Brahmamudi, November 2nd Episode: నిజం బయట పెట్టేసిన స్వప్న.. కావ్యకు రాజ్ వార్నింగ్..

|

Nov 02, 2024 | 1:33 PM

ఈ రోజు బ్రహ్మముడి ఎపిసోడ్‌లో ట్విస్టుల మీద ట్విస్టులు నెలకొన్నాయి. అపర్ణ, సుభాష్‌లు కలిసిపోయారని ఇందిరా దేవి చెబుతుంది. దీంతో కావ్య ఎంతో సంతోషిస్తుంది. అయితే అంతలోనే రాజ్.. కావ్యకు ఫోన్ చేసి సీరియస్ వార్నింగ్ ఇస్తాడు. దీంతో కావ్య మనసు విరిగిపోతుంది. మరి కావ్య మళ్లీ ఏం చేస్తుందో తెలియాలి..

Brahmamudi, November 2nd Episode: నిజం బయట పెట్టేసిన స్వప్న.. కావ్యకు రాజ్ వార్నింగ్..
Brahmamudi
Image Credit source: Star maa
Follow us on

ఈ రోజు బ్రహ్మముడి ఎపిసోడ్‌లో.. ఓడిపోయి బాధ పడుతున్న రుద్రాణిని స్వప్న ఇరిటేట్ చేస్తూ ఉంటుంది. ‘అనుకున్నది ఒక్కటి.. అయినది ఒక్కటి అంటూ’ సాంగ్ ప్లే చేస్తుంది. దీంతో ఇరిటేట్ అయిన రుద్రాణి.. ఈ సిచ్యువేషన్‌లో ఈ పాట ఏంటి? బయటకు పో అంటూ సీరియస్ అవుతుంది. ఎందుకు అంత సీరియస్ అవుతున్నావు అత్తా.. ఈ సిచ్యువేషన్ రావడానికి కారణం ఏంటి అనుకుంటున్నావ్? అని అంటుంది. ఏంటి? అని ఆతృతగా అడుగుతుంది రుద్రాణి. ఒక్కసారి ఫోన్ కాల్ గుర్తు తెచ్చుకో.. కావాలనే నీ ముందు కావ్యతో మాట్లాడుతున్నట్టు నటిస్తూ.. నీ దగ్గర కలరింగ్ ఇచ్చా.. అది నిజమని నువ్వు నమ్మేసి పాపం ఆ అనామికకు చెప్పావు. ఆ తింగరిది నిన్ను గుడ్డిగా నమ్మేసి.. వెళ్లి వేలం పాట పాడింది. చివరకు రూ.40 కోట్ల నష్టం వచ్చిందని చెప్పి నవ్వుకుంటూ వెళ్లిపోతుంది స్వప్న. దీంతో రుద్రాణి, రాహుల్‌లు మండిపోతారు. ఎలాగైనా ఆ కావ్యని, ఈ స్వప్న పీడ వదిలించుకోవాలని ఫిక్స్ అవుతారు. ఈసారి కొట్టే దెబ్బ గట్టిగా ఉంటుంది.. ఈ రుద్రాణి ఏంటో చూపిస్తా అంటూ కోపంతో రగిలిపోతుంది రుద్రాణి.

కావ్యకు శుభవార్త..

ఆ తర్వాత ఎవరూ లేని సమయం చూసి కావ్యకి ఫోన్ చేస్తుంది ఇందిరా దేవి. నీకు ఓ శుభవార్త చెప్పబోతున్నా.. మీ మావయ్య గారిని మీ అత్తయ్య క్షమించేసింది. ఇప్పుడు ఇద్దరూ కలిసి పోయారు. వాళ్లను చూస్తుంటే ఎంతో సంతోషంగా ఉందని అంటుంది. అది విన్న కావ్య.. అవునా.. మావయ్య, అత్తయ్య కలిసి పోయారా.. ఇంత సంతోషకరమైన వార్త ఇప్పుడా చెప్పేది అంటూ కావ్య అంటుండగా.. అది విని కనకం షాక్ అవుతుంది. ఇప్పుడు ఇంట్లో అంతా పండగలా ఉంది. అపర్ణ మనసు మారి.. వాళ్లిద్దరూ కలిసేలా చేసింది నువ్వేనమ్మా.. తల్లి మారింది.. ఇక కొడుకు మాత్రమే మిగిలి ఉన్నాడు. వాడు కూడా త్వరలోనే మారి.. నిన్ను త్వరలోనే ఈ ఇంటికి తీసుకొస్తాడని అంటుంది.

మారని మూర్ఖత్వపు రాజ్..

ఆ తర్వాత కావ్యకి రాజ్ ఫోన్ చేస్తాడు. రాజ్ ఫోన్ చూసిన కావ్య సంతోష పడుతూ కాల్ లిఫ్ట్ చేస్తుంది. కానీ మారని ముర్ఖుడు రాజ్.. ఈ సారి ఏం నాటకడం ఆడి.. మా అమ్మని మాయ చేశావ్? మోసం చేయడం, నాటకాలు ఆడటం, ఎదురు దెబ్బలు కొట్టడం, కావాల్సింది సాధించుకోవడం నీకు బాగా తెలుసు కదా.. నువ్వు చేసే గారడీలు మా అమ్మానాన్నల మీద ప్రయోగించాలని చూస్తే మర్యాదగా ఉండదని వార్నింగ్ ఇస్తాడు. దీంతో కావ్య అప్సట్ అవుతుంది. ఈయన ఎక్కడ మారేది.. అంటూ తాను చేసింది మోసం కాదని అపర్ణ, అనామికల గురించి చెప్పాలని ప్రయత్నించినా రాజ్ చెప్పనివ్వడు. దీంతో కోపంతో ఫోన్ పెట్టేస్తుంది కావ్య. మరోవైపు అనామికను చేసిన నష్టం గురించి ఆలోచిస్తూ ఉంటాడు సామంత్. అనామిక మీద కోపంతో రగిలిపోతూ ఉంటాడు.

ఇవి కూడా చదవండి

ఇక నిన్నటి ఎపిసోడ్‌లో..

వేలం పాట అయిపోతుంది. అనామికతో చేతులు కలిపిందని రుద్రాణి కావ్యని నిందిస్తుంది. ఎవరు ఎవరితో చేతులు కలిపారో కాసేపట్లో తెలుస్తుందని కావ్య సంతోషంగా ఉంటుంది. అప్పుడే సామంత్ వచ్చి.. వేలం అయిపోలేదు కదా.. అని అంటాడు. నువ్వే లేట్ వేలం పాట అయిపోయింది.. మనమే విజయం సాధించాం. రూ.40 కోట్లకు ఆ అరవింద్ కంపెనీని కొన్నామని అనామిక అనగానే.. సామంత్ సీరియస్ అవుతూ.. నన్ను నిలువునా ముంచేశావ్ అనామిక.. ఐదారు కోట్లు పెట్టినా ఎక్కువే. అసలే బ్యాంక్‌లో పది కోట్ల దాకా అప్పు ఉంది. ఇప్పుడు మనకు రూ.35 కోట్ల నష్టం అని అనామికను తిడతాడు సామంత్. అప్పుడే కావ్య మాట్లాడుతూ.. సామంత్ ఎంత నష్టం రూ.35 కోట్లు.. దటీజ్ కావ్య అని అంటుంది. అప్పుడే అరవింద్ వచ్చి.. థాంక్యూ మేడమ్ మీరు వచ్చి వేలం పాట పెంచకపోయి ఉంటే.. ఐదు కోట్లకు మించి ఎవరూ కొనే వారే కాదు. మనం అనుకున్నట్టుగా రూ.15 కోట్ల లాభం మీకు.. రూ.15 కోట్ల లాభం నాకు.. ఇదిగోండి చెక్ అని అరవింద్ చెక్ ఇచ్చి ఎంతో సంతోషంగా వెళ్తాడు.

పాపం అనామిక.. సామంత్ వార్నింగ్..

ఎవరి వేలితో వారి కన్నే పొడవడం అంటే ఇదే అనామిక.. నువ్వు నన్ను మోసం చేసి నీ కంపెనీకి అవార్డు వచ్చేలా చేశావు. నేను నీ తెలివి తక్కువ తనాన్ని వాడుకుని.. కోట్ల నష్టం వచ్చేలా చేశాను. నాకు కోట్ల లాభం వచ్చిందని కావ్య అంటుంది. ఇందకా రుద్రాణి ఏదో వాగింది. ఇప్పుడెందుకు గమ్ రాసినట్టు నోరు మూత పడింది. ఏమే అనామకురాలా.. ఇప్పుడు అర్థమైందా? మేము ఓడిపోయినా లాభమే పొందాం.. నీ పతనం మొదలైపోయిందని కనకం అంటుంది. ఆ.. రుద్రాణి గారు ఆస్పత్రికి వెళ్లి ఈసీజీ తీయించుకోండి.. మీ గుండె ఆగిపోయిందని కావ్య అంటుంది. రుద్రాణి ఏమీ మాట్లాడకుండా ఉంటుంది. ఇక రాజ్ సీరియస్‌గా చూసి వెళ్లిపోతూ ఉంటే.. కావ్య రాజ్ వెనుక వెళ్తుంది. సామంత్ వీళ్లందర్నీ షూట్ చేసి పారేయాలని అనామిక అంటే.. మరి నేను నిన్ను ఏం చేయాలి? అని సామంత్ సీరియస్‌గా అంటాడు. దీన్ని నువ్వేం చేయకు.. ఇప్పటికైనా బుద్ధి తెలుసుకుని వదిలి పెట్టమని.. లేదంటే నడి రోడ్డుమీద నిలబడాల్సి ఉంటుంది. ఏదో కూత కూశావ్.. నాలుక కోసి పారేస్తా.. నీకూ దానికి తేడా ఏముందే.. ఛీ అంటూ రుద్రాణికి, అనామికకు వార్నింగ్ ఇచ్చి వెళ్తుంది కనకం.

మోసం చేసి గెలిచావ్..

ఎవరో ఏంటో ఎందుకో ఎలాగో.. నన్ను నమ్మలేదు. ఇప్పుడన్నా నేను నిన్ను నమ్ముతానా ఆ తల్లి బుద్ధులే నీకూ వచ్చాయి. ఎలాగైనా ఎదుటి వాళ్లను మోసం చేయాలని ఇలా చేశావు? ఇది కూడా ఒక గెలుపేనా? సొంత తెలివి తేటలతో పైకి రావాలని రాజ్ అంటాడు. అయ్యయ్యో ఇలాంటి స్టేట్మెంట్స్ ఇచ్చే ముందు ఆలోచించాలి. ఒకప్పుడు మీరే నాకు హిత బోధ చేశారని.. ఫ్లాష్ బ్యాక్‌లోకి వెళ్తారు.. అక్కడ రాజ్ తన తెలివితో.. ఎదుటి కంపెనీని మోసం చేస్తాడు. మన తెలివితో ఎదుటి వాళ్లను దెబ్బ కొట్టాలి. ఇది చాణక్య నీతి.. అని అంటాడు. గుర్తొచ్చిందా.. చాణక్య నీతి అని చెప్పారు కదా.. ఇవన్నీ చెప్పింది ఎవరు? మీ బాటలోనే నడిచానని కావ్య అంటే.. లంచ్‌కి టైమ్ అయిందని రాజ్ వెళ్లిపోతాడు. అప్పుడే రుద్రాణి వచ్చి.. రాజ్ ఆగు ఆగు.. అంటూ పిలుస్తుంది. అయినా పట్టించుకోకుండా రాజ్ వెళ్తాడు.

రుద్రాణికి ఇచ్చి పడేసిన కావ్య..

పాపం ఒంటరిగా మిగిలిపోయినట్టు ఉన్నారు.. ఎదుటి వాళ్లను మోసం చేయాలని చూస్తే ఇలాగే ఒంటరిగా ఉంటారని కావ్య అంటుంది. నా కంటే మీ అమ్మ తక్కువనా క్యాన్సర్ నాటకం ఆడిందని రుద్రాణి అంటే.. మా అమ్మ విడిపోయిన భార్యాభర్తలను కలపడానికి నాటకం ఆడింది.. మీలా విడగొట్టేందుకు కాదు.. చాలా తేడా ఉందని కావ్య అంటుంది. అప్పుడే పెద్దావిడ కావ్యకి ఫోన్ చేస్తుంది. మీ అత్తగారి పద్దతి ఏమీ బాలేదు. రోజు రోజుకూ మీ మావయ్యతో దూరం పెంచుకుంటుంది కానీ కలిసి పోవడం లేదని జరిగింది చెబుతుంది ఇందిరా దేవి. మీరు కంగారు పడకండి నేను చూసుకుంటానని అపర్ణతో మాట్లాడుతుంది కావ్య. నిన్ను చూస్తుంటే చాలా గర్వంగా ఉంది. నిన్ను మోసం చేసిన ఆ అనామికను దెబ్బకొట్టి.. నిజమైన వుమెన్ బిజినెసర్‌లా ఆలోచించావు అని అంటుంది అపర్ణ. మీరు చేస్తున్న పని వల్ల కూడా ఇంట్లో అందరూ బాధ పడుతున్నారు. మావయ్య విషయంలో మీరు చేస్తుంది తప్పని కావ్య అంటుంది. నువ్వు గెలిచిన సంతోషాన్ని పంచుకోవడానికి నన్ను పిలిచావు అనుకున్నా.. కానీ మీ అమ్మమ్మ చెబితే వచ్చావని తెలిసిందని అపర్ణ అంటుంది.

మీరు మారితేనే కదా.. ఆయనలో కూడా మార్పు వస్తుంది..

భార్య ఉండగా మరో ఆడదానితో సంబంధం పెట్టుకోవడం తప్పు కదా.. అని అపర్ణ నిలదీస్తుంది. అది ముమ్మాటికే తప్పు అత్తయ్యా.. జీవితంలో ప్రతీ మనిషికి రెండో అవకాశం ఇవ్వాలి. మావయ్యకు మీరు అంటే చాలా ఇష్టం. ఒక్కసారి ఆయన్ని క్షమించి చూడండి.. మళ్లీ మీరు కోరుకున్న జీవితం మీకు దగ్గర అవుతుందని కావ్య అంటే.. నన్ను క్షమించమని అడుగుతున్నావు? మరి నువ్వు నా కొడుకుని క్షమించగలవా అని అపర్ణ అడుగుతుంది. అత్తయ్యా ఆయన్ని ఎప్పుడో క్షమించేశాను.. మేమిద్దరం మళ్లీ కలుస్తామని ఆశ.. ఆయన లోపం మూర్ఖత్వం.. ఆయనలో ఉన్న ప్రేమను బయటకు తీసుకు రావడానికి ఆఫీసుకు వచ్చాను. నాకు ఎలాంటి అనుభవం లేని నేనే నా భర్తని క్షమించినప్పుడు.. పశ్చాత్తాపంతో కుమిలిపోతున్న మావయ్యని మీరెందుకు క్షమించలేరు అత్తయ్యా.. ఒక్కసారి మీ కోపాన్ని దాటి వచ్చి చూడండి. మీ అబ్బాయి గారిలో మార్పు రావాలని మీరు ప్రయత్నిస్తున్నారు. కానీ మీరు మారి.. ఆయనకు తెలిసేలా చేస్తేనే కదా ఆయనలో మార్పు వస్తుందని తెలిస్తేనే కదా అని కావ్య చెబుతుంది.

సుభాష్‌ని క్షమించిన అపర్ణ..

కట్ చేస్తే.. సూప్ తాగమని ఇంట్లో వాళ్లు చెబితే తాగడు. అపర్ణ ఇంటికి వచ్చి.. మా ఆయన ఏం అంటున్నారా? అని అంటుంది. ఇదిగో సూప్ తాగండి.. వేడి చల్లారుతుంది.. తాగమని అపర్ణ అంటుంది. దీంతో ఇంట్లో వాళ్లు షాక్ అవుతారు. అపర్ణా నాతో మాట్లాడుతున్నావా అని సుభాష్ అంటే.. ఎంత ఉరకలేసినా నదులన్నీ వెళ్లి సముద్రంలో కలవాల్సిందే.. ఎన్ని అపార్థాలు వచ్చినా భార్యభర్తలు ఒకటి కావాల్సిందే అని అపర్న అంటుంది. నువ్వు నన్ను క్షమించావా అని సుభాష్ అడిగితే.. మీరు చేసిన తప్పు వల్ల దూరంగా ఉన్నాను. ఎన్ని సార్లు క్షమాపణ అడిగినా పట్టించుకోలేదు. ఈ రోజు నుంచి మన మధ్య ఎలాంటి సమస్యలు రావులే అని అపర్ణ అంటుంది. అది చూసి ఇంట్లోని వాళ్లందరూ సంతోషిస్తారు.

రుద్రాణి ఫ్రస్ట్రేట్..

చూశావా రాజ్ ఇన్ని రోజుల్లో వారి మధ్య ఉండే దూరాన్ని ఎవరూ తగ్గించలేక పోయారు. కానీ మీ అమ్మ మనసు మార్చి.. మీ నాన్నాకు దగ్గర అయ్యేలా చేసింది కావ్యే అని ఇందిరా దేవి అంటే.. ఓహో ఇదంతా ఆ కళావతి మాయాజాలమా.. ఆ క్యాన్సర్ కనకం కూతురు కూడా మాయలు మంత్రాలు బాగానే నేర్చుకుని బాగానే ప్రయత్నిస్తుందని రాజ్ అంటే.. ఛీ నీకు అలా అర్థమైందా.. నీ మొదడును వాషింగ్ మెషీన్‌లో వేసి ఉతికినా మారదని పెద్దావిడ తిడుతుంది. ఆ కావ్య గురించి ఏమో అనుకున్నా కానీ బయట ఉన్నా కూడా కావ్య అన్నీ బాగానే చేస్తుందంటూ రాహుల్, రుద్రాణిలు ఫ్రస్ట్రేట్ ఫీల్ అవుతారు. అప్పుడే స్వప్న అనుకున్నది ఒక్కటి.. అయినది ఒక్కటి అంటూ సాంగ్ ప్లే చేస్తుంది. దీంతో రుద్రాణి సీరియస్ అవుతూ బయటకు పో అని అంటుంది. ఇలాంటి సిచ్యువేషన్ వచ్చేలా చేసిందే నేను అని స్వప్న అంటే రుద్రాణి షాక్ అవుతుంది. ఇక్కడితో ఈ రోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..