Deepika Padukone: దీపికా నిబద్ధతకు హ్యాట్సాఫ్..! ఏడు మాసాల గర్భంతోనే..

ఏడు నెలల గర్భిణిగా ఉన్నప్పటికీ దీపికా పదుకొణె తన అంకితభావాన్ని చాటుకుంటున్నారు. అట్లీ దర్శకత్వంలోని తెరకెక్కుతున్న 'రాకా' (Raaka Movie) సినిమా కోసం యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణను దీపిక పూర్తిచేసినట్లు సమాచారం. మెటర్నిటీ బ్రేక్‌కు ముందే సినిమా షూటింగ్ పూర్తి చేసేందుకు.. రాత్రిపూట కూడా సినిమా షూటింగ్‌లలో దీపిక పాల్గొంటున్నారట. వృత్తిపట్ల ఆమె చూపుతున్న నిబద్ధత పట్ల అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు.

Deepika Padukone: దీపికా నిబద్ధతకు హ్యాట్సాఫ్..! ఏడు మాసాల గర్భంతోనే..
Deepika Padukone In Raaka Movie

Updated on: Jul 17, 2026 | 4:53 PM

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె మరోసారి తన వృత్తిపట్ల ఉన్న అంకితభావాన్ని చాటుకుంటోంది. దర్శకుడు అట్లీ తెరకెక్కిస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం ‘రాకా’లో అల్లు అర్జున్ హీరోగా నటిస్తుండగా, దీపికా పదుకొణె ప్రధాన పాత్రలో కనిపించనుంది. భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ చిత్రంపై ఇప్పటికే దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. త్వరలో రెండో బిడ్డకు జన్మనివ్వబోతున్న దీపికా ఏడు నెలల గర్భిణిగా ఉన్నప్పటికీ.. ‘రాకా’ షూటింగ్‌లో పాల్గొంటున్నారు. మరీ ముఖ్యంగా ఈ సినిమాలో కఠినమైన యాక్షన్ సన్నివేశాలను దీపిక ప్రెగ్నెన్సీతోనే పూర్తి చేసినట్లు తెలుస్తోంది.

దీపికా తన మెటర్నిటీ బ్రేక్‌కు ముందే వీలైనంత వరకు షూటింగ్ పూర్తి చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా రాత్రిపూట కూడా షూటింగ్‌లు, శారీరకంగా కాస్త కఠినమైన యాక్షన్ సన్నివేశాలను కూడా చేశారట. అయితే ఆమె ప్రెగ్నెన్సీని దృష్టిలో పెట్టుకుని.. యాక్షన్ సన్నివేశాల షూటింగ్ సమయంలో అన్ని ప్రత్యేక భద్రతా చర్యలు తీసుకున్నట్లు సమాచారం. ప్రమాదకరమైన స్టంట్ల కోసం అవసరమైతే బాడీ డబుల్‌ను కూడా ఉపయోగించినట్లు బాలీవుడ్ మీడియా వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. దీంతో ‘రాకా’ సినిమా షూటింగ్‌తో పాటు తల్లి, బిడ్డ ఆరోగ్యానికి కూడా సమాన ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలుస్తోంది.

గతంలో సినిమా ఇండస్ట్రీలో ఎనిమిది గంటల పని నిబంధనకు సపోర్ట్‌గా దీపిక చేసిన కామెంట్స్ చర్చనీయాంశంగా మారింది. అయితే ఇప్పుడు ఈ నిబంధనను పట్టించుకోకుండా ప్రెగ్నెన్సీలోనూ రాత్రిపూట కూడా షూటింగ్‌లో పాల్గొనడం విశేషం. గర్భధారణ సమయంలోనూ తన వృత్తిపట్ల దీపికా చూపుతున్న నిబద్ధతపై అభిమానులు, నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.

మరోవైపు, ‘రాకా’ చిత్రంపై ఫ్యాన్స్‌లో ఆసక్తి కూడా మరింత పెరుగుతోంది. ఈ సినిమాలో అల్లు అర్జున్–దీపికా జోడీని తొలిసారి పెద్ద తెరపై చూడబోతుండటంతో అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Follow Us