Raju Yadav OTT: అధికారిక ప్రకటన.. ఓటీటీలోకి గెటప్ శీను ‘రాజు యాదవ్’.. స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే?

ప్రముఖ 'జబర్దస్త్' కమెడియన్ గెటప్ శీను హీరోగా నటించిన చిత్రం ‘రాజు యాదవ్'. కృష్ణమాచారి తెరకెక్కించిన ఈ సినిమాలో అంకికా కారత్ హీరోయిన్ గా నటించింది. పోస్టర్స్, టీజర్స్, ట్రైలర్ ఆసక్తికరంగా ఉండడంతో రిలీజుకు ముందే రాజు యాదవ్ సినిమాపై పాజిటివ్ బజ్ క్రియేట్ అయ్యింది. అందుకు తగ్గట్టే మే 24న థియేటర్లలో రిలీజైన ఈ సినిమా పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది.

Raju Yadav OTT: అధికారిక ప్రకటన.. ఓటీటీలోకి గెటప్ శీను 'రాజు యాదవ్'.. స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే?
Raju Yadav Movie
Follow us

|

Updated on: Jul 20, 2024 | 9:58 AM

ప్రముఖ ‘జబర్దస్త్’ కమెడియన్ గెటప్ శీను హీరోగా నటించిన చిత్రం ‘రాజు యాదవ్’. కృష్ణమాచారి తెరకెక్కించిన ఈ సినిమాలో అంకికా కారత్ హీరోయిన్ గా నటించింది. పోస్టర్స్, టీజర్స్, ట్రైలర్ ఆసక్తికరంగా ఉండడంతో రిలీజుకు ముందే రాజు యాదవ్ సినిమాపై పాజిటివ్ బజ్ క్రియేట్ అయ్యింది. అందుకు తగ్గట్టే మే 24న థియేటర్లలో రిలీజైన ఈ సినిమా పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. ముఖ్యంగా గెటప్ శీను నటనకు పలువురి ప్రశంసలు దక్కాయి. అయితే కథా, కథనంలోని లోపాలుండడంతో రాజు యాదవ్ లాంగ్ రన్ లో ఆడలేకపోయింది. దీంతో చాలా మంది ఈ సినిమాను ఓటీటీలో చూద్దామని ఫిక్స్ అయ్యారు. అలాంటి వారి కోసమే ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ మీదకు వచ్చేస్తున్నాడు రాజు యాదవ్. రాజు యాదవ్ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ తెలుగు ఓటీటీ సంస్థ ఆహా సొంతం చేసుకుంది. దీనికి సంబంధించి ఇది వరకే అధికారిక ప్రకటన విడుదల చేసింది. తాజాగా రాజు యాద‌వ్ ఓటీటీ రిలీజ్‌ను ఆహా అధికారికంగా ప్రకటించింది. జులై 24 నుంచి గెటప్ శీను సినిమాను స్ట్రీమింగ్ కు తీసుకొస్తున్నట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది ఆహా. ఈ మేరకు ట్విట్టర్‌లో ఓ స్పెష‌ల్ వీడియోను పోస్ట్ చేసింది.

‘అప్పుడు థియేటర్లకు వెళ్లాం.. ఇప్పుడు ఇంటింటికీ వెళ్లబోతున్నాం. మంచి ఫన్, ఎమోషన్స్, మంచి మెసేజ్ ఓరియంటెడ్ మూవీ రాజు యాదవ్ జులై 24న ఆహా ఓటీటీలోకి రానుంది’అంటూ ఈ వీడియోలో చెప్పుకొచ్చారు జబర్దస్త్ గెటప్ శీను. వరుణ్వి క్రియేషన్స్ పతాకంపై రాజేష్ కల్లేపల్లి ప్రశాంత్ రెడ్డి నిర్మించిన ఈ సినిమాలో నంద చక్రపాణి, రూపాలక్ష్మి, ఉన్నతి, ఉత్తర ప్రశాంత్, సంతోష్ రాజ్, రాకెట్ రాఘవ, మిర్చి హేమంత్, జబర్దస్త్ సన్నీ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. హర్షవర్ధన్ రామేశ్వర్, సురేష్ ఈ సినిమాకు సంగీతం అందించారు. మరి థియేటర్లలో రాజు యాదవ్ కామెడీ అండ్ ఎమోషనల్ మూమెంట్స్ ను మిస్ అయ్యారా? అయితే 4 రోజులు వెయిట్ చేయండి. ఎంచెక్కా ఓటీటీలో చూసి ఎంజాయ్ చేయండి.

ఇవి కూడా చదవండి

మరో 4 రోజుల్లో

ఆహాలో స్ట్రీమింగ్..

రాజు యాదవ్ ట్రైలర్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.