Cinema : ఆ జిల్లాలో అమ్మాయిలంతా మిస్సింగ్.. ఓటీటీలో సంచలనంగా మారిన సస్పెన్స్ థ్రిల్లర్.. టాప్ ట్రెండింగ్..

ఈమధ్యకాలంలో మలయాళీ సస్పెన్స్, థ్రిల్లర్, క్రైమ్ డ్రామా చిత్రాలు ఓటీటీలో దూసుకుపోతున్నాయి. నిజమైన సంఘటనల ఆధారంగా తెరకెక్కించిన ఓ సినిమా ఇప్పుడు డిజిటల్ సినీ ప్రియులను ఆకట్టుకుంటుంది. ఇప్పటికే మలయాళంలో విడుదలైన వర్గం, వాస్తవం, శిఖర్ వంటి చిత్రాలను తెరకెక్కించిన డైరెక్టర్ ఈ సినిమాను రూపొందించారు.

Cinema : ఆ జిల్లాలో అమ్మాయిలంతా మిస్సింగ్.. ఓటీటీలో సంచలనంగా మారిన సస్పెన్స్ థ్రిల్లర్.. టాప్ ట్రెండింగ్..
Uyir Movie

Updated on: Aug 06, 2026 | 6:56 AM

ఓటీటీలో కొత్త కొత్త కంటెంట్ చిత్రాలు దూసుకుపోతున్నాయి. సస్పెన్స్ థ్రిల్లర్, క్రైమ్ డ్రామా సినిమాలకు రోజుకు రోజుకీ మంచి రెస్పాన్స్ వస్తున్నాయి. ముఖ్యంగా మలయాళీ సినిమాలకు ఇటు తెలుగులోనూ మంచి క్రేజ్ ఉన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఒక సినిమా ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. నిజ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఒక చిత్రం ఇప్పుడు ఓటీటీలో టాప్ ట్రెండింగ్ లో దుమ్మురేపుతుంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ పామ్ హాట్ స్టార్ లో 2 గంటల 16 నిమిషాల కథతో సాగుతున్న ఈ సినిమా ఇప్పుడు సంచలనం సృష్టిస్తుంది. ఒక పోలీస్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్‌గా, ఈ సినిమా కథ మిమ్మల్ని ఆద్యంతం కట్టిపడేస్తుంది. మనం మాట్లాడుకుంటున్న సినిమా పేరు ఉయిర్. ఎం. పద్మకుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఒక గొప్ప ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్.

ఎక్కువమంది చదివినవి : Aamani : సినిమాలు మానేసి సీరియల్స్ చేయడానికి కారణం అదే.. ఎట్టకేలకు ఆమని ఓపెన్ కామెంట్స్..

వావ్ సినిమాస్ బ్యానర్‌పై సంతోష్ త్రివిక్రమ్ నిర్మించిన ఈ చిత్రంలో రోషన్ మాథ్యూ కథానాయకుడిగా నటిస్తున్నారు. దక్షిణాది సినిమా ఆధారంగా రూపొందిన ఈ చిత్రం, ఒక హత్య నిందితుడి కోసం గాలిస్తున్న పోలీస్ ఇన్‌స్పెక్టర్ కథను అనుసరిస్తుంది. బావిలో ఒక మహిళ కుళ్ళిపోయిన శవం లభ్యం కావడంతో ఈ సినిమా కథ మొదలవుతుంది. బావిలో లభించిన మృతదేహంపై జరుగుతున్న దర్యాప్తును, జిల్లాలో మహిళలు అదృశ్యమైన కేసులతో దానికి ఉన్న సంబంధాన్ని చూపిస్తుంది.

ఎక్కువమంది చదివినవి :  K. Raghavendra Rao: ఆ హీరోయిన్‏తో 24 సినిమాలు చేశా.. అలాంటి చావు ఎవరికీ రాకూడదు.. డైరెక్టర్ రాఘవేంద్ర రావు..

ఆగస్ట్ 4 నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతుంది. ప్రస్తుతం ఈ సినిమా జియో హాట్‌స్టార్‌లో నంబర్ 1 స్థానంలో ట్రెండింగ్‌లో ఉంది. IMDbలో ‘ఉయిర్’ 8.1/10 అనే అద్భుతమైన రేటింగ్‌ను పొందింది. ఆ మహిళ హత్యకు, కేసును దర్యాప్తు చేస్తున్న పోలీస్ అధికారి వ్యక్తిగత జీవితం ఈ సినిమా కథాంశానికి ప్రధానాంశం.

ఎక్కువమంది చదివినవి : Tollywood : రూ.16 కోట్లతో తీస్తే 400 కోట్ల కలెక్షన్.. యావత్ దేశమే ఆశ్చర్యపోయేలా చేసిన సినిమా..

ఎక్కువమంది చదివినవి : Ramayana Trailer : ఏముందిరా బాబూ.. కుర్రాళ్లు తెగ వెతుకున్న చిన్నది.. రామాయణ ట్రైలర్‏లో తనే స్పెషల్..

Loading...
Unable to load recommendations.
Follow Us