రికార్డులను తిరగరాసిన “సామజవరగమన సాంగ్”

రికార్డులను తిరగరాసిన సామజవరగమన సాంగ్

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తోన్న “అల వైకుంఠపురంలో” సినిమాలోని మొదటిపాట “సామజవరగమన” విడుదల అయిన విషయం తెలిసిందే. అయితే ఈ పాట ఇప్పుడు సోషల్ మీడియాలో రికార్డుల మోత మ్రోగిస్తోంది. విడుదలైన 24 గంటల్లోనే తెలుగు సినిమాల్లో ఇప్పటి వరకు రానీ వ్యూస్, లైక్‌లను పొంది.. సరికొత్త రికార్డులను సృష్టించింది. ఈ పాటను ప్రముఖ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి రచించగా.. తమన్ మ్యూజిక్ అందించాడు. సిద్ శ్రీరామ్ […]

TV9 Telugu Digital Desk

| Edited By:

Oct 20, 2019 | 2:39 PM

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తోన్న “అల వైకుంఠపురంలో” సినిమాలోని మొదటిపాట “సామజవరగమన” విడుదల అయిన విషయం తెలిసిందే. అయితే ఈ పాట ఇప్పుడు సోషల్ మీడియాలో రికార్డుల మోత మ్రోగిస్తోంది. విడుదలైన 24 గంటల్లోనే తెలుగు సినిమాల్లో ఇప్పటి వరకు రానీ వ్యూస్, లైక్‌లను పొంది.. సరికొత్త రికార్డులను సృష్టించింది. ఈ పాటను ప్రముఖ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి రచించగా.. తమన్ మ్యూజిక్ అందించాడు. సిద్ శ్రీరామ్ ఈ పాటను పాడాడు.

సామజవరగమన సాంగ్ విడుదలైన 24 గంటల్లో 6 మిలియన్ వ్యూస్, 313కే లైక్స్‌ను పొంది రికార్డును సృష్టించింది. తెలుగులో ఫస్ట్ సింగల్‌కు ఇన్ని వ్యూస్, లైక్స్ రావడం ఇదే తొలిసారి. పాట విడుదలైన ప్రారంభం నుంచి గమనిస్తే.. మొదటి 35 నిమిషాల్లోనే 50 వేల లైక్స్, 88 నిమిషాలకు 1 లక్ష లైక్స్, మూడు గంటల 7 నిమిషాలకు లక్ష 50 వేల లైక్స్, 6 గంటల 12 నిమిషాలకు 2 లక్షల లైక్స్, 10 గంటల 22 నిమిషాలకు 2 లక్షల 50 వేల లైక్స్, 22 గంటల 5 నిమిషాలకు 3 లక్షల లైక్స్ రావడం విశేషం. కాగా, ఇప్పటివరకు ఈ పాటకు 40 మిలియన్ వ్యూస్, 7 లక్షలకు పైగా లైక్స్ వచ్చాయి. తెలుగులో ఒక సాంగ్ కు ఇన్ని లైక్స్ , వ్యూస్ రావడం ఇదే ప్రథమం.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu