Brahmamudi, April 15th episode: వెన్నెల కోసం రాజ్ కంగారు.. ఫంక్షన్‌కు వచ్చిన వెన్నెల..

|

Apr 15, 2024 | 12:11 PM

ఈ రోజు బ్రహ్మముడి ఎపిసోడ్‌లో.. కావ్య రీయూనియన్‌కు బయలు దేరుతుంది. వెళ్లే క్రమంలో కృష్ణుడికి తన బాధను చెప్పుకుని బాధ పడుతుంది. అప్పుడే పెద్దావిడ వచ్చి కావ్యను ఓదార్చి.. తాను మళ్లీ దుగ్గిరాల ఇంటకి వస్తుందో రాదో తెలీక బాధ పడుతుంది. ఆ తర్వాత కళ్యాణ్‌తో ఎలాగైనా తప్పు చేయించాలని అనుకుంటాడు రాహుల్. సరైన సమయం కోసం వెయిట్ చేస్తాడు. ఇంతలో టోనీ అనే అతనికి కాల్ చేసి.. దొంగ బంగారాన్ని కళ్యాణ్‌తో కొనేందుకు డీల్ కుదుర్చుకుంటాడు. ఆ తర్వాత కళ్యాణ్‌ దగ్గరకు వెళ్లి..

Brahmamudi, April 15th episode: వెన్నెల కోసం రాజ్ కంగారు.. ఫంక్షన్‌కు వచ్చిన వెన్నెల..
Brahmamudi
Follow us on

ఈ రోజు బ్రహ్మముడి ఎపిసోడ్‌లో.. కావ్య రీయూనియన్‌కు బయలు దేరుతుంది. వెళ్లే క్రమంలో కృష్ణుడికి తన బాధను చెప్పుకుని బాధ పడుతుంది. అప్పుడే పెద్దావిడ వచ్చి కావ్యను ఓదార్చి.. తాను మళ్లీ దుగ్గిరాల ఇంటకి వస్తుందో రాదో తెలీక బాధ పడుతుంది. ఆ తర్వాత కళ్యాణ్‌తో ఎలాగైనా తప్పు చేయించాలని అనుకుంటాడు రాహుల్. సరైన సమయం కోసం వెయిట్ చేస్తాడు. ఇంతలో టోనీ అనే అతనికి కాల్ చేసి.. దొంగ బంగారాన్ని కళ్యాణ్‌తో కొనేందుకు డీల్ కుదుర్చుకుంటాడు. ఆ తర్వాత కళ్యాణ్‌ దగ్గరకు వెళ్లి.. నీకో గుడ్ న్యూస్.. మనకో మంచి డీల్ వచ్చింది. శకుంతలా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ వారు మనకు తక్కువ ధరకే బంగారాన్ని ఇవ్వడానికి ఒప్పుకున్నారని రాహుల్ చెప్తే.. తక్కువ ధరకే ఎలా ఇస్తారు? అని కళ్యాణ్ ప్రశ్నిస్తాడు.

కళ్యాణ్‌ని ముంచడానికి రాహుల్ ప్లాన్..

వాళ్లు అబ్రాడ్ నుంచి ఎక్సైజ్ డ్యూటీ తక్కువ పడేలా చేసి.. ఇండియాకు తీసుకొచ్చారంట. మనం ఇప్పుడు వాళ్లతో డీల్ చేస్తే మనకు మంచి లాభాలు వస్తాయి. పైగా ఆ శకుంతల కంపెనీ వాళ్లు ఒకప్పుడు మనతో డీల్ చేసిన అనుభవం కూడా ఉంది. ఇదిగో ఈ ఫైల్ చూడు అని రాహుల్ ఇస్తాడు. అవునా సరే నేను ఒకసారి అన్నయ్యను కనుక్కుని చెప్తాను అని కళ్యాణ్ అంటే.. పిచ్చోడా ఈ రోజు రాజ్ ఫంక్షన్‌కు వెళ్తున్నాడు. ఈలోపు నేను నీ దగ్గర నుంచి సైన్ తీసుకుని.. నిన్ను ముంచేస్తాను అని రాహుల్ అనుకుంటాడు.

ఫ్రెండ్స్‌ని కలుసుకున్న రాజ్..

ఈ సీన్ కట్ చేస్తే.. రాజ్, కావ్యలు ఇద్దరూ కలిసి రీ-యూనియన్ పార్టీకి వస్తారు. రాజ్, కావ్యలను మిగతా ఫ్రెండ్స్ అందరికీ శ్వేత పరిచయం చేస్తుంది. అందరూ దగ్గరకు వచ్చి పరిచయం చేసుకుంటారు. ఇక పిల్లాడిని ఆయాకు అప్పగిస్తారు. అప్పుడే మరో పాత ఫ్రెండ్ కూడా వస్తూ.. హాయ్ రాజ్ అని పలకరిస్తాడు. తనని చూసిన రాజ్.. పాత సీన్ గుర్తుకు తెచ్చకుంటాడు. మీరిద్దరూ కలిసి పోయారా? అని అడుగుతాడు. అవును.. రాజ్ పెళ్లి పీటల మీద నుంచి నువ్వు నన్ను లాక్కొచ్చాక.. నేను బాగా ఆలోచించాను. తను నన్ను డబ్బు చూసే ప్రేమించింది కాబట్టి విడాకులు కూడా తీసుకోవాలి అనుకున్నాను. కానీ దేవుడు వేసిన బ్రహ్మముడి నువ్వు కాదు కదా.. ఆ దేవుడు కూడా విడదీయలేడు. ఒకర్ని మరొకరం క్షమించకున్నాం. ఇప్పుడు మేము చాలా హ్యాపీగా ఉన్నాం రా అని ఆ ఫ్రెండ్ చెప్తాడు. అది విన్న కావ్య.. మీరు మొదటి నుంచే భార్య భర్తలను విడదీసే పనిలోనే ఉన్నారా? అని కావ్య సెటైర్ వేస్తుంది.

ఇవి కూడా చదవండి

రాజ్‌కు ఇన్ డైరెక్టుగా శ్వేత చురకలు.. వెన్నెల కోసం కావ్య టెన్షన్..

సందీప్ చాలా మంచి పని చేశావు రా.. అని అంటుంది శ్వేత. అలా అర్థం చేసుకుంటేనే లైఫ్ లాంగ్ కలిసి ఉంటాం. అర్థం చేసుకునే లైఫ్ పార్ట్నర్ దొరకడం చాలా అదృష్టం. అలా అర్థం చేసుకుంది కాబట్టే.. ఇద్దరం కలిసి పోయాం అని చెప్తాడు. కావాలనే రాజ్‌ని ఉద్దేశిస్తూ.. అవును అది మగవారికి కూడా వర్తిస్తుంది. అర్థం చేసనుకునే భార్య దొరకడం నిజంగా భర్త అదృష్టం అని శ్వేత అంటుంది. ఆ తర్వాత శ్వేతను కావ్య పక్కకు తీసుకెళ్తుంది. వెన్నెల రాలేదా? వీళ్లల్లో వెన్నెల లేదా? అని కావ్య అడుగుతుంది. లేదు.. అని శ్వేత అంటుంది. ఏంటి రావడం లేదా? ఇన్ని ఏర్పాట్లు చేసింది వెన్నెల కోసమే కదా అని కావ్య అంటుంది. కంగారు పడకు.. వెన్నెల వస్తుంది. ఆన్‌దివేలో ఉంది. ముందు రాజ్‌లానే రానంది. ఆ తర్వాత బలవంతంగా ఒప్పుకుంది. కానీ తను మాత్రం ఎక్కువగా మాట్లాడదు అని శ్వేత అంటుంది. అయితే సరే ముందు ఫోన్ చేయ్ అని కావ్య అంటే.. శ్వేత కాల్ చేసి ఎక్కడ ఉన్నావ్? వెన్నెల అని అడుగుతుంది. కారులో.. దారిలో.. వస్తున్నా అని చెప్తుంది. తను వస్తే.. ఎందుకు ఇలా చేసిందో కనుక్కుంటాను. నా సమస్యకు ఓ పరిష్కారం దొరకాల్సిందే అని కావ్య అంటుంది.

అప్పూకి.. బిడ్డ తండ్రి సంబంధం..

ఈలోపు గజలక్ష్మి.. కనకం ఇంటికి వస్తుంది. అప్పూకి పెళ్లి సంబంధం తీసుకొస్తుంది గజలక్ష్మి. అది విని అందరూ షాక్ అవుతారు. అబ్బయి పేరు శంకరం. నెలకు లక్ష రూపాయల వరకూ సంపాదిస్తున్నాడని చెప్పి ఫొటో చూపిస్తుంది. అబ్బాయికి బాగా వయసు ఎక్కువగా ఉన్నట్టుంది అని కృష్ణ మూర్తి అంటే.. అబ్బే ఎంతా లేదు. మొదటి పెళ్లం చనిపోయింది. ఒక చిన్న బాబు ఉన్నాడు అంతే అని గజలక్ష్మి చెప్తుంది. దీంతో కనకం సీరియస్ అవుతుంది. ఈలోపు గజలక్ష్మి కావ్య, స్వప్నల గురించి వెటకారంగా మాట్లాడుతుంది. అది విన్న అప్పూ.. నువ్వు వెంటనే ఇక్కడి నుంచి పారిపోకపోతే మంచిది అని చెప్తుంది. పోలీస్ జాబ్ పోయిందంట కదా.. ఇంకేం సాధిస్తావ్ అని అంటుంది. దీంతో కనకం బాధ పడుతుంది. దీంతో అప్పూ కనకంకు ధైర్యం చెబుతుంది.

కళావతిపై ప్రేమను బయట పెట్టిన రాజ్..

ఆ తర్వాత పార్టీలో ఫ్రెండ్స్ అందరూ కలిసి ట్రూత్ ఆర్ డేర్ ఆడతారు. ఒకరి తర్వాత మరొకరు ఆడుతూ ఉంటారు. చివరికి రాజ్‌ దగ్గరకు వచ్చి బాటిల్ ఆగుతుంది. దీంతో శ్వేత.. నీ భార్య మీద ఉన్న ప్రేమను చెప్పమంటుంది. నా భార్య పేరు కావ్యా.. నేను కళావతి అని పిలుస్తాను. కావ్య గురించి చెప్పాలంటే.. ఒక కావ్యమే రాయాలి. ఒక భార్య తన భర్తతో మీ అమ్మ వంటలు బాగోలేదని చెప్పమంది. మరో భార్య తన భర్తను చెంప దెబ్బ కొట్టింది. కానీ నా భార్యా.. మా అమ్మకు ఎదురు చెప్పదు. నా కుటుంబ సభ్యలు అన్ని అవసరాలూ చూస్తుంది. నా మీద కోపం వచ్చినా అది ఒక్క పూట కూడా ఉండదు. మాటల్లో ఇష్టాన్ని.. నా కళ్లల్లో కష్టాన్ని గమనిస్తుంది. కోల్పోయిన వాటి గురించి ఆలోచించదు. అందులో నుంచి కోలుకోవడం ఎలాగో ఆలోచిస్తుందని చెప్తాడు. అది విని కావ్య, శ్వేతలు సంతోష పడుతారు. ఇక ఇవాళ్టితో ఈ రోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

రేపటి ఎపిసోడ్‌లో.. పార్టీకి వచ్చిన వెన్నెల..

ఇక రేపటి ఎపిసోడ్‌లో శ్వేత పక్కకు వచ్చి నిల్చుంటుంది. ఏంటి అందరూ అక్కడ ఉంటే.. నువ్వు ఇక్కడ ఉన్నావ్ అని అడుగుతాడు రాజ్. వెన్నెల వస్తోందని శ్వేత చెప్తుంది. అప్పుడే కావ్య వచ్చి.. వెన్నెల వస్తోందా? నీకు వెన్నెల తెలుసా? అని శ్వేత తెలీనట్టు అడుగుతుంది. నాకు ఒక వెన్నెల తెలుసు. మరి ఆ వెన్నెల.. ఈ వెన్నెల ఒక్కరో కాదో నువ్వే చెప్పాలి. వెన్నెల బయటకు వస్తే నిజం బయట పడిపోతుంది. ఇప్పుడెలా ఆపాలి అని రాజ్ టెన్షన్ పడుతూ ఉంటాడు.