ఈ రోజు బ్రహ్మముడి ఎపిసోడ్‌లో.. స్టెల్లా చేయించిన వంటలు తిని ప్రకాశం, రాజ్, రాహుల్ ముఖ చిత్రాలు మారిపోతాయి. ఇందులో సాల్ట్ లేలే.. టేస్ట్ లేదే అని అంటే.. మీకు టేస్ట్ కావాల.. రోగాలు కావాలా అని అంటుంది స్టెల్లా. ఆ ఫుడ్ తినలేక కడుపులో మార్పులు వచ్చి అక్కడి నుంచి పారిపోతారు రాహుల్, ప్రకాశం, రాజ్‌లు. అదంతా చూసి కావ్య, సుభాష్, సీతారామయ్య, ఇందిరా దేవిలు తెగ నవ్వుతారు. లక్ష రూపాయలు పెట్టి తీసుకొచ్చావు కదరా.. ఇదేనా? ఇంటి ఇల్లాలు చేసే ఫుడ్ వేరురా అని అంటారు. ఆ తర్వాత అందరూ కలిసి బాత్రూమ్స్‌కి పరిగెడతారు. ఇక స్టెల్లా దగ్గరకు వచ్చిన రాహుల్.. మీ లాంటి బ్యూటిఫుల్ లేడీస్‌కి కేవలం కుకింగ్ మాత్రమే కాకుండా.. వేరే ఇతర పనులు కూడా వచ్చే ఉంటాయి కదా అని అంటాడు. ఎందుకు రావు.. హెడ్ మసాజ్ వచ్చు.. పెద్ద పెద్ద సెలబ్రెటీలు నాతోనే హెడ్ మసాజ్ చేయించుకుంటారని స్టెల్లా చెబుతుంది.
ఇక ఆగని రాహుల్.. నాకు కూడా మసాజ్ చేస్తారా? అని అడుగుతాడు. వై నాట్ పేమెంట్ ఇస్తే మీకేంటి? కుక్కలకు కూడా చేస్తాను. జస్ట్ పది వేలు అని స్టెల్లా చెబితే.. అంతేనా సరే అని డబ్బులు పంపిస్తాడు. ఇక ఇద్దరూ కలిసి బెడ్ రూమ్‌కి వెళ్తారు. రాహుల్‌కి నవ్వుతూ హెడ్ మసాజ్ చేస్తుంది స్టెల్లా. అప్పుడే వచ్చిన స్పప్న వాళ్లిద్దర్నీ చూసి.. చీపురు కట్ట తిరగేసి మరీ ఉరికించి ఉరికించి కొడుతుంది. మరోవైపు ప్రకాశాన్ని కూడా కొడుతుంది ధాన్యలక్ష్మి. అప్పుడే రాజ్ వస్తాడు. ఏంటి స్వప్న ఏమైంది అని అడుగుతాడు. ఇది వంట మనిషి కాదు.. బజారు మనిషి.. రాహుల్‌కి మసాజ్ చేస్తుందని చీపురుతో కొడుతుంది స్వప్న. దీంతో అక్కడి నుంచి పారిపోతుంది స్టెల్లా. ఇప్పటికైనా అర్థమైందా రాజ్.. ఇంటి మనిషికి.. వంట మనిషికి తేడా ఏంటో తెలిసిందా అని ఇందిరా దేవి గడ్డి పెడుతుంది.
ఇంతలో ఒక అతను వచ్చి మీకు పోస్ట్ వచ్చిందని ఇస్తాడు. అందులో ఉన్న పేపర్స్ చూసి షాక్ అవుతాడు రాజ్. ఏమీ మాట్లాడకుండా ఉంటారు. దీంతో అందరూ కంగారు పడుతూ ఏమైందని సుభాష్ అడుగుతాడు. మమ్మీ నీకు డివోర్స్ పంపించిందని చెబుతాడు. దీంతో ఇంట్లోని వాళ్లందరూ ఆశ్చర్యానికి గురవుతారు. అత్తయ్య గారు మావయ్య గారికి విడాకులు ఇవ్వడం ఏంటి? అర్థం కావడం లేదని కావ్య అంటే.. ఏమీ తెలీనట్టు నటించకు? ఒకే ఇంట్లో ఉంటూ మా మమ్మీ నీకు ఏమీ చెప్పకుండా ఉంటుందా? అని రాజ్ అంటే.. ఆవిడ ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నారో తెలీడం లేదని కావ్య అంటే.. నటించకు.. మా అమ్మకు మీరందరూ కలిసి ఏం నూరి పోసారు. నువ్వేం డ్రామాలు ఆడుతున్నావ్? అని రాజ్ అడిగితే.. ఆగండి.. ఈ విషయం నాకు తెలీదు. నిజంగా ఈ విషయం నాకు తెలీదు. నమ్మితే నమ్మండి లేకపోతే లేదు. అమ్మమ్మ గారు నేను వెళ్తున్నా.. ఇదేంటో నేనూ తేల్చుకోవాలి అని కావ్య వెళ్తుంది.
అబ్బబ్బా చూశారా.. ఇంకా ఇక్కడే ఉంటే బయట విషయం బయట పడుతుందని ఎంత కంగారుగా వెళ్లిపోయిందో అని రాజ్ అంటే.. రేయ్ కావ్య మీద నిందలు వేయడం కాదురా.. ఇదంతా జరగడానికి కారణమే నువ్వు.. ఇంతదాకా తీసుకొచ్చావు. మొత్తం కారణమే నువ్వు. మీరూ మీరూ కొట్టుకుని మధ్యలో మమ్మల్ని విడదీయడం ఏంటి? ఇప్పుడు నీ మూలంగా నాతో ఈ ఇంటితో బంధం తెంచుకోవాలి అనుకుంటుంది. మాయ విషయం బయట పడ్డా.. నాకు విడాకులు ఇవ్వాలని అనుకోలేదు. కానీ ఇప్పుడు నీ మూలంగా విడాకులు ఇవ్వడానికి సిద్ధమైందని సుభాష్ అంటాడు. డాడీ నాకూ, కళావతికి మధ్య గొడవలు ఉంటే.. మీ కాపురానికి ముడి పెట్టింది మమ్మీ అని రాజ్ అంటాడు. రేయ్ ఒకే కుటుంబంలో ఉన్నప్పుడు అందరూ ఆమోదించేలా ఉండాలి. అదే సంసారమని ఇందిరా దేవి అంటుంది. ముందు ఏం చేయాలో ఆలోచించమని సీతారామయ్య అంటాడు.
ఆలోచించేది ఏమీ లేదు నాన్నా.. వీడు మూలంగా నా జీవితం నాశనం అవుతుంది. ఈ వయసులో మాకు ఈ సమస్యలు అవసరమా.. నాకు నా భార్య ముఖ్యం. ఒక్క విషయం గుర్తు పెట్టుకో.. భర్తతో చివరి వరకూ తోడు వచ్చేది భార్య మాత్రమేనని సుభాష్ అంటాడు. కంగారు పడకండి డాడీ.. రేపటి వరకు అమ్మని ఇంటికి తీసుకొచ్చేలా చేసే బాధ్యత నాది. కళావతి ఎప్పటికీ ఇంటికి రాదు.. కానీ మా అమ్మ వస్తుందని రాజ్ అంటాడు. దీంతో ఏం చేస్తాడా అని అందరూ టెన్షన్‌లో ఉంటారు. మరోవైపు అపర్ణకు లెమన్ జ్యూస్ తీసుకొచ్చి ఇస్తుంది కనకం. అప్పుడే కావ్య వచ్చి అత్తయ్యా అని అరుస్తుంది. ఉలిక్కి పడిన అపర్ణ, కనకంలు ఏంటే అంతలా అరుస్తున్నావ్? అని అడుగుతారు. మా అత్త గారికి ఇలాంటి సలహా ఇచ్చింది నువ్వే కదా.. చెప్పు. ఏం నేర్పిస్తున్నావ్ మా అత్తగారికి? దీని వెనుక అంతా నడిపిస్తుంది నువ్వే కదా అని కనకాన్ని కావ్య తిడుతుంది. ఆవేశ పడకు.. కనకానికి ఏమీ తెలీదు.. నేనే చేశానని అపర్ణ అంటుంది. మీరు మావయ్య గారికి విడాకుల నోటీసు ఎందుకు పంపించారని కావ్య అడిగితే.. కనకం ఉలిక్కి పడి గ్లాస్ పడేస్తుంది.
అత్తయ్యా ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు? అని కావ్య నిలదీస్తుంది. ఏంటి వదిన గారు? అన్నయ్య గారికి మీరు విడాకులు ఇవ్వడం ఏంటి అని కనకం అడుగుతుంది. చెప్పండి అత్తయ్యా నేను అక్కడి నుంచి ఇక్కడికి వచ్చినందుకే నిలదీసారు. మరి మీరేం చేస్తున్నారు? అని కావ్య అడిగితే.. ఇది నా సొంత నిర్ణయం అని అపర్ణ అంటుంది. అసలు మీకు బుర్ర పని చేస్తుందా? ఆస్పత్రికి తీసుకెళ్లమంటారా? ఆ ఇల్లు ఏంటి? ఆ కుటుంబం ఏంటి? ఇప్పటికే మీ కొడుకు బండరాయిలా తయారయ్యాడు.. ఇప్పుడు మీకు అతనికి తేడా ఏంటి? అని కావ్య నిలదీస్తుంది. ఆ బండరాయిని కరగదీయడానికే అని అపర్ణ అంటుంది. నవ్వు కంగారు పడాల్సిన పని లేదు.. నీ భర్తకు బుద్ధి రావడానికే ఈ పని చేశానని అపర్ణ అంటుంది. అయినా ఆ మహానుభావుడు చేసే తైతక్కల గురించి మీకు తెలీదు? ఆయన అనుకున్నది చేయడానికి ఎంత దూరం అయినా వెళ్తాడని కావ్య అంటే.. అతని కంటే ఒక అడుగు ముందు నేనే ఉంటానని అపర్ణ అంటుంది. ఇదంతా కాదు మా అత్తగారి బట్టలు సర్దు.. మీరు ఇక్కడ ఉండకంటి.. మీ ఇంటికి వెళ్లిపొమ్మని కావ్య అంటుంది. అందుకు అపర్ణ, కనకంలు షాక్ అవుతారు. ఇక్కడితో ఇవాళ్టి ఎపిసోడ్ ముగుస్తుంది. మరో ఎపిసోడ్‌లో ధాన్యలక్ష్మి మొండి పట్టు వల్ల సీతారామయ్యకు గుండె పోటు వస్తుంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..