డ్యాన్స్ తక్కువ… దందాలే ఎక్కువ.. కొరియోగ్రఫీ క్రాఫ్ట్‌లో నాటునాటు ఆట..!

ప్రపంచాన్ని ఊపేసి, టాలీవుడ్‌కి రెండు ఆస్కార్ అవార్డులు కొల్లగొట్టిన నాటునాటు పాట గుర్తుందా? మనం మర్చిపోయినా ప్రపంచం మర్చిపోదు. ఎందుకంటే, 95 అకాడెమీ అవార్డ్స్‌ బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో హిట్ కొట్టి హిస్టరీ క్రియేట్ చేసిందా పాట. ట్రాక్‌ ఇచ్చిన కీరవాణి, లిరిక్స్‌ రాసిన చంద్రబోస్ కంటే.. ఇద్దరు టాప్‌ హీరోలు ఆ పాటకు చేసిన ఫుట్‌వర్క్ గురించే ప్రపంచమంతా మాట్లాడుకుంది. నాటునాటు పాటకు కొరియోగ్రఫీ డిజైన్ చేసిన ప్రేమ్‌రక్షిత్‌కు హాలీవుడ్‌ కూడా బ్రహ్మరథం పట్టింది. పాప్ కింగ్ మైఖేల్‌జాక్సన్‌ టీమ్‌లో ఉన్న వరల్డ్ ఫేమస్ కొరియోగ్రాఫర్ విన్సెంట్ పీటర్సన్.. మన డ్యాన్స్‌మాస్టర్‌ ప్రేమ్‌రక్షిత్‌ను పొగడ్తలతో ఆకాశానికెత్తేశారు. ఏదో ఒకరోజు తప్పకుండా మిమ్మల్ని కలుస్తా అని ట్వీట్ చేశారు. అదీ టాలీవుడ్ కొరియోగ్రఫీకి ఉన్న కెపాసిటీ అండ్ క్రెడిబులిటీ. మరి, ఇప్పుడేమవుతోంది? మన కొరియోగ్రఫీ డిపార్ట్‌మెంట్‌ చరిత్రను తిరగరాస్తున్న శాల్తీలెవరు? టాలీవుడ్‌లో జరుగుతున్న డ్యాన్స్‌ బాబోయ్ డ్యాన్స్ ఎపిసోడ్‌‌లో ఏం జరుగుతోంది.

డ్యాన్స్ తక్కువ... దందాలే ఎక్కువ.. కొరియోగ్రఫీ క్రాఫ్ట్‌లో నాటునాటు ఆట..!
Tollywood Dance Masters Controversy

Updated on: Jul 14, 2026 | 9:45 PM

అల్లు అర్జున్ అయినా, రామ్‌చరణ్ అయినా, జూనియర్ ఎన్టీఆర్, మహేష్‌ బాబు అయినా! అంతెందుకు.. మెగాస్టార్ చిరంజీవి అయినా సరే టాలీవుడ్‌లో ప్రతీ కటౌట్‌ వెనుకా వాళ్ల కొరియోగ్రాఫర్ల కష్టమే ఎక్కువగా ఉండేది. నటనా చాతుర్యం వాళ్లవాళ్ల సొంత టాలెంట్‌ మీదే డిపెండై ఉంటుంది. కానీ, డ్యాన్సుల్లో వాళ్లు వేసే మెస్మరైజింగ్‌ స్టెప్స్‌తోనే వాళ్లకంత పాపులారిటీ వచ్చేది. కానీ, హీరో వేసే ప్రతీ స్టెప్పు వెనుక ఒక డ్యాన్స్‌ మాస్టర్ ఉంటాడు. హీరోయిజాన్ని రెట్టింపు చేసే సత్తా ఈ డ్యాన్స్‌మాస్టర్ల కాళ్లూ చేతుల్లోనే ఉండేది. కానీ, ఆ డ్యాన్స్‌ మాస్టర్లే రింగుమాస్టర్లుగా తయారై, కొరియోగ్రఫీ డిపార్ట్‌మెంట్‌ను ఒక సిండికేట్‌గా మారిస్తే..? పైసల కక్కుర్తితో గ్రూప్ డ్యాన్సర్ల జిందగీలతో గేమ్స్ ఆడుకుంటే..? ఇన్‌డైరెక్ట్‌గా దాని ఎఫెక్ట్ మొత్తం ఇండస్ట్రీ బతుకు మీద పడితే! టాలీవుడ్‌లో బిహైండ్‌ ది డ్యాన్స్‌ అచ్చంగా ఇదే జరుగుతోంది. వాళ్లల్లో వాళ్లే కొట్టుకుని వాళ్ల కంపును వాళ్లే బైటబెట్టుకుని, చివరాఖరికి ప్రేక్షక జనాభాలో పలుచనైపోతున్నారు. సినీ ప్రపంచంలో డ్యాన్స్‌కీ, డ్యాన్స్ యూనియన్లకీ పెద్దపెద్ద ప్రయారిటీలే ఉన్నాయి. కానీ, ఇంత గట్టి క్రెడిట్ ఉన్న కొరియోగ్రఫీ సెక్షన్‌లో ఎందుకీ కుమ్ములాట సీన్లు..? టాలీవుడ్‌లో టాప్‌మోస్ట్ కొరియోగ్రాఫర్లుగా పేరున్న శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్ టీమ్స్‌...

Follow Us

పూర్తి కథనాన్ని చదివేందుకు TV9 యాప్‌ని డౌన్‌లోడ్ చేయండి

ప్రత్యేకమైన కథనాలకు అపరిమితమైన యాక్సెస్ TV9 యాప్‌లో కొనసాగండి