అప్పుడే OTTలోకి వస్తున్న  సుహాస్ కొత్త సినిమా

Phani.ch

14 May 2024

ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమలో సక్సెస్‏ఫుల్ చిత్రాలతో దూసుకుపోతున్న హీరో సుహాస్. విభిన్నమైన కంటెంట్.. వైవిధ్యమైన పాత్రలు పోషిస్తూ ప్రేక్షకులకు దగ్గరవుతున్నాడు.

ఇటీవలే అంబాజీపేట మ్యారేజ్ బ్యాండు సినిమాతో సూపర్ హిట్ అందుకున్న సుహాస్.. కొద్ది రోజుల క్రితమే ప్రసన్న వదనం సినిమాతో మరోసారి అడియన్స్ ముందుకు వచ్చాడు.

 ట్విస్టులు, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ అలరించాయని.. ఇక ఇంటర్వెల్ ట్విస్ట్ అదిరిపోయిందని అడియన్స్ న్నారు.

సరికొత్త కాన్సెప్ట్ తో వచ్చిన ఈ సినిమాకు పాజిటివ్ రివ్యూస్ వచ్చాయి. మరోసారి తనదైన సహజ నటనతో ప్రశంసలు అందుకున్నాడు సుహాస్.

విడుదలైన వారం రోజుల్లోనే 5 కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది. అలాగే బ్రేక్ ఈవెన్ టార్గెట్ అందుకుని ప్రాఫిట్ కూడా తీసుకువచ్చిందని మేకర్స్ వెల్లడించారు.

ఇక థియేటర్లలో సక్సెస్ అయిన ప్రసన్న వదనం సినిమా ఇప్పుడు ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ చేసుకుందని తెలుస్తుంది.

లేటేస్ట్ అప్డేట్ ప్రకారం  ఈ మూవీ డిజిటిల్ స్ట్రీమింగ్ రైట్స్ ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహా కొనుగోలు చేసినట్లు సమాచారం.

అయితే ఇంకా ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ తెలియరాలేదు. కానీ మరికొద్ది రోజుల్లోనే ఈ మూవీ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించనున్నారని టాక్ వినిపిస్తుంది.