OTT Movies: ఈ వారం ఓటీటీలో 20కు పైగా సినిమాలు.. విశ్వక్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరితో సహా ఫుల్ స్ట్రీమింగ్ లిస్ట్
ఓటీటీలో మాత్రం పలు సూపర్ హిట్, క్రేజీ సినిమాలు సందడి చేయనున్నాయి. వీటిలో తెలుగువే ఎక్కువగా ఉండడం గమనార్హం. ఈ వారం స్ట్రీమింగ్ కు వచ్చే సినిమాల విషయానికి వస్తే.. విశ్వక్ సేన్ నటించిన లేటెస్ట్ హిట్ మూవీ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి పైనే అందరి దృష్టి ఉంది.
థియేటర్లలో పెద్ద సినిమాల సందడి మొదలైంది. ఎలక్షన్లు పూర్తి కావడంతో భారీ బడ్జెట్ సినిమాలు, పెద్ద హీరోల మూవీస్ ఒక్కొక్కటి థియేటర్లలోకి అడుగుపెడుతున్నాయి. అయితే ఈ వారం పెద్దగా బజ్ లేని యేవమ్, మ్యూజిక్ షాప్ మూర్తి, హరోంహర తదితర మూవీస్ ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. మరోవైపు ఓటీటీలో మాత్రం పలు సూపర్ హిట్, క్రేజీ సినిమాలు సందడి చేయనున్నాయి. వీటిలో తెలుగువే ఎక్కువగా ఉండడం గమనార్హం. ఈ వారం స్ట్రీమింగ్ కు వచ్చే సినిమాల విషయానికి వస్తే.. విశ్వక్ సేన్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి పైనే అందరి దృష్టి ఉంది. అలాగే చైతన్య రావు క్రైమ్ కామెడీ థ్రిల్లర్ పారిజాత పర్వం కూడా థియేటర్లలో పాజిటివ్ రెస్పాన్స్ తెచ్చుకుంది. అలాగే పరువు తెలుగు వెబ్ సిరీస్ ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తుంది. ఇక ‘మహారాజ’ మూవీ, ‘ద బాయ్స్’ సిరీస్ పాటు వివిధ భాషలకు చెందిన సినిమాలు, సిరీస్ లు స్ట్రీమింగ్ కు రానున్నాయి. మరి జూన్ 2 వ వారంలో ప్రముఖ ఓటీటీల్లో స్ట్రీమింగ్ కు వచ్చే సినిమాలు, సిరీస్ లేంటో తెలుసుకుందాం రండి.