బిగ్‌బాస్ షో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు.. అలాగే.. ఏ క్షణం కంటెస్టెంట్స్ ఎలా ఉంటారో అస్సలు అర్థం కాదు.. వారం మొత్తం సరదాగా.. స్నేహితులు, ఆత్మీయులుగా ఉన్న కంటెస్టెంట్స్ నామినేషన్స్ ప్రక్రియలో శత్రువులుగా మారిపోతుంటారు. సహనాన్ని కోల్పోయి మరి కోపంతో చిందులు వేస్తుంటారు. నామినేట్ చేస్తూ.. ఒకరిపై మరోకరు తీవ్రమైన కామెంట్స్ చేస్తూ రెచ్చిపోతుంటారు. ఇక బిగ్‌బాస్ సీజన్ 5 గడిచిన రెండు వారాల నామినేషన్స్‌లో కంటెస్టెంట్స్ ప్రవర్తించిన తీరుపై ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ముఖ్యంగా రెండోవారం నామినేషన్స్‌లో కొందరు హౌస్మేట్స్.. విచక్షణ కోల్పోయి మరి సైకోలుగా మారిపోయిన సంగతి తెలిసిందే. తాజాగా బిగ్‌బాస్ సీజన్ 5 మూడో వారం నామినేషన్స్ ప్రక్రియ ఇంట్లో మరోసారి హీట్ పెంచినట్లుగా తెలుస్తోంది. ఈరోజు విడుదలైన రెండు ప్రోమోల్లోనూ కంటెస్టెంట్స్ రెచ్చిపోయి మరి ఒకరిపై ఒకరు అరుచుకుంటున్నారు..
తాజాగా విడుదలైన ప్రోమోలో ప్రియ చేసిన కామెంట్స్‌తో మళ్లీ ఇంట్లో రచ్చ జరిగినట్టుగా తెలుస్తోంది. ముందుగా లహరి మాట్లాడుతూ.. ప్రియను ఎందుకు డిస్టన్స్ మెయింటెన్స్ చేస్తున్నారో అర్థం కావడం లేదు అనగా.. ఎందుకు నువ్వు ఇంట్లో ఉన్న అందరూ అబ్బాయిలతో బిజీగా ఉంటున్నావ్ అంటూ రివర్స్ కౌంటర్ ఇచ్చింది ప్రియా.. దీంతో ఇంట్లోని సభ్యులు షాకయ్యారు.. సన్నీ మాత్రం నోరెళ్లపెట్టేసినట్లుగా తెలుస్తోంది. ఎవరితో బిజీగా ఉన్నానో చెప్తారా అంటూ లహరి ప్రశ్నించగా.. రవితో బిజీగా ఉన్నావు.. మానస్‌తో బిజీగా ఉన్నావ్ అంటూ చెప్పుకొచ్చింది ప్రియా.. దీంతో లహరి చప్పట్లు కొడుతూ రెచ్చిపోయింది. ఇక రవి మాట్లాడుతూ.. నేను లహరి కంటే సిరితో ఎక్కువగా క్లోజ్ అయ్యానని.. తనను ఒక ఫ్రెండ్ లాగా. ఒక సిస్టర్ లాగా భావిస్తాను అని చెప్పగా.. మీరు ఇప్పుడు అందరి సపోర్ట్ కోసం మాట్లాడవద్దు రవి అంటూ కుండబద్దలు కొట్టింది ప్రియా. దీంతో సపోర్టా అంటూ తల పట్టుకున్నాడు రవి. రాంగ్ స్టేట్మెంట్స్ ఇవ్వోద్దు అంటూ రవి.. లహరి.. ప్రియాపై విరుచుకుపడ్డారు. మొత్తానికి ఈరోజు నామినేషన్స్ ప్రక్రియ రసవత్తరంగా మారినట్టుగా తెలుస్తోంది.
వీడియో..
Also Read: Bigg Boss 5 Telugu: మరోసారి ఇంట్లో నామినేషన్స్ రచ్చ.. పనికిమాలిన రీజన్స్ అంటూ ఫైర్ అయిన ప్రియాంక..
Bheemla Nayak: భీమ్లా నాయక్ అప్డేట్ వచ్చేసింది.. ధర్మేంద్ర అంటూ రానా వార్నింగ్..