Brahmamudi, August 2nd Episode: రుద్రాణికి ఇందిరా దేవి మాస్ వార్నింగ్.. అప్పూ చెంతకే కళ్యాణ్!

ఈ రోజు బ్రహ్మముడి ఎపిసోడ్‌లో.. బెంగుళూరు వెళ్లమని ధాన్య లక్ష్మి కళ్యాణ్‌పై ప్రెజర్ పెడుతుంది. నువ్వు అనుకున్నట్టు ఏమీ జరగదు. నేను పెళ్లికి రాను. వాళ్ల ఇంట్లో వాళ్లు అనుకున్నట్టే అప్పూ పెళ్లి చేసుకుంటుందని చెప్పి కళ్యాణ్ వెళ్లిపోతాడు. దీంతో అక్కడే ఉండి వింటున్నరుద్రాణి సంతోష పడుతుంది. ఇక తెల్లవారుతుంది. పెళ్లికి అంతా సిద్ధం చేస్తారు. కనకం తెగ కంగారు పడుతూ ఉంటుంది. కృష్ణమూర్తిని అన్నీ తీసుకొచ్చారా? అని ప్రశ్నలు కురిపిస్తుంది. అప్పుడే కావ్య వస్తుంది. నేను అన్నీ సిద్ధం..

Brahmamudi, August 2nd Episode: రుద్రాణికి ఇందిరా దేవి మాస్ వార్నింగ్.. అప్పూ చెంతకే కళ్యాణ్!
Brahmamudi
Follow us

|

Updated on: Aug 02, 2024 | 1:35 PM

ఈ రోజు బ్రహ్మముడి ఎపిసోడ్‌లో.. బెంగుళూరు వెళ్లమని ధాన్య లక్ష్మి కళ్యాణ్‌పై ప్రెజర్ పెడుతుంది. నువ్వు అనుకున్నట్టు ఏమీ జరగదు. నేను పెళ్లికి రాను. వాళ్ల ఇంట్లో వాళ్లు అనుకున్నట్టే అప్పూ పెళ్లి చేసుకుంటుందని చెప్పి కళ్యాణ్ వెళ్లిపోతాడు. దీంతో అక్కడే ఉండి వింటున్నరుద్రాణి సంతోష పడుతుంది. ఇక తెల్లవారుతుంది. పెళ్లికి అంతా సిద్ధం చేస్తారు. కనకం తెగ కంగారు పడుతూ ఉంటుంది. కృష్ణమూర్తిని అన్నీ తీసుకొచ్చారా? అని ప్రశ్నలు కురిపిస్తుంది. అప్పుడే కావ్య వస్తుంది. నేను అన్నీ సిద్ధం చేశాను. ఇక పెళ్లి వాళ్లు రావడమే. ప్రశాంతంగా ఉండు. అన్నీ సవ్యంగా జరుగుతాయని కావ్య అంటుంది. కూతురు పెళ్లి జరుగుతుంటే ప్రశాంతంగా ఎలా ఉండమంటావే.. ఇంతకీ మీ చెల్లెల్ని రెడీ చేశారా? అని కనకం అడిగితే.. ఆ పని స్వప్న అక్కకి అప్పగించానని కావ్య అంటుంది.

కనకం హడావిడి.. బాధలో అప్పూ..

అయ్యో సరిపోయింది.. అది రెడీ అవ్వడానికే టైమ్ సరిపోదు. ఇక అది అప్పూని ఏం రెడీ చేస్తుందని కనకం అప్పూ దగ్గరకు వెళ్తుంది. అంబానీ తన కొడుకు పెళ్లిలో కూడా ఇంత హడావిడి చేసి ఉండడు. మీ అమ్మ చూడు ఎంత కంగారు పడుతుంది. ఇంతకీ మీ వాళ్లు బయలు దేరారా అని కృష్ణ మూర్తి అడుగుతాడు. ఎవరు వచ్చినా రాకపోయినా.. రావాల్సిన వాళ్లు వస్తారని కావ్య అంటుంది. ఏమోనమ్మా ఎలాంటి గొడవలు లేకుండా ఈ పెళ్లి జరిగితే అంతే చాలని కృష్ణమూర్తి అంటాడు. కట్ చేస్తే.. అప్పూ దగ్గరకు కనకం వస్తుంది. ఇంకా రెడీ చేయలేదా? అని కంగారు పడుతుంది. పూల జడ ఇంకా ఎందుకు వేయలేదని అడుగుతుంది కనకం. అది వేసుకోనంటే నేనేం చేయనే అని స్వప్న అంటుంది. ఏంటే ఈ రోజు నీ పెళ్లి అర్థమవుతుందా? పూల జడ వేసుకోవాలని కనకం అంటే.. అమ్మా నాకు ఈ జడలు వేసుకోవడం, పూలు పెట్టుకోవడం నచ్చదు. నేను ఇలాగే ఉంటాను. నన్ను ఇలాగే ఇష్ట పడ్డారు కదా. నాకు ఇష్టం లేదని అప్పూ అంటుంది. స్వప్నా ఇదంతా నీ ట్రైనింగే అని కనకం అంటే.. మీరిద్దరూ కొట్టుకుని నా మీద పడతారేంటి? అని స్వప్న అంటుంది. సరే త్వరగా రెడీ అవ్వమని కనకం అంటుంది.

రుద్రాణి టెన్షన్..

ఆ తర్వాత ప్రకాశం, సుభాష్‌లు రెడీ అయి హాల్‌లోకి వస్తారు. అప్పుడే ఇందిరా దేవి వచ్చి.. ఏంట్రా అన్నావు.. నేను ఇందాక గార్డెన్‌లో ఉన్నప్పుడు ఏం చెప్పాను అని అన్నావు? ఏం చెప్పావు అమ్మా అని ప్రకాశం అంటాడు. ఓరేయ్ వెధవా.. పెళ్లికి లేటు అవుతుంది. మేము రెడీ అయిపోయాం అని చెప్పాం కదా.. మళ్లీ మర్చిపోయావా? అని ఇందిరా దేవి అంటుంది. మరోవైపు రుద్రాణి టెన్షన్ పడుతుంది. ధాన్య లక్ష్మి రాగానే.. నేను ఇంత టెన్షన్ పడుతుంటే.. నువ్వు ఏంటి నగలు చూసుకుంటున్నావా? అక్కడ ఉంది కావ్య. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలని రుద్రాణి అంటుంది. టెన్షన్ ఎందుకు? మనం అనుకున్నది జరుగుతుంది కదా.. అందుకే దగ్గరుండి మరీ ఆ పెళ్లి చూడటానికి అక్కడికి వెళ్తుందని ధాన్య లక్ష్మి అంటుంది.

ఇవి కూడా చదవండి

రుద్రాణికి ఇందిరా దేవి వార్నింగ్..

అక్కడికి వెళ్లాక ముందే చెప్తున్నా.. నీ దురుసు మాటలు, వెక్కిరింత మాటలు అక్కడ చూపించడానికి వీల్లేదని ఇందిరా దేవి వార్నింగ్ ఇస్తుంది. తల్లివి అయి ఉండి కూడా నువ్వు ఇలా మాట్లాడటానికి బాలేదని రుద్రాణి అంటుంది. తల్లిని కాబట్టే.. నువ్వు ఏంటో తెలుసు కాబట్టే.. ముందే వార్నింగ్ ఇస్తున్నానని ఇందిరా దేవి చెబుతుంది. అప్పుడే కళ్యాణ్, రాజ్‌లు పై నుంచి వస్తారు. కళ్యాణ్‌ చూసి కంగారు పడిన ధాన్య లక్ష్మి.. ఏరా నువ్వు పెళ్లికి వస్తున్నావా? అని అడిగితే.. నువ్వేం టెన్షన్ పడకు అమ్మా నేను రానులే అని కళ్యాణ్ అంటాడు. అందరూ వెళ్లిపోయాక.. ఏరా ఇంకా అందరి గురించి ఆలోచిస్తూ ఉంటావా. ఒక్కటి గుర్తు పెట్టుకో. నీకు నేను ఉన్నానని రాజ్ చెప్పి వస్తాడు. ఇక దుగ్గిరాల ఫ్యామిలీ అందరూ కలిపి పెళ్లికి వస్తారు. దుగ్గిరాల ఫ్యామిలీకి కృష్ణమూర్తి, కావ్య వాళ్లు వెళ్లి ఎదురు పడతారు. మీరు అసలు వస్తారని అనుకోలేదు. మీరు రావడం వల్ల ఈ పెళ్లి మండపానికే కల వచ్చిందని అంటారు కనకం, కృష్ణమూర్తిలు.

రుద్రాణికి కరెక్ట్ మొగుడు స్వప్నే..

ఇక్కడ మండపం ఎక్కడ ఉంది. టెంపుల్ వారి షెడ్డులో చేస్తున్నారన్నమాట అని అంటుంది రుద్రాణి. రుద్రాణి భగవంతుడిని సన్నిధికి మించిన స్థాయి ఈ ప్రపంచంలో ఉందా.. అని పెద్దావిడ అంటే.. మా అత్తకి స్థాయి గురించి మాట్లాడే హక్కు లేదు. మీరే ఏ దిక్కూ లేక తాతయ్య వాళ్ల ఇంట్లో ఉంటున్నారు. మా అమ్మ వాళ్లకు చిన్న ఇల్లు అయినా ఉంది. మరి మీకు ఏమీ లేదు కదా.. అని స్పప్న అంటుంది. చూడు అమ్మా అని రుద్రాణి అంటే.. నీకు స్వప్నే కరెక్ట్ మొగుడు. నా ఫుల్ సపోర్ట్ నీకే స్వప్న అని అపర్ణ అంటుంది. తప్పు అమ్మా అత్తగారిని అలా పది మందిలో అవమానించినట్టు మాట్లాడకూడదని కృష్ణమూర్తి అంటాడు.

ఎక్కడ జరిగినా పెళ్లి పెళ్లే..

రుద్రాణి గారూ మిమ్మల్ని తప్పు బట్టాలని కాదు. పెళ్లి ఏర్పాట్లలో ఆడంబరాలు ఉండొచ్చు. కానీ ఎక్కడ జరిగినా పెళ్లి పెళప్లే. అదే మూడు ముళ్లు, వేద మంత్రాలు, హోమ గుండం ఉంటాయి. ముఖ్యంగా ఏమీ లేని పేదవాడు అప్పు చేసి మరీ పెళ్లిళ్లు చేస్తారు. అప్పుడు ఏవైనా లోటుపాట్లు ఉంటే వారిని విమర్శించకూడదు. భోజనాలు బాలేక పోయినా.. బాగున్నాయని ఒక్క మాట చెప్తే చాలు.. వాళ్లు ఎంతో సంతోషిస్తారని చెబుతుంది కావ్య. చిన్నదానివైనా బాగానే చెప్పావు అమ్మా అని ఇందిరా దేవి అంటుంది.

బయట పడిన అప్పూ ప్రేమ.. స్వప్న ఏం చేసిందంటే..

ఇక స్వప్న తిలకం పెట్టడానికి వస్తుంది. అప్పుడు అప్పూ ఏడుస్తూ.. కళ్యాణ్ ఫొటోలు చూస్తూ ఉంటుంది. ఏంటే నువ్వు ఇంకా కళ్యాణ్‌ని ప్రేమిస్తున్నావా? వీళ్లందరి గురించి ఆలోచించి.. నీ ప్రేమను దూరం చేసుకోకు. రెండు గంటలు కళ్లు మూసుకుంటే అంతా అయిపోతుంది అనుకుంటున్నావా.. కానీ జీవితాంతం ఆ తర్వాత ఈ బంధాన్ని మోయాలి. నాకు అయినా చెప్పి ఉండొచ్చు కదా.. ఇక్కడి దాకా ఎందుకు తీసుకొచ్చావే అని స్పప్న అప్పూని అంటుంది. ఇక ఇవాళ్టితో ఈ రోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

రుద్రాణికి ఇందిరా దేవి మాస్ వార్నింగ్.. అప్పూ చెంతకే కళ్యాణ్!
రుద్రాణికి ఇందిరా దేవి మాస్ వార్నింగ్.. అప్పూ చెంతకే కళ్యాణ్!
ఆ సినిమా ఎఫెక్ట్ డబుల్ ఇస్మార్ట్ రిలీజ్ మీద పడనుందా ??
ఆ సినిమా ఎఫెక్ట్ డబుల్ ఇస్మార్ట్ రిలీజ్ మీద పడనుందా ??
కృతి సనన్‌ ప్రేమలో పడ్డారా ??బాలీవుడ్ లో హాట్ టాపిక్‌
కృతి సనన్‌ ప్రేమలో పడ్డారా ??బాలీవుడ్ లో హాట్ టాపిక్‌
దేశంలో అసలైన హెర్బాలైఫ్‌ ఉత్పత్తులను పొందడం ఎలా? ప్రయోజనాలు ఏంటి?
దేశంలో అసలైన హెర్బాలైఫ్‌ ఉత్పత్తులను పొందడం ఎలా? ప్రయోజనాలు ఏంటి?
రాజ్ తరుణ్ స్నేహితుడిని చెప్పుతో కొట్టిన లావణ్య.. లైవ్ షోలో రచ్చ
రాజ్ తరుణ్ స్నేహితుడిని చెప్పుతో కొట్టిన లావణ్య.. లైవ్ షోలో రచ్చ
వయనాడ్ విధ్వంసంలో వీరు మృత్యుంజయులు శిధిలాల కింద సజీవంగా నలుగురు
వయనాడ్ విధ్వంసంలో వీరు మృత్యుంజయులు శిధిలాల కింద సజీవంగా నలుగురు
తిరుమల శ్రీవారికి కాసుల వర్షం.. జులైలోనూ భారీగా హుండీ ఆదాయం..
తిరుమల శ్రీవారికి కాసుల వర్షం.. జులైలోనూ భారీగా హుండీ ఆదాయం..
రాజకుమారుడు టు రాజమౌళి... మహేష్ సినీ జర్నీ
రాజకుమారుడు టు రాజమౌళి... మహేష్ సినీ జర్నీ
బ్రహ్మాస్త్ర పార్ట్‌ 2 కోసంపో టీపడుతున్న బిగ్‌ స్టార్స్‌..
బ్రహ్మాస్త్ర పార్ట్‌ 2 కోసంపో టీపడుతున్న బిగ్‌ స్టార్స్‌..
ఈ అమ్మాయినే పెళ్లాడాలనుకున్నాడు.. చివరకు అసలు ట్విస్ట్ ఏంటంటే..?
ఈ అమ్మాయినే పెళ్లాడాలనుకున్నాడు.. చివరకు అసలు ట్విస్ట్ ఏంటంటే..?