మీకు షుగర్ ఉందా ?? అయితే ఈ డ్రైఫ్రూట్స్ అస్సలు తినొద్దు
TV9 Telugu
19 JULY 2024
ఎండుద్రాక్ష : ఇందులో షుగర్ కంటెంట్ ఎక్కువుగా ఉంటుంది. రక్తంలో త్వరగా కలిసిపోయి చక్కె స్థాయిని పెంచుతుంది. మధుమేహం ఉన్నవారు రోజుకు 10గ్రాముల కన్నా తక్కువ తీసుకోవాలి.
ఎండిన ఆప్రికాట్లు : ఇవి చాలా తియ్యగా ఉంటాయి. వీటిలో గ్లూకోజ్ కంటెంట్ అధికంగా ఉంటుంది. ఇవి రక్తంలో చక్కెర స్థాయిని మరింత పెంచుతాయి. బ్రేక్ ఫాస్ట్‌లో 1 లేదా 2 ఆప్రికాట్లును తీసుకోవచ్చు.
ఖర్జూరం పండ్లు : ఇవి సహజంగా తీపి స్వభావాన్ని కలిగి ఉంటాయి. మధుమేహం ఉన్నవారిలో రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడం సవాలుగా మారుతుంది. వీటిని తినేటప్పుడు వైద్యుల సలహా తీసుకోవడం చాలా అవసరం.
అంజీరా: అంజీరా పండ్లలో చక్కెర అధికంగా ఉంటుంది, ఇది అధికంగా తీసుకుంటే రక్తంలో చక్కెరను పెంచుతుంది. మధుమేహంతో బాధపడేవారు ఎండిన అత్తి పండ్లను మితంగా తినాలి.
ప్రూనే ప్రూనే: వీటిలో కార్బొహైడ్రేట్లు, స్వీట్ కంటెంట్ అధికంగా ఉంటాయి. ఇది ఎండిన ప్లం ఫ్రూట్. మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఇది చాలా ప్రమాదకరమని వైద్య నిపుణులు అంటున్నారు.
ఎండిన మామిడిపండ్లు: మామిడిని పండ్లలో రారాజుగా పిలుస్తారు. కానీ మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఇది మంచి పండు కాదు. ఇది అధిక మొత్తంలో సహజ చక్కెరను కలిగి ఉంటుంది.
క్రాన్‌బెర్రీస్ : వీటిలో షుగర్ కంటెంట్అధికంగా ఉంటుంది. మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఇది చాలా ప్రమాదకరమని డాక్టర్లు అంటున్నారు. రక్తంలో త్వరగా కలిసి... షుగర్ లెవల్స్ ను పెంచుతుంది.
ఎండిన పైనాపిల్స్: వీటిలో చక్కెర కంటెంట్ అధికంగా ఉంటుంది. ఒక అధ్యయనం ప్రకారం, ఎండిన పైనాపిల్స్ తినడం వల్ల రక్తంలో చక్కెర పెరుగుతుంది. ఎందుకంటే ఇందులో చాలా కార్బోహైడ్రేట్లు ఉంటాయి.