Salman Khan House Firing: పక్కా స్కెచ్‌తో సల్మాన్‌ ఇంటిపై అగంతకుల కాల్పులు.. లక్ష అడ్వాన్, 3 రోజుల రెక్కీ!

బాలీవుడ్ అగ్రనటుడు సల్మాన్ ఖాన్ ఇంటి వెలువల జరిపిన కాల్పుల కేసులో రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తుంది. కాల్పులు జరిపిన నిందితులిద్దరినీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ సూచనల మేరకే సల్మాన్ ఇంటిపై దుండగులిద్దరూ కాల్పులు జరిపినట్లు విచారణలో స్పష్టమైంది. లారెన్స్ గ్యాంగ్‌తో షూటర్ సాగర్ పాల్ కాంటాక్ట్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాత విక్కీ గుప్తా ఈ ముఠాలో చేరాడు. షూటర్ సాగర్ పాల్ రెండేళ్లుగా..

Salman Khan House Firing: పక్కా స్కెచ్‌తో సల్మాన్‌ ఇంటిపై అగంతకుల కాల్పులు.. లక్ష అడ్వాన్, 3 రోజుల రెక్కీ!
Salman Khan House Firing
Follow us

|

Updated on: Apr 17, 2024 | 12:50 PM

బాలీవుడ్ అగ్రనటుడు సల్మాన్ ఖాన్ ఇంటి వెలువల జరిపిన కాల్పుల కేసులో రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తుంది. కాల్పులు జరిపిన నిందితులిద్దరినీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ సూచనల మేరకే సల్మాన్ ఇంటిపై దుండగులిద్దరూ కాల్పులు జరిపినట్లు విచారణలో స్పష్టమైంది. లారెన్స్ గ్యాంగ్‌తో షూటర్ సాగర్ పాల్ కాంటాక్ట్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాత విక్కీ గుప్తా ఈ ముఠాలో చేరాడు. షూటర్ సాగర్ పాల్ రెండేళ్లుగా హర్యానాలోనే ఉంటున్నాడు. ఈ క్రమంలోనే లారెన్స్ గ్యాంగ్‌కు దగ్గరయ్యాడు. తర్వాత రెండో నిందితుడు విక్కీ గుప్తా కూడా సాగర్‌తో దోస్తీ కట్టాడు. సల్మాన్‌పై దాడి చేసిన వీరిద్దరూ ఓ భారతీయ ఫోన్‌ నంబర్‌తో నిరంతరం టచ్‌లో ఉన్నట్లు దర్యాప్తులో తేలింది. ఇప్పుడు ఆ ఫోన్‌ నంబర్‌పై కూడా విచారణ జరుగుతోంది. అది ఎవరి నంబర్ అనే కోణంలో ఆరా తీస్తున్నారు.

ఏప్రిల్ 14న బాలీవుడ్‌ నటుడు సల్మాన్ ఖాన్ ఇంటిపై ఇద్దరు వ్యక్తులు కాల్పులు జరిపిన సంగతి తెలిసిందే. నేరం చేయడానికి ముందు, దాడికి పాల్పడిన వ్యక్తులు సల్మాన్ ఇంటి చుట్టూ మూడుసార్లు రెక్సీ నిర్వహించారు. దాడి అనంతరం నిందితులిద్దరినీ గుజరాత్‌లోని కచ్‌లో పోలీసులు వారిని అరెస్టు చేశారు. ముంబై పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిందితులు ఇద్దరూ బీహార్‌లోని చంపారన్‌ వాసులు. ఫిబ్రవరి 29 నుంచి మార్చి 1 మధ్య సల్మాన్ ఖాన్ ఇంటికి కేవలం ఒక కిలోమీటరు దూరంలో ఉన్న హోటల్ తాజ్ ల్యాండ్స్ ఎండ్ సమీపంలో దాడికి పాల్పడిన వ్యక్తులు పలుమార్లు కలుసుకున్నారు.

అడ్వాన్స్‌గా లక్ష రూపాయలు

ఈ కేసులో మరో ఆసక్తి్కర విషయం బయటపడింది. అదేమంటే.. దాడికి పాల్పడే ముందు నిందుతులు అడ్వాన్స్‌గా లక్ష రూపాయలు సుపారీ పుచ్చుకున్నారు. ఆ డబ్బుతో పన్వేల్‌లోని సల్మాన్‌ఖాన్‌ ఫామ్‌హౌస్‌కు 13 కిలోమీటర్ల దూరంలో వారిద్దరూ ఓ ఇంటిని అద్దెకు తీసుకున్నారు. ఇద్దరూ ఇక్కడి నుంచే ఫామ్‌హౌస్‌కు రెక్కీ నిర్వహించారు. పని పూర్తయిన తర్వాత మిగిలిన డబ్బు చెల్లిస్తామని అసలు సూత్రదారుడు ఇద్దరికీ హామీ ఇచ్చాడు. ఫిబ్రవరి 28 న అడ్వాన్స్‌ నగదు పుచ్చుకునేందుకు చంపారన్ నుంచి ముంబై సెంట్రల్‌కు వెళ్లారు.

ఇవి కూడా చదవండి

మార్చి 18న చంపారన్‌కు వెళ్లి తిరిగొచ్చారు

కొన్ని రోజులు పన్వేల్‌లో ఉన్న ఆ ఇద్దరూ మార్చి 18న హోలీ సందర్భంగా చంపారన్ వెళ్లారు. అయితే ఆ తర్వాత ఏప్రిల్ 1న తిరిగి పన్వేల్‌కు వచ్చారు. దీని తర్వాత ఏప్రిల్ 14 ఉదయం 5 గంటలకు వారిద్దరూ మోటార్ సైకిల్‌పై వెళుతూ బాంద్రాలోని సల్మాన్ ఖాన్ ఇంటి (గెలాక్సీ అపార్ట్‌మెంట్)పై 5 రౌండ్లు కాల్పులు జరిపారు. నాలుగు బుల్లెట్లు గోడను తాకగా, ఒక బుల్లెట్ అతని ఇంటి గ్యాలరీకి తాకింది. సరిగ్గా అదే ప్రదేశంలో సల్మాన్‌ నిలబడి తరచూ తన అభిమానులను పలకరిస్తుంటాడు.

విక్కీ బైక్‌ డ్రైవింగ్‌.. సాగర్‌ కాల్పులు..

సంఘటన జరగిన రోజున విక్కీ బైక్‌ డ్రైవింగ్‌ చేస్తుండగా.. బైక్‌పై వెనుక కూర్చున్న దుండగుడు సాగర్ పాల్ సల్మాన్‌ ఇంటిపై బుల్లెట్లు కాల్చాడు. బైక్ నడుపుతూనే లారెన్స్ గ్యాంగ్‌తో విక్కీ టచ్‌లో ఉన్నాడు. ఈ సంఘటన సంచలనంగా మారడంతో రంగంలోకి దిగిన ముంబై పోలీసుల బృందం గుజరాత్‌లోని భుజ్‌లో సోమవారం అర్ధరాత్రి విక్కీ, సాగర్‌లను అరెస్ట్ చేసి విమానంలో ముంబైకి తీసుకు వచ్చారు. కాల్పుల అనంతరం ముంబై నుంచి గుజరాత్ పారిపోయినట్లు పోలీసులు వివరించారు. అనంతరం వారిద్దరినీ కోర్టులో హాజరుపరచగా.. ఏప్రిల్ 25 వరకు పోలీసు రిమాండ్‌కు అప్పగించింది. ప్రస్తుతం ఈ వ్యవహారంపై విచారణ ఇంకా కొనసాగుతోంది.

మరిన్ని సినిమా కథనాల కోసం క్లిక్‌ చేయండి.