Bigg Boss 5 Telugu: బిగ్ బాస్‌లో నిన్నటి ఎపిసోడ్ రచ్చ రచ్చగా జరిగింది హౌస్‌లో ఉన్న వారందరు ప్రియను టార్గెట్ చేశారు అయినా సరే ప్రియా వెనక్కి తగ్గకుండా అందరికి సంధానం చెప్తూ వచ్చింది. ముందుగా లహరి పైన సీరియస్ అయ్యింది ప్రియా. లహరి హౌస్‌లో ఉన్న అబ్బాయిలతోనే బిజీగా ఉంటుందని.. మహిళలతో మాట్లాడటం లేదని ప్రియా అంది. దాంతో ఎవరితో బిజీగా ఉన్నానో చెప్పడండి అంటూ తిరిగి ప్రశ్నించింది. దానికి ప్రియా రవి పేరు చెప్పింది. దాంతో రవికి చిర్రెత్తుకొచ్చింది. ఇంతలో రవితో ఏం చేశానో చెప్పండి అని లహరి అన్నది.. దాంతో ప్రియా ‘నువ్ రవితో రెస్ట్ రూంలో లేట్ నైట్ హగ్ చేసుకుంటూ ఉన్నావు.. అది ఫ్రెండ్లీ హగ్ అయినా అయ్యి ఉండొచ్చు.. ఏమైనా అయ్యి ఉండొచ్చు అని అన్నది ప్రియ. దాంతో అంతా షాక్ అయ్యారు. వెంటనే రవి అందుకొని ఏంటక్కా ఏమాట్లాడుతున్నావ్ అంటూ ప్రశ్నించాడు. దానికి ‘మీరు హగ్ చేసుకున్నది మిడ్ నైట్ కాదా? టాయ్ లెట్‌లో కాదా? అని తిరిగి ప్రశ్నించింది ప్రియ. ఆతర్వాత మరో సారి ప్రియా నోరు జారింది. నీకు ఇంతకు ముందుకూడా చెప్పా.. ఆమె సింగిల్ ఏమైనా చెయ్యొచ్చు కానీ నువ్వు అలా కాదు అని అంది ప్రియా.. దాంతో రవి సహనం కోల్పోయాడు.. అసలు ఏం మాట్లాడుతున్నావ్.. రాంగ్ స్టేట్ మెంట్.. రాంగ్ స్టేట్ మెంట్ అని గట్టిగా అరిచాడు.
ఆతర్వాత సన్నీ బిహేవియర్ నచ్చలేదని ప్రియ చెప్పడంతో.. సన్నీ సీరియస్ అయ్యాడు. ఒక అమ్మాయి గురించి ఇంత దారుణంగా మాట్లాడి మీరు పద్దతి గురించి మాట్లాడుతున్నారా…? నన్ను వాడు వీడు అని మాట్లాడలేదా..? హగ్ చేసుకుంటే అది తప్పా? అదేమైనా బూతా..? దానికి ఇంత సీన్ క్రియేట్ చేశారని మండిపడ్డాడు. దీనికి ప్రియా కూడా గట్టిగానే సమాధానం చెప్పింది. నేను నీ గురించి మాట్లాడుతుంటే నువ్ వాళ్ల గురించి చెప్తున్నావ్.. సేఫ్ గేమ్ ఆడకు అని కౌంటర్ వేసింది. ఇంతలో అక్కడే ఉన్న రవి రెచ్చిపోయాడు. మీ స్టేట్ మెంట్‌ని నా కూతురు చూస్తే ఏమనుకుంటుంది.. మీకు పిల్లలు లేరా.? అని ఫైర్ అయ్యాడు. దానికి నేను చూసిందే చెప్పాను.. నన్ను ఎందుకు టార్గెట్ చేస్తున్నారని అన్నది ప్రియ. మొత్తానికి బిగ్ బాస్ హౌస్ లో రవి లహరి గుట్టు రట్టుచేసింది ప్రియా.
మరిన్ని ఇక్కడ చదవండి :