AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Daaku Maharaaj OTT: ఎక్స్‌ట్రా కంటెంట్‌తో ఓటీటీలో బాలయ్య డాకు మహారాజ్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?

నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన డాకు మహారాజ్ థియేటర్లలో రిలీజై నెల రోజులు గడుస్తోంది. సంక్రాంతి కానుకగా రిలీజైన ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. దీంతో బాలయ్య ఫ్యాన్స్ డాకు మహారాజ్ ఓటీటీ రిలీజ్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Daaku Maharaaj OTT: ఎక్స్‌ట్రా కంటెంట్‌తో ఓటీటీలో బాలయ్య డాకు మహారాజ్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
Daaku Maharaaj Movie
Basha Shek
|

Updated on: Feb 10, 2025 | 8:35 PM

Share

నందమూరి నటసింహం బాలకృష్ణ నటించిన తాజా చిత్రం డాకు మహారాజ్. కొల్లి బాబీ అలియాస్ కే.ఎస్. రవీంద్ర తెరకెక్కించిన ఈ హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటి రోజే రికార్డు స్థాయిలో రూ.56 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు రాబట్టింది. తద్వారా బాలకృష్ణ కెరీర్‌లో అత్యధిక ఓపెనింగ్ వసూళ్లు సాధించిన సినిమాగా నిలిచింది. బాలయ్య మార్క్ యాక్షన్, బాబీ డైరెక్షన్, తమన్ బీజీఎమ్.. డాకు మహారాజ్ సినిమాను బ్లాక్ బస్టర్ గా నిలపడంలో కీలక పాత్ర పోషించాయి. ఆ తర్వాత హిందీ తదితర భాషల్లోనూ డాకు మహారాజ్ ను రిలీజ్ చేశారు మేకర్స్. బాక్సాఫీస్ వద్ద ఓవరాల్ గా ఈ మూవీ రూ. 150 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. థియేటర్లలో ఆడియెన్స్ కు పూనకాలు తెప్పించిన డాకు మహారాజ్ ఓటీటీ రిలీజ్ కోసం చాలా మంది ఎదురు చూస్తున్నారు. అయితే బాలయ్య సినిమా స్ట్రీమింగ్ పై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. డాకు మహారాజ్ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ఓటీటీ దిగ్గజం నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. ఇందుకోసం భారీ మొత్తం చెల్లించి నట్లు కూడా సమాచారం. ఫిబ్రవరి 09 నుంచి బాలయ్య సినిమా స్ట్రీమింగ్ కు వస్తుందని ప్రచారం సాగింది. అయితే అదేమీ జరగలేదు.

కాగా డాకు మ‌హారాజ్ సినిమా వ‌చ్చే వారం నుంచి నెట్‌ ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానున్న‌ట్టు తెలుస్తోంది. ఇదే సందర్భంగా బాల‌య్య ఫ్యాన్స్ కు ఓ స్వీట్ స‌ర్‌ప్రైజ్ రాబోతుందని సమచారం. డాకు మ‌హారాజ్ సినిమా మ‌రి కొంత కొత్త కంటెంట్ తో ఓటీటీలోకి రాబోతున్న‌ట్టు తెలుస్తోంది. థియేట‌ర్ల‌లో చూడ‌ని డాకు మ‌హారాజ్ లోని ఓ సాంగ్ ను డైరెక్ట్ గా ఓటీటీ కంటెంట్ లో రిలీజ్ చేయ‌నున్నార‌ని నెట్టింట ప్రచారం జరుగుతోంది.

ఇవి కూడా చదవండి

సితార ఎంటర్‌టైన్‍మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై నాగవంశీ, నాగసౌజన్య తెరకెక్కించిన డాకు మహారాజ్ సినిమాలో ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్లుగా నటించారు. ఊర్వశి రౌతేలా, చాందిని చౌదరి కీలక పాత్రల్లో మెరిశారు . బాలీవుడ్ నటుడు బాబీ డియోల్, సచిన్ ఖేడ్ కర్, హిమజ, వీటివి గణేష్, ఆడుకలం నరేన్, షైన్ టామ్ చాకో, మకరంద్ దేశ్ పాండే, సందీప్ రాజ్, బిగ్ బాస్ దివి, రిషి, రవికిషన్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. ఎస్ ఎస్ తమన్ సంగీతమందించారు. మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
ఉదయాన్నే గ్రౌండ్‌లో వింత ఆకారం.. దగ్గరికెళ్లి చూసి పరుగో పరుగు..
ఉదయాన్నే గ్రౌండ్‌లో వింత ఆకారం.. దగ్గరికెళ్లి చూసి పరుగో పరుగు..
పింక్ సాల్ట్ vs తెల్ల ఉప్పు: ఆరోగ్యానికి ఏది మంచిది?
పింక్ సాల్ట్ vs తెల్ల ఉప్పు: ఆరోగ్యానికి ఏది మంచిది?
ఏనుగులు పగబడతాయని మీకు తెల్సా.? ఒక్కసారి వాటి జోలికెళ్తే..
ఏనుగులు పగబడతాయని మీకు తెల్సా.? ఒక్కసారి వాటి జోలికెళ్తే..
ఐపీఎల్ 2026లో కొత్త రూల్.. బౌలర్లకు ఇక పండగే
ఐపీఎల్ 2026లో కొత్త రూల్.. బౌలర్లకు ఇక పండగే
అతడిని నమ్మి చాలా డబ్బు పోగొట్టుకున్నాను.. శ్రీకాంత్..
అతడిని నమ్మి చాలా డబ్బు పోగొట్టుకున్నాను.. శ్రీకాంత్..
గ్యాస్ సిలిండర్ వాడేవారికి లాస్ట్ ఛాన్స్.. ఇది చేయకపోతే..
గ్యాస్ సిలిండర్ వాడేవారికి లాస్ట్ ఛాన్స్.. ఇది చేయకపోతే..
హరీష్ రాణా కన్నుమూత.. కారుణ్య మరణం అనుమతి పొందిన తొలి భారతీయుడు!
హరీష్ రాణా కన్నుమూత.. కారుణ్య మరణం అనుమతి పొందిన తొలి భారతీయుడు!
Kuja Gochar: మీన రాశిలో కుజుడు.. ఆ రాశుల వారికి అదృష్టాల వెల్లువ
Kuja Gochar: మీన రాశిలో కుజుడు.. ఆ రాశుల వారికి అదృష్టాల వెల్లువ
వందల సినిమాల్లో నటించిన ఆహుతి ప్రసాద్ ఎలా చనిపోయారో తెలుసా? పాపం
వందల సినిమాల్లో నటించిన ఆహుతి ప్రసాద్ ఎలా చనిపోయారో తెలుసా? పాపం
వాట్ ఇండియా థింక్స్ టుడేలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్పీచ్..
వాట్ ఇండియా థింక్స్ టుడేలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్పీచ్..