Ranganath: 300లకు పైగా సినిమాలు.. ఆస్తి మొత్తాన్ని పనిమనిషికి రాసిచ్చి.. 66 ఏళ్లకే ఆత్మహత్య చేసుకున్న నటుడు..

టాలీవుడ్ నటుడు రంగనాథ్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. దాదాపు 300లకుపైగా సినిమాల్లో వైవిధ్యమైన పాత్రలు పోషించారు. స్టార్ హీరోలతో ఎన్నో చిత్రాల్లో నటించిన ఆయన.. చివరకు 66 ఏళ్లకే తన నివాసంలోనే ఆత్మహత్య చేసుకున్నారు. అయితే చనిపోవడానికి ముందు తన ఆస్తి మొత్తాన్ని పనిమనిషి పేరు మీద రాసిచ్చాడు. అంతేకాకుండా సూసైడ్ చేసుకోవడానికి ముందు ఒక గోడ మీద కొన్ని మాటలు రాసిచ్చారు.

Ranganath: 300లకు పైగా సినిమాలు.. ఆస్తి మొత్తాన్ని పనిమనిషికి రాసిచ్చి.. 66 ఏళ్లకే ఆత్మహత్య చేసుకున్న నటుడు..
Ranganath

Updated on: Aug 04, 2026 | 4:52 PM

దక్షిణాదిలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో వైవిధ్యమైన పాత్రలు పోషించి మంచి గుర్తింపు సంపాదించుకున్నారు రంగనాథ్. దాదాపు 300లకు పైగా సినిమాల్లో నటించి మెప్పించారు. కానీ ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించిన ఆయన 66 ఏళ్ల వయసులో 2015వ సంవత్సరంలో తన నివాసంలో ఆత్మహత్య చేసుకున్నారు. ఈ సంఘటన పరిశ్రమలోని ప్రతి ఒక్కరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆత్మహత్య చేసుకునే ముందు తన ఆస్తి మొత్తాన్ని తన పనిమనిషికి ఇవ్వాలని తన కోరికను వ్యక్తం చేస్తూ అతను ఒక సందేశాన్ని తన గది గోడలపై రాశారు. తన సంపదను ఎవరికి ఇవ్వాలో అడుగుతూ తన ఇంటి గోడపై నల్ల మార్కర్‌తో ఒక సందేశం రాశాడు. ఆస్తిని ఆమెకు ఇచ్చేయండి.. ఆమెను ఇబ్బంది పెట్టకండి అని రాశారు.

గతంలో రంగనాథ్ తనయుడు నాగేంద్ర కుమార్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన తండ్రి ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలను వెల్లడించారు. నాగేంద్ర కుమార్ తెలిపిన వివరాల ప్రకారం, మీనాక్షి అనే మహిల 2003-2004 ప్రాంతంలో తమ ఇంట్లో పనికి కుదిరిందని.. తన తల్లి అనారోగ్యంతో ఉన్న సమయంలో ఆరేళ్ల పాటు ఆమె ఎంతో నిబద్ధతతో సేవలు అందించిందని తెలిపారు. తన తల్లిని, ఆ తర్వాత తండ్రిని కూడా ఎంతో బాగా చూసుకుందని నాగేంద్ర కుమార్ అన్నారు. మీనాక్షికి డబ్బులు ఇచ్చి, ఆమెను ఇంటి వద్ద దింపి, పాదాలపై పడి దండం పెట్టానని, తన తల్లిదండ్రులకు ఆమె చేసిన సేవలకు రుణపడి ఉంటానని చెప్పానని ఆయన గుర్తు చేసుకున్నారు. తన తండ్రి, రంగనాథ్, మరణానికి ముందు తన గోడపై “డు నాట్ డిస్టర్బ్ మీనాక్షి” అని రాశారని, ఇది ఆమె పట్ల తన తండ్రికి ఉన్న గౌరవాన్ని సూచిస్తుందని తెలిపారు.

రంగనాథ్ ఆత్మహత్య చేసుకున్నప్పుడు, ఆ పని మనిషిని గురించి, కుమారుడు పట్టించుకోలేదని, ఆయనే చంపేశారని అనేక అసత్య ఆరోపణలు ప్రచారమయ్యాయని నాగేంద్ర కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో ఒక పోలీసు అధికారి కూడా తన ల్యాండ్ డిస్ప్యూట్ గురించి మాట్లాడుతుంటే, “రంగనాథ్ గారి కొడుకు కదా, తండ్రిని సరిగా చూసుకోలేదని, తనే చంపేశాడని” చులకనగా మాట్లాడారని ఆయన బాధతో గుర్తుచేసుకున్నారు. వ్యక్తిగత జీవితంలో నాగేంద్ర కుమార్ తీవ్రమైన కష్టాలను ఎదుర్కొన్నారు. చిన్న వయసులోనే తల్లిని కోల్పోయిన ఆయన, తండ్రిని కూడా ఆత్మహత్యలో పోగొట్టుకున్నారు. ఆ తర్వాత తన భార్య కూడా మానసిక అనారోగ్యంతో బాధపడుతూ ఎనిమిది, తొమ్మిది సార్లు ఆత్మహత్యాయత్నం చేసిందని, చివరికి పది ప్రయత్నంలో ఆమె చనిపోయిందని తెలిపారు. తన మామగారు 2017లో, అత్తగారు 2019లో మరణించారని, తన భార్య చనిపోవడంతో తాను ఒంటరిగా మారానని ఆయన చెప్పారు. తన కుమారుడి కోసం, తన బాబాయ్, పిన్ని, ఇద్దరు స్నేహితులు (హరీష్, రవి) మద్దతుతో బతుకుతున్నానని పేర్కొన్నారు.

ఎక్కువమంది చదివినవి :  K. Raghavendra Rao: ఆ హీరోయిన్‏తో 24 సినిమాలు చేశా.. అలాంటి చావు ఎవరికీ రాకూడదు.. డైరెక్టర్ రాఘవేంద్ర రావు..

Loading...
Unable to load recommendations.
Follow Us