Crazy Fellow Movie Review: “క్రేజీ ఫెలో”గా మారిన ఆది సాయి కుమార్.. సినిమా ఎలా ఉందంటే

తాజాగా క్రేజీ ఫెల్లో అంటూ మరో సినిమాతో వచ్చేసారు. ఈ సారి పక్కా కమర్షియల్ కథతో వచ్చినట్లు అనిపిస్తుంది. మరి క్రేజీ ఫెల్లోలో నిజంగా అన్ని కమర్షియల్ అంశాలున్నాయా..

Crazy Fellow Movie Review: క్రేజీ  ఫెలోగా మారిన ఆది సాయి కుమార్.. సినిమా ఎలా ఉందంటే
Crazy Fellow
Follow us

|

Updated on: Oct 14, 2022 | 4:03 PM

మూవీ రివ్యూ:  క్రేజీ ఫెల్లో

నటీనటులు:  ఆది సాయికుమార్, దిగంగన సూర్యవంశీ, మిర్నా, సప్తగిరి, వినోదిని వైద్యనాథన్, అనీష్ కురువిల్లా, నర్రా శ్రీనివాస్ తదితరులు

సినిమాటోగ్రఫి: సతీష్ ముత్యాల

ఇవి కూడా చదవండి

సంగీతం: ఆర్ఆర్ ధ్రువన్

ఎడిటర్: సత్య గిడుతూరి

నిర్మాత: కేకే రాధమోహన్

కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: ఫణికృష్ణ

రిలీజ్: 2022-10-14

జయాపజయాలతో సంబంధం లేకుండా వరస సినిమాలు చేసే హీరోలలో ఆది సాయికుమార్ ముందుంటారు. ఈ ఏడాది ఇప్పటికే ఈయన రెండు మూడు సినిమాలతో వచ్చారు. తాజాగా క్రేజీ ఫెల్లో అంటూ మరో సినిమాతో వచ్చేసారు. ఈ సారి పక్కా కమర్షియల్ కథతో వచ్చినట్లు అనిపిస్తుంది. మరి క్రేజీ ఫెల్లోలో నిజంగా అన్ని కమర్షియల్ అంశాలున్నాయా..?

కథ:

అభిరామ్ (ఆది సాయికుమార్) లైఫ్ ఫుల్ ఎంజాయ్ చేస్తుంటాడు. జీవితంలో ఎలాంటి లక్ష్యం లేకుండా ఉంటాడు. ఒక్క బాధ్యత కూడా తీసుకోడు. అయితే మరీ ఖాళీగా ఉన్న అభిరామ్‌ను అతడి వదిన బలవంతపెట్టి అన్నయ్య స్నేహితుడు (సప్తగిరి) కంపెనీలో ఉద్యోగానికి చేరేలా చేస్తుంది. ఆ ఆఫీసులో పని చేసే మధుమిత అలియాస్ చిన్ని (దిగంగన సూర్యవంశీ)తో పరిచయం ఏర్పడుతుంది. కానీ వాళ్ళ మధ్య ఎప్పుడూ ఒక్క క్షణం కూడా పడదు. అదే సమయంలో స్నేహితుడు రమేష్ (నర్రా శ్రీనివాస్) బలవంతం మేరకు డేటింగ్ యాప్‌లో చిన్నితో రిలేషన్‌షిప్ కొనసాగిస్తుంటాడు అభిరామ్. డేటింగ్ చాలా రోజులు కొనసాగిన తర్వాత ఒకరోజు చిన్ని (దిగంగన)ను కలుసుకొనేందుకు వెళ్లి.. అదే పేరుతో అక్కడికి వచ్చిన చిన్ని (మిర్నా మీనన్)కు ఐ లవ్ యూ చెబుతాడు. ఆ యాప్‌లో నాని పేరుతో అభిరామ్ ఎందుకు చిన్నితో ఎందుకు డేటింగ్ చేశాడు.. మధుమితే తన ఆఫీసులో పని చేసే చిన్ని అని తెలియకుండా చేసిన డేటింగ్ ఎలాంటి సమస్యలు తీసుకొచ్చింది అనేది మిగిలిన కథ..

కథనం:

క్రేజీ ఫెల్లో కథ చూస్తే.. పదేళ్ళ కింద నితిన్ హీరోగా నటించిన గుండెజారి గల్లంతయిందే లైన్ గుర్తుకొస్తుంది. కానీ ఈ రెండు సినిమాలకు ట్రీట్మెంట్ మాత్రం వేరేలా ఉంటుంది. ఆలోచన అక్కడక్కడా సేమ్ అనిపిస్తుంది. అయినా కూడా తను రాసుకున్న కథను పూర్తిగా కమర్షియల్ పంథాలో నడిపించడానికి దర్శకుడు ముందు నుంచి ఫిక్స్ అయిపోయాడు. అలాగే ముందుకెళ్లాడు కూడా. హీరో తల్లిదండ్రులు చిన్నతనంలోనే చనిపోవడం.. వాళ్ల అన్నా, వదినల వద్ద గారాభంగా పెరుగడం.. బాధ్యత లేకుండా ఉండటం.. స్నేహితులతో కాలక్షేపం చేయడం.. ఫ్యామిలీ ఇరకాటంలో పడినపుడు హీరో వెంటనే ముందుకు రావడం.. ఇలా రొటీన్‌గానే సాగుతుంది క్రేజీ ఫెల్లో కథ. కానీ అందులో కావాల్సినంత ఎమోషనల్ సీన్స్ కూడా ఉండేలా చూసుకున్నాడు దర్శకుడు ఫణి. అప్పటి వరకు ఉన్న కథలో సెకండ్ హీరోయిన్ మిర్నా మీనన్ ఎంట్రీతో మరో మలుపు తిరుగుతుంది. అప్పటి వరకు తాను డేటింగ్ చేసిన అమ్మాయిని కాకుండా మరో అమ్మాయికి ప్రపోజ్ చేయడంతో కథ కొత్త కోణం తీసుకుంటుంది. అదే సెకండాఫ్‌పై ఆసక్తిని పెంచుతుంది. సెకండాఫ్‌లో రెండు చిన్ని పాత్రల మధ్య అభిరామ్ నలిగిపోయే డ్రామా భలే అనిపిస్తుంది. దాన్ని కామెడీగానే చెప్పే ప్రయత్నం చేసాడు దర్శకుడు. నర్రా శ్రీనివాస్ సపోర్టింగ్ రోల్‌ బాగుంది.. అతడితో వచ్చే సన్నివేశాలు కూడా ఆకట్టుకుంటాయి. కన్ఫ్యూజింగ్‌గా అనిపించినా.. స్క్రీన్ ప్లే మాత్రం బాగానే అల్లుకున్నాడు దర్శకుడు.

నటీనటులు:

ఆది సాయికుమార్ బాగున్నాడు.. స్క్రీన్ మీద ఆకట్టుకున్నాడు.. అలాగే లవర్‌ బాయ్ క్యారెక్టర్‌లోనూ బాగా చేసాడు. మంచి ఈజ్‌తో కనిపించాడు. ఈయనకు తగిన పాత్రలు పడితే ఎలా చేస్తాడో మరోసారి నిరూపించుకున్నాడు ఆది. అభిరామ్‌గా అతడి మేకోవర్ చాలా బాగుంది.. అలాగే ఇద్దరమ్మాయిల మధ్య నలిగే పాత్రలోనూ చాలా మంచి ఎక్స్‌ప్రెషన్స్ ఇచ్చాడు. చాలా రోజుల తర్వాత ఆది నటనలో ఫ్రెష్ నెస్ కనిపించింది. ఒకే పాత్రలో వేరియేషన్స్‌, ఎమోషన్స్‌ను చక్కగా చూపించాడు. ఫైట్స్, డాన్స్‌లలో బాగున్నాడు. మధుమతిగా దిగంగన సూర్యవంశీ గ్లామర్‌గానూ.. పెర్ఫార్మెన్స్ పరంగానూ బాగానే ఉంది. మరో చిన్నిగా మిర్నామీనన్ బబ్లీగా, క్యూట్‌గా అనిపించింది. గబ్బర్ సింగ్ ఫేమ్ నర్రా శ్రీనివాస్ కామెడీ ఈ సినిమాకు బాగానే ప్లస్ అవుతుంది. మిగిలిన పాత్రలన్నీ ఓకే..

టెక్నికల్ టీం:

ఆర్ఆర్ ధృవన్ సంగీతం పర్లేదు. బ్యాగ్రౌండ్ స్కోర్ ఆకట్టుకుంటుంది. సతీష్ ముత్యాల సినిమాటోగ్రఫి రిచ్‌గా అనిపిస్తుంది. సత్య గిడుతూరి ఎడిటింగ్ బాగుంది. సెకండాఫ్ ఇంకాస్త ఫాస్టుగా ఉండుంటే బాగుండేది. కేకే రాధామోహన్ నిర్మాణ విలువలు రిచ్‌గానే ఉన్నాయి. దర్శకుడు ఫణి కృష్ణ ఎక్కడ తడబాటు పడకుండా అనుభవం ఉన్న దర్శకుడిగా సినిమాను తెరకెక్కించాడు. కాకపోతే మరీ రొటీన్ కథ కావడమే ఈ సినిమాకు మైనస్ అయ్యే అవకాశం ఉంది.

పంచ్ లైన్:

క్రేజీ ఫెల్లో.. కాలక్షేపం కోసం ట్రై చేయొచ్చు..

(Praveen Kumar TV9 ET)

Latest Articles
భారీ హోర్డింగ్ ఏర్పాటు అక్రమమని అధికారులకు ముందే తెలుసా..
భారీ హోర్డింగ్ ఏర్పాటు అక్రమమని అధికారులకు ముందే తెలుసా..
హీరోయిన్ లైలా ఫ్యామిలీని చూశారా..
హీరోయిన్ లైలా ఫ్యామిలీని చూశారా..
ఓరీ దేవుడో.. డీజిల్‌తో పరాఠా తయారీ.. వీడియో చూస్తే షాక్‌ అవుతారు
ఓరీ దేవుడో.. డీజిల్‌తో పరాఠా తయారీ.. వీడియో చూస్తే షాక్‌ అవుతారు
నిద్ర లేచిన వెంటనే ఈ వస్తువులు కనిపించాయా అదృష్టం మీ సొంతం..
నిద్ర లేచిన వెంటనే ఈ వస్తువులు కనిపించాయా అదృష్టం మీ సొంతం..
BRSకు డిపాజిట్లు రావు.. పరిపాలనపైనే మా దృష్టి: సీఎం రేవంత్ రెడ్డి
BRSకు డిపాజిట్లు రావు.. పరిపాలనపైనే మా దృష్టి: సీఎం రేవంత్ రెడ్డి
బరువు తగ్గాలనుకుంటే రాత్రి పొరపాటున కూడా ఈ 4 పదార్థాలను తినొద్దు
బరువు తగ్గాలనుకుంటే రాత్రి పొరపాటున కూడా ఈ 4 పదార్థాలను తినొద్దు
ఆ విషయంలో రామ్‌చరణ్‌ ని ఫాలో అవుతున్న విజయ్‌ దేవరకొండ
ఆ విషయంలో రామ్‌చరణ్‌ ని ఫాలో అవుతున్న విజయ్‌ దేవరకొండ
లక్నోతో కీలక మ్యాచ్.. టాస్ ఓడిన ఢిల్లీ.. పంత్ మళ్లీ వచ్చేశాడు
లక్నోతో కీలక మ్యాచ్.. టాస్ ఓడిన ఢిల్లీ.. పంత్ మళ్లీ వచ్చేశాడు
‘ఆపరేషన్ నాథ్’.. కర్ణాటకలో కాంగ్రెస్ సర్కారుకు గండం..!
‘ఆపరేషన్ నాథ్’.. కర్ణాటకలో కాంగ్రెస్ సర్కారుకు గండం..!
ఏపీ ఫీవర్‌.. ప్రభుత్వానికి అనుకూలమా? వ్యతిరేకమా? సంకేతమేంటి..
ఏపీ ఫీవర్‌.. ప్రభుత్వానికి అనుకూలమా? వ్యతిరేకమా? సంకేతమేంటి..