
Sushant Video with sisters: బాలీవుడ్ దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌కి చెందిన మరో వీడియోను అతడి సోదరి శ్వేత సింగ్ కిర్తి సోషల్ మీడియాలో షేర్ చేశారు. అందులో తన నలుగురు సోదరీమణులతో సుశాంత్ ఎంజాయ్ చేస్తున్నారు. ఈ వీడియో సుశాంత్, ధోని బయోపిక్ కోసం ఒప్పుకున్నప్పుడు తీసిందిగా తెలుస్తుండగా.. ధోని రిటైర్మెంట్ ప్రకటించిన తరువాత శ్వేత దాన్ని సోషల్ మీడియాలో షేర్ చేశారు.
అందులో సుశాంత్ సోదరీమణులు ‘ఇక్కడ మహేంద్ర సింగ్ ధోనీ’, ‘నా తమ్ముడు మహేంద్ర సింగ్ ధోని అవుతున్నాడు’ ‘మేమంతా నిన్ను చూసి గర్వపడుతున్నాం’ అంటూ చెబుతున్నారు. ఇక ఈ వీడియోకు శ్వేత.. మేమంతా చాలా ఎంజాయ్ చేశాము. ఇప్పుడు అంత మారిపోయింది. మేమంతా మళ్లీ ఇలా కలవాలని ఎలా కోరుకోవాలి అని కామెంట్ పెట్టారు. కాగా ధోని బయోపిక్‌లో సుశాంత్ నటించిన విషయం తెలిసిందే. ఈ పాత్ర కోసం ధోనితో కొన్ని రోజులు గడిపిన సుశాంత్, ఆయన నడకతో మొదలు స్టైల్‌ను కూడా నేర్చుకున్నారు. అంతేకాదు ధోనికి చెందిన ఫేమస్ హెలికాఫ్టర్ షాట్‌ని సైతం సుశాంత్ చాలా కష్టపడి నేర్చుకున్నారు. ఇక ఈ సినిమా విడుదలైన తరువాత చాలా మంది ఇందులో ధోనినే నటించాడా..? అన్నట్లుగా కామెంట్లు చేశారు. అంతగా ఆ పాత్రలో ఒదిగిపోయిన సుశాంత్‌కి ఆ చిత్రం మంచి పేరును తీసుకొచ్చిన విషయం తెలిసిందే.
Read More:
బాలసుబ్రహ్మణ్యం సతీమణికి కరోనా పాజిటివ్
అలా చేస్తే రామ్‌కి కూడా నోటీసులు ఇస్తాం: ఏసీపీ