబలి మడతకాజాను ఇచ్చింది.. మడతకాజా మాతృ సంస్థ .. తాపేశ్వరంలోని సురుచి ఫుడ్స్.. అంతేకాదు సంపత్ ను శాలువా తో సన్మానించింది. ప్రస్తుతం సంపత్.. తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నారు. నాగార్జున హీరోగా కురసాల కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘బంగార్రాజు’ సినిమా షూటింగ్ లో  సంపత్ పాల్గొంటున్నారు. ఈ సినిమా షూటింగ్‌ సీతానగరం మండలం వంగలపూడిలో జరుగుతోంది.  ఈ షూటింగ్‌లో పాల్గొన్న సంపత్‌ను సురుచి పీఆర్‌ఓ వర్మ కలిసి బాహుబలి కాజాతో సత్కరించారు.

కన్నడ సినిమాల నుంచి మిర్చి సినిమాతో తెలుగులోకి అడుగు పెట్టిన సంపత్ తన నటనతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఎటువంటి పాత్రనైనా తనదైన శైలిలో నటిస్తూ.. ఆ పాత్రకు జీవం పొసే సంపత్ వరస అవకాశాలను అందుకుంటున్నారు. మిర్చి, రన్ రాజా రన్, అజ్ఞాతవాసి వంటి చిత్రాలలో అనేక తెలుగు సినిమాల్లో నటించి మెప్పించారు. తాజాగా నాగార్జున బంగార్రాజు లో నటిస్తున్నాడు.

నాగార్జున, కళ్యాణ్ కృష్ణ కంబోనేషన్ లో తెరకెక్కిన సోగ్గాడే చిన్ని నాయానా సినిమాకు సీక్వెల్ గా బంగార్రాజు తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో నాగార్జునతో పాటు నాగచైతన్య కూడా నటిస్తున్నాడు. నాగార్జునకు జోడీగా రమ్యకృష్ణ, చైతు కు జోడీగా కృతి శెట్టి నటిస్తున్నారు. ఇప్పటికే సినిమా రిలీజ్ కావాల్సి ఉంది.. అయితే కరోనా కారణంగా షూటింగ్ వాయిదా పడుతూ వస్తుంది. అయితే నాగార్జున ఈ సినిమాలో తనయుడితో మనం తర్వాత నటిస్తున్నాడు. భారీ అంచనాలున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి మూవీ మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.

Also Read:  అమలాపురం డివిజన్‌లో కరోనా టెన్షన్.. రోజు రోజుకీ ఉద్యోగుల్లో పెరుగుతున్న కోవిడ్ కేసులు

ముగిసిన పునీత్ అంత్యక్రియలు.. కుటుంబ సభ్యులు, సినీ, రాజకీయ ప్రముఖులు కన్నీటి వీడ్కోలు

Loading...
Unable to load recommendations.
Follow Us