ప్రపంచంలోనే అత్యంత అందమైన మహిళ ఈమేనట..!

ప్రపంచంలోనే అత్యంత అందమైన మహిళ ఈమేనట..!

ఈ సృష్టిలోని అద్భుతాల్లో స్త్రీ కచ్చితంగా ఉంటుంది. అందుకే వారి అందాన్ని పొగిడేందుకు అప్పటి కవులు ప్రకృతిని వాడుకునేవారు. కాగా ప్రస్తుతం ప్రపంచంలోని అత్యంత అందమైన మహిళ ఎవరో తెలుసా..? సూపర్‌ మోడల్ బెల్లా హదీద్(23). గ్రీకు మ్యాథమేటిక్స్ ప్రకారం ఆమె అందం ప్రపంచంలోని అందరి కన్నా మిన్నా అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ప్రాచీన గ్రీక్ లెక్కల ప్రకారం ‘గోల్డెన్ రేషియో ఆఫ్ బ్యూటీ ఫిజికల్ స్టాండర్డ్స్‌’ను ఆధారంగా తీసుకొని విక్టోరియాకు చెందిన ఈ మోడల్ అత్యంత […]

TV9 Telugu Digital Desk

| Edited By:

Oct 18, 2019 | 12:22 PM

ఈ సృష్టిలోని అద్భుతాల్లో స్త్రీ కచ్చితంగా ఉంటుంది. అందుకే వారి అందాన్ని పొగిడేందుకు అప్పటి కవులు ప్రకృతిని వాడుకునేవారు. కాగా ప్రస్తుతం ప్రపంచంలోని అత్యంత అందమైన మహిళ ఎవరో తెలుసా..? సూపర్‌ మోడల్ బెల్లా హదీద్(23). గ్రీకు మ్యాథమేటిక్స్ ప్రకారం ఆమె అందం ప్రపంచంలోని అందరి కన్నా మిన్నా అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ప్రాచీన గ్రీక్ లెక్కల ప్రకారం ‘గోల్డెన్ రేషియో ఆఫ్ బ్యూటీ ఫిజికల్ స్టాండర్డ్స్‌’ను ఆధారంగా తీసుకొని విక్టోరియాకు చెందిన ఈ మోడల్ అత్యంత అందమైన మహిళగా ఎంపిక చేశారు.

గోల్డెన్ రేషియా ప్రకారం హదీద్ ముఖం 94.35 శాతం పర్‌ఫెక్ట్‌గా ఉందని వారు చెప్పారు. ఇక ఆమె తరువాతి స్థానంలో పాప్ సింగర్ దివా బియెన్స్(92.44శాతం పర్‌ఫెక్ట్).. మూడో స్థానంలో నటి అంబర్ హర్డ్(91.85శాతం పర్‌ఫెక్ట్).. నాలుగో స్థానంలో పాప్ స్టార్ అరియానా గ్రాండే(91.81శాతం పర్‌ఫెక్ట్)లు ఉన్నారు. వీరందరికీ సంబంధించిన కొలతలను డా. జులియన్ ది సిల్వా కన్ఫర్మ్ చేశారు. ఆమె లండన్‌లోని ప్రఖ్యాత హార్లే స్ట్రీట్‌లో ఫేసియల్ కాస్మోటిక్ సర్జన్‌గా పనిచేస్తున్నారు.

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu