జబర్దస్త్ కు దూరమైన సిరి..  ఇప్పుడు ఏం చేస్తుందో తెలుసా ??

TV9 Telugu

19 JULY 2024

సిరి హన్మంతు  గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. యూట్యూబ్‌ ద్వారా గుర్తింపు తెచ్చుకున్న సిరి బిగ్‌ బాస్‌ షోతో మరింతగా పాపులర్‌ అయ్యింది. 

ఇందులో షణ్ముఖ్‌తో ఆమె చేసిన రొమాన్స్, పండించిన కెమిస్ట్రీ బాగా హైలైట్‌ అయ్యింది. ఆ షో నుండి బయటకు వచ్చిన తరువాత మరింతగా పాపులర్‌ అయ్యింది

ఆ తరువాత అడపాదడపా సినిమాలు వెబ్‌ సిరీస్‌లోనూ మెరుస్తుంది. ప్రియుడు శ్రీహాన్‌తో వీడియోస్ కూడా చేశారు. ఇలా సోషల్‌ మీడియా ద్వారా ఎంటర్‌టైన్‌ చేసింది. 

ఈ క్రమంలో జబర్దస్త్ షోలో సౌమ్యరావు స్థానంలో యాంకర్‌గా అవకాశం దక్కింది ఈ చిన్నదానికి. కానీ అనసూయ లేని లోటుని భర్తీ చేయలేకపోయింది.

ఈ క్రమంలో సడెన్‌గా జబర్దస్త్ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు రెండు రోజులు ప్రసారం అవుతున్న జబర్దస్త్ కి రష్మి గౌతమ్‌ యాంకరింగ్‌ చేస్తుంది. 

అయితే షో నుంచి బయటకు వచ్చాక ఏం చేస్తుంది అనే విషయం ఓ యూట్యూబ్‌ ఛానెల్‌తో మాట్లాడుతూ బయట పెట్టింది సిరి.

ఆ మధ్య జవాన్‌ చిత్రంలో పోలీస్ ఆఫీసర్‌గా అదరగొట్టింది సిరి. తాజాగా ఆమె మరో పాన్ ఇండియా మూవీ చేస్తున్నట్టు తెలిపింది సిరి.

దీంతోపాటు శర్వానంద్‌తో ఓ సినిమా చేస్తుందట. మరో కొత్త ప్రాజెక్ట్ లైనప్‌లో ఉందని చెప్పింది. అలాగే శ్రీహాన్‌, శేఖర్‌ మాస్టర్‌లతో కలిసి ఓ వెబ్‌ సిరీస్‌ చేస్తున్నట్టు తెలిపింది.