పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ కొత్త సినిమా.. డైరెక్టర్ ఎవరంటే

టాలీవుడ్ రాక్ స్టార్ మంచు మనోజ్ వరుస సినిమాలతో మళ్లీ బిజీగా మారిపోయాడు. ముఖ్యంగా ఇప్పటివరకు హీరోగానే కనిపించిన మనోజ్ మిరాయ్ సినిమాలో విలన్ గా అదరగొట్టాడు. ‘ది బ్లాక్ స్వోర్డ్’ పాత్రలో అద్భుతంగా నటించి విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు .

పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ కొత్త సినిమా.. డైరెక్టర్ ఎవరంటే
Manchu Manoj

Updated on: Oct 20, 2026 | 12:32 PM

మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో బిగ్ బడ్జెట్ డివైన్ యాక్షన్ థ్రిల్లర్ తెరకెక్కుతుంది. ఈ సినిమా పోతరాజు నేపథ్యంలో తెరకెక్కుతోందని తెలుస్తుంది. ప్రేమకథా చిత్రం, ‘జక్కన్న’ చిత్రాల నిర్మాతల నుంచి ఈ ప్రతిష్టాత్మక చిత్రం తెరకెక్కనుంది. విభిన్నమైన కథలు, పవర్‌ఫుల్ పాత్రలతో ప్రేక్షకులను అలరిస్తున్న హీరో మంచు మనోజ్ మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, పోతరాజు నేపథ్యంలో రూపొందనున్న ఈ బిగ్ బడ్జెట్ చిత్రాన్ని ‘డివైన్ యాక్షన్ థ్రిల్లర్’గా తెరకెక్కిస్తున్నారు. RPA క్రియేషన్స్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ చిత్రం ఆ సంస్థకు ప్రొడక్షన్ నం. 4.

బాబోయ్.. ఈ చిన్నది బయట ఎలా ఉందో చూశారా..! స్టార్ హీరోయిన్స్ కూడా కుళ్లుకోవాల్సిందే

‘ప్రేమకథా చిత్రం’, ‘జక్కన్న’ వంటి విజయవంతమైన చిత్రాలను నిర్మించిన R. P. అక్షిత రెడ్డి,  సుదర్శన్ రెడ్డి ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని నిర్మిస్తున్నారు. బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ వద్ద కో-డైరెక్టర్‌గా పనిచేసిన ఏ. శ్రీధర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. దర్శకుడు ఈ సినిమా కోసం అత్యంత  పవర్ ఫుల్ కథను సిద్ధం చేశారు. ఇప్పటివరకు మంచు మనోజ్‌ను చూడని సరికొత్త అవతార్‌లో ఈ చిత్రంలో చూపించబోతున్నారు.

రజినీకాంత్‌కు జోడీగా 27 ఏళ్ల హీరోయిన్.. భారీ అంచనాలతో విడుదలై అట్టర్ ఫ్లాప్ అయిన సినిమా

పోతరాజు నేపథ్యంలో దైవిక అంశాలు, ఉత్కంఠభరితమైన కథనం, భారీ యాక్షన్ సన్నివేశాల సమ్మేళనంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. తెలంగాణ పండుగల వైభవం, సంప్రదాయాల నేపథ్యంతో రూపొందనున్న ఈ చిత్రం ప్రేక్షకులకు సరికొత్త సినిమాటిక్ అనుభూతిని అందించనుంది. ఈ చిత్రానికి ఎం. శ్రీకాంత్ రెడ్డి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా, ఆర్. ఆయుష్ రెడ్డి కో-ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి సంబంధించిన టైటిల్, ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణులు, షూటింగ్ తదితర వివరాలను చిత్రబృందం త్వరలోనే అధికారికంగా వెల్లడించనుంది.

ఇవి కూడా చదవండి

మహేష్ బాబు తర్వాత ఆ హీరో నటన అంటే నాకు చాలా ఇష్టం: సూపర్ స్టార్ కృష్ణ

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us