AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OTT Movie: మనిషికి గుండె కుడివైపు ఉంటే! ఓటీటీలో తెలుగు సస్పెన్స్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

కొన్ని రోజుల క్రితమే ఈ సినిమా థియేటర్లలో విడుదలైంది. మనిషికి కుడివైపు గుండె ఉంటే అనే వినూత్నమైన కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ మెడికల్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ బాగానే ఆడింది. బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లే రాబట్టింది. కథ, కాన్సెప్ట్ పరంగానూ ప్రశంసలు అందుకుంది.

OTT Movie: మనిషికి గుండె కుడివైపు ఉంటే! ఓటీటీలో తెలుగు సస్పెన్స్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
OTT Movie
Basha Shek
|

Updated on: Nov 10, 2026 | 5:53 PM

Share

ఈ వారం ఓటీటీలోకి పలు కొత్త సినిమాలు వస్తున్నాయి. ముఖ్యంగా దసరాకు థియేటర్లలో రిలీజైన సినిమాలన్నీ ఈ వీకెండ్ లో ఓటీటీలో సందడి చేయనున్నాయి. జైలర్ 2, రణబాలి, దాయిరా, క్రేజీ కల్యాణం, హ్యాపీ జర్నీ, పుష్పక విమానం, పరివారిక్ మనురంజన్ లాంటి మూవీస్, సిరీసులు ఈ వారాంతంలో ఆడియెన్స్ ను అలరించనున్నాయి. ఇప్పుడీ జాబితాలోకి మరో కొత్త సినిమా చేరింది. ఇదొక తెలుగు మెడికల్ సర్వైవల్ థ్రిల్లర్. ఆగస్టు 28న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మనిషికి కుడివైపు గుండె ఉంటే అనే వినూత్నమైన కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ సినిమా బాగానే ఆడింది. ఆడియెన్స్ కు సరికొత్త థ్రిల్లింగ్ ఎక్స్ పీరియెన్స్ ఇచ్చింది. అయితే స్టార్ క్యాస్టింగ్ లేకపోవడంతో ఎక్కువ రోజులు థియేటర్లలో ఆడలేకపోయింది. ఇప్పుడీ తెలుగు సినిమా ఓటీటీలోకి రానుంది. తాజాగా దీనికి సంబంధించి అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది.

కికు యనమల, కశిశ్ ఖాన్ ప్రధాన పాత్రల్లో నటించిన రీసెంట్ మెడికల్ సస్పెన్స్ థ్రిల్లర్ ‘కికు చిరంజీవి’. శుభసాయి వెంకట్ దర్శకత్వం వహింంచారు. కికు యనమల, కశిశ్ ఖాన్‌లతో పాటు తనికెళ్ల భరణి, ఈశ్వరీ రావు, శ్రీకాంత్ భరత్, వైవా రాఘవ, గోపరాజు రమణ తదితరులు కీలకపాత్రలు పోషించారు. కికు ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై దీప్తి నడిమింటి నిర్మించిన ఈ సినిమాకు శేఖర్ చంద్ర సంగీతం అందించారు. థియేటర్లలో ఓ మోస్తరుగా ఆడిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి రానుంది. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ తెలుగు ఓటీటీ సంస్థ ఆహా సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో ఈ శనివారం (నవంబర్ 14) నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ కు రానుంది. ఈ విషయాన్నిఆహా ఓటీటీ సంస్థ అధికారికంగా ప్రకటించింది.

ఆహాలో స్ట్రీమింగ్..

‘కికు చిరంజీవి’ సినిమా కథ విషయానికొస్తే.. అరకులో ఫోటోగ్రాఫర్‌గా పనిచేసే చిరంజీవి (కికు యనమల)కి ఒక అరుదైన  సమస్య ఉంటుంది. అతడి గుండె ఎడమ వైపు కాకుండా కుడి వైపు ఉంటుంది. దీన్ని డెక్స్‌ట్రోకార్డియా అంటారు. దీని వల్ల కాస్త కష్టపడినా శ్వాస ఇబ్బందులు వస్తుంటాయి. ఇదే క్రమంలో అరకు టూర్‌కు వచ్చిన మను (కాశీష్ ఖాన్) అనే అమ్మాయితో అతనికి పరిచయం ఏర్పడుతుంది. అయితే మనుని ముఖానికి మాస్క్ ధరించిన వ్యక్తి టార్గెట్ చేస్తాడు. దీంతో వీళ్లిద్దరూ ప్రాణాపాయ పరిస్థితుల్లో చిక్కుకుంటారు. తర్వాత ఏం జరిగింది? అనేది మిగతా స్టోరీ.

‘కికు చిరంజీవి’ సినిమా ట్రైలర్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
మనిషికి గుండె కుడివైపు ఉంటే! ఓటీటీలో తెలుగు సస్పెన్స్ థ్రిల్లర్
మనిషికి గుండె కుడివైపు ఉంటే! ఓటీటీలో తెలుగు సస్పెన్స్ థ్రిల్లర్
దుస్థానాల్లో గ్రహ రాజు రవి..ఈ రాశుల వారు జాగ్రత్త!
దుస్థానాల్లో గ్రహ రాజు రవి..ఈ రాశుల వారు జాగ్రత్త!
అప్పుడు రజినీకాంత్ పక్కన హీరోయిన్.. ఇప్పుడు ఆసుపత్రిలో డాక్టర్..
అప్పుడు రజినీకాంత్ పక్కన హీరోయిన్.. ఇప్పుడు ఆసుపత్రిలో డాక్టర్..
బంగారం ధరలు తగ్గినా కొనేవారికి లాభం లేదే.. భారత్‌లోనే ఎక్కువ..
బంగారం ధరలు తగ్గినా కొనేవారికి లాభం లేదే.. భారత్‌లోనే ఎక్కువ..
15 ఏళ్ల ప్రేమ బంధం రక్తసిక్తం.. నల్లగొండ పోలీస్ క్వార్టర్స్‌లో..
15 ఏళ్ల ప్రేమ బంధం రక్తసిక్తం.. నల్లగొండ పోలీస్ క్వార్టర్స్‌లో..
ఇతరుల ఇళ్లపై రాళ్లు వేయకండి.. రేణు దేశాయ్ ఆసక్తికర పోస్ట్..
ఇతరుల ఇళ్లపై రాళ్లు వేయకండి.. రేణు దేశాయ్ ఆసక్తికర పోస్ట్..
చదువుల గుడిలో వేధింపుల కలకలం.. విద్యార్థినులతో అసభ్య ప్రవర్తన..
చదువుల గుడిలో వేధింపుల కలకలం.. విద్యార్థినులతో అసభ్య ప్రవర్తన..
ఆ ఇద్దరు ఆటగాళ్లపై ఫుల్ క్లారిటీ ఇచ్చేసిన ఢిల్లీ టీం
ఆ ఇద్దరు ఆటగాళ్లపై ఫుల్ క్లారిటీ ఇచ్చేసిన ఢిల్లీ టీం
గాడ్ ఆఫ్ వార్‌పై డైలమా.. అదొక్కటే కారణమా..?
గాడ్ ఆఫ్ వార్‌పై డైలమా.. అదొక్కటే కారణమా..?
రూ.10 టీతో నెలకు రూ.9 లక్షల ఆదాయం.. వ్యాపారి సక్సెస్ సీక్రెట్
రూ.10 టీతో నెలకు రూ.9 లక్షల ఆదాయం.. వ్యాపారి సక్సెస్ సీక్రెట్