14 May 2024
ఆఫర్స్ లేవు.. అలాంటి పాత్రలు చేసేందుకు రెడీ అయిన పూజా హెగ్డే..
Rajitha Chanti
Pic credit - Instagram
చాలారోజులుగా సినిమాలకు దూరంగా ఉంటుంది హీరోయిన్ పూజా హెగ్డే. ఈ ముద్దుగుమ్మ చేతిలో ఇప్పుడు ఒకే ఒక్క సినిమా ఉంది.
బాలీవుడ్ ఇండస్ట్రీలో సరైన అవకాశాల కోసం వెయిట్ చేస్తోంది పూజా. కానీ ఈ బ్యూటీకి ఆశించినంతగా ఆఫర్స్ రావట్లేదని సమాచారం.
అటు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ ఎప్పటికప్పుడు లేటేస్ట్ ఫోటోస్ షేర్ చేస్తూ కుర్రాళ్లకు నిద్రలేకుండా చేస్తుంది ఈ ముద్దుగుమ్మ.
తాజాగా ఈ బ్యూటీ ఓ షాకింగ్ నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రజెంట్ ఈ బ్యూటీకి తెలుగు, హిందీలో ఎలాంటి ఆఫర్స్ లేవు.
దీంతో తల్లి పాత్రలు చేసేందుకు కూడా రెడీ అయినట్లు తెలుస్తోంది. ఇప్పుడు ఇదే విషయంపై బాలీవుడ్ ఇండస్ట్రీలో సైతం క్లారిటీ వచ్చిందట.
ప్రస్తుతం అవకాశాలు అంతగా లేని పూజాకు ఓ డైరెక్టర్ అదిరిపోయే ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తోంది. కంటెంట్ నచ్చడంతో పూజా ఓకే చెప్పిందట.
ఓ సినిమాలో తల్లి పాత్ర చేయడానికి పూజా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాక్ వినిపిస్తుంది. కంటెంట్, పాత్ర ప్రాధాన్యత నచ్చడంతో పూజా ఎస్ చెప్పిందట.
ఇక ఇందుకు భారీగానే రెమ్యునరేషన్ తీసుకుంటుందట పూజా. అయితే ఈ విషయం పై అధికారిక క్లారిటీ రాలేదు. కానీ బీటౌన్లో చర్చ నడుస్తుంది.
ఇక్కడ క్లిక్ చేయండి.