Samantha : పాటలు పాడుతూ.. డాన్స్ చేస్తూ సందడి చేసిన సమంత.. ఫన్నీ వీడియోను షేర్ చేసిన అక్కినేని కోడలు పిల్ల

| Edited By: Rajeev Rayala

Jul 16, 2021 | 6:01 AM

సౌత్  సూపర్ క్రేజ్ సొంతం చేసుకున్నారు అండాళ్;ఆ భామ సమంత. చిన్న వయసులోనే మోడల్‏గా కెరీర్ ఆరంభించి.. ఏమాయ చేసావే అన్నట్లుగానే.. తెలుగు ప్రేక్షకులను పూర్తిగా మాయ చేసేసింది సమంత అక్కినేని..

Samantha : పాటలు పాడుతూ.. డాన్స్ చేస్తూ సందడి చేసిన సమంత.. ఫన్నీ వీడియోను షేర్ చేసిన అక్కినేని కోడలు పిల్ల
Sam
Follow us on

Samantha Akkineni : సౌత్  సూపర్ క్రేజ్ సొంతం చేసుకున్నారు అండాళ్;ఆ భామ సమంత. చిన్న వయసులోనే మోడల్‏గా కెరీర్ ఆరంభించి.. ఏమాయ చేసావే అన్నట్లుగానే.. తెలుగు ప్రేక్షకులను పూర్తిగా మాయ చేసేసింది సమంత అక్కినేని.. అతి తక్కువ కాలంలోనే టాలీవుడ్ స్టార్ హీరోల సరసన నటించి.. టాప్ హీరోయిన్‏గా కొనసాగుతుంది. తన నటన…  స్మైల్ తో టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పర్చుకుంది. ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’ వెబ్ సిరీస్ తో ఓటీటీలోకి అడుగుపెట్టి మొదటి ప్రయత్నంలోనే సక్సెస్ అందుకుంది సమంత అక్కినేని. ఈ వెబ్ సిరీస్ లో సామ్ నటనకు సినీ ప్రియులతోపాటు విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకుంది. ఈ వెబ్ సిరీస్ సూపర్ హిట్ సాధించడంతో.. సమంతకు పలు ఓటీటీ సంస్థల నుంచి ఆఫర్లు ఎక్కువగానే వస్తునట్లుగా తెలుస్తోంది. `ఫ్యామిలీ మ్యాన్ 2` సిరీస్ లో ఎల్.టి.టి.యి రెబల్ రాజీ పాత్రలో నటనకు గొప్ప ప్రశంసలు అందుకుంది ఈ బ్యూటీ.

ఫ్యామిలీ మ్యాన్ 2 బ్లాక్ బస్టర్ విజయం సాధించడం వెనక మనోజ్ భాజ్ పాయ్ అద్భుత నటనతో పాటు పోటాపోటీగా రాజీ పాత్రలో సామ్ నటన అంతే పెద్ద ప్లస్ అయ్యిందని చెప్పవచ్చు.  తాజాగా ఈ వెబ్ సిరీస్ షూటింగ్ సమయంలో తీసిన ఓ ఫన్నీ వీడియోను షేర్ చేసింది సమంత. తాజాగా ఇన్ స్టాలో షేర్ చేసిన ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. షాట్ గ్యాప్ లో పాటలు పాడుతూ ..డాన్స్ లు చేస్తూ సందడి చేసింది సామ్. ఈ వీడియో పై నెటిజన్లు రకరకాల కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో పై మీరు ఓ లుక్కేయండి.

మరిన్ని ఇక్కడ చదవండి :

Anchor Varshini: క్రిస్టియానో​ రొనాల్డోతో తెలుగు యాంకర్ నెట్టింట వీడియో వైరల్…

Ram Charan: చరణ్‌ డ్రైవర్‌ సాలరీ.. ఎంతో తెలుసా..?? తెలిస్తే షాకవుతారు..!! వీడియో

Actress Pragathi: వర్కవుట్స్ చేసేది అందుకోసమే..!! అసలు సీక్రెట్ చెప్పేసిన ప్రగతి.. వీడియో