Tanikella Bharani: ఉదయాన్నే ఈ ఒక్క పని చేస్తే లైఫ్ మారిపోతుంది.. సక్సెస్ కావాలంటే ఇలా చేయాల్సిందే.. తనికెళ్ల భరణి చెప్పిన అద్భుతమైన సలహా..

టాలీవుడ్ నటుడు తనికెళ్ళ భరణి ఉదయాన్నే లేవడం వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలను ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. ఇది జీవితానికి అదనపు సమయాన్ని ఇచ్చి, విజయానికి బాటలు వేస్తుందని అన్నారు. పనులను వాయిదా వేయకుండా వెంటనే చేయడం, కుటుంబంతో సమయం గడపడం, సూర్యోదయం ముందు మేల్కొని సూర్యాస్తమయం లోపల భోజనం చేయడం వంటివి సంతోషకరమైన, ఆరోగ్యకరమైన జీవితానికి ముఖ్యమని చెప్పారు.

Tanikella Bharani: ఉదయాన్నే ఈ ఒక్క పని చేస్తే లైఫ్ మారిపోతుంది.. సక్సెస్ కావాలంటే ఇలా చేయాల్సిందే.. తనికెళ్ల భరణి చెప్పిన అద్భుతమైన సలహా..
Tanikella Bharani

Updated on: Oct 21, 2026 | 4:07 PM

ప్రముఖ నటుడు, రచయిత , దర్శకుడు తనికెళ్ల భరణి తన విలక్షణమైన మాటలతో, ప్రసంగాలతో సమాజానికి నిత్యం మంచి సందేశాలను అందిస్తుంటారన్న సంగతి తెలిసిందే. ఇటీవల ఆయన ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఉదయాన్నే త్వరగా నిద్రలేవడం వల్ల మన జీవితంలో ఎలాంటి సానుకూల మార్పులు వస్తాయి? ఉదయం పూట దక్కే ఆదనపు సమయం మన లైఫ్‌ను ఎలా మారుస్తుందనే విషయంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పొద్దున్నే లేవడం అనేది ఒక అద్భుతమైన జీవిత రహస్యం. ప్రపంచంలోని ఎందరో మేధావులు, ధనవంతులు, విజయవంతమైన వ్యక్తులు ఉదయాన్నే లేచి తమ పనులను పూర్తి చేసుకున్నవారే. ఉదయం 4:30 లేదా 5 గంటలకు మేల్కొనడం వల్ల మన జీవితంలో కొన్ని లక్షల అదనపు గంటలు వచ్చి చేరుతాయి. ఈ అదనపు సమయాన్ని సద్వినియోగం చేసుకుని ఎన్నో గొప్ప అద్భుతాలను సాధించవచ్చని అన్నారు.

తనికెళ్ళ భరణి గారి సందేశం ప్రకారం, ఏ పనైనా వాయిదా వేయకుండా వెంటనే చేయడం వల్ల కలిగే సంతోషం, సంతృప్తి మరెక్కడా దొరకదు. వాయిదా వేయడం వల్ల అనేక జీవితాలు నాశనమయ్యాయని ఆయన గుర్తుచేశారు. పనిని వెంటనే పూర్తి చేయడం వలన ఒత్తిడి తగ్గి, మానసిక ప్రశాంతత లభిస్తుంది.

అంతేకాకుండా, కుటుంబానికి తగినంత సమయం కేటాయించడం చాలా ముఖ్యం. భార్య, పిల్లలతో మాట్లాడటం, వారి చిన్న చిన్న పనుల్లో సహాయం చేయడం వారి ఆనందానికి, మీ బంధం బలోపేతానికి దోహదపడుతుంది. సూర్యోదయానికి ముందే నిద్రలేవడం, సూర్యాస్తమయం లోపల భోజనం చేయడం ఆరోగ్యానికి అత్యంత మంచిదని పెద్దలు సూచించిన విషయాలు. ఈ చిన్నచిన్న నియమాలను పాటిస్తే జీవితం చాలా ఆనందంగా, ఆరోగ్యంగా ఉంటుందని తనికెళ్ళ భరణి స్పష్టం చేశారు.

ఎక్కువ మంది చదివినవి : Murali Mohan: ఈ చిన్న ట్రిక్స్ తెలిస్తే చాలు జీవితం మారిపోతుంది.. డబ్బు సంపాదనకు మురళీ మోహన్ ఇచ్చిన సలహాలు..

Loading...
Unable to load recommendations.
Follow Us