కాబోయే భర్తకు నిహారిక స్పెషల్ విషెస్‌‌

| Edited By:

Jul 26, 2020 | 4:44 PM

కాబోయే భర్తకు మెగా డాటర్ నిహారిక స్పెషల్ విషెస్ చెప్పారు. ఇవాళ చైతన్య పుట్టినరోజు కాగా.. వారిద్దరు కలిసి ఉన్న ఫొటోలను నిహారిక ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు

కాబోయే భర్తకు నిహారిక స్పెషల్ విషెస్‌‌
Follow us on

కాబోయే భర్తకు మెగా డాటర్ నిహారిక స్పెషల్ విషెస్ చెప్పారు. ఇవాళ చైతన్య పుట్టినరోజు కాగా.. వారిద్దరు కలిసి ఉన్న ఫొటోలను నిహారిక ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు. ఈ సందర్భంగా.. ”ఒక నవ్వు గది మొత్తం వెలుగులు నింపుతుంది, కౌగిలింతలు ఇంట్లో ఉండేలా అనుభూతిని కలిగిస్తాయి. నవ్వు నా సంతోషమైన ప్రదేశానివి చై. ఇది మొదటిది మాత్రమే. ప్రతి విషయంలో నీకు ఉత్తమంగా జరగాలి. హ్యాపీ బర్త్‌ డే లవ్‌’ అని నిహారిక పేర్కొన్నారు. నిహారిక పోస్ట్‌పై స్పందించిన చైతన్య.. ”థ్యాంక్స్‌ నిహా.. జస్ట్‌ మేడ్‌ మై డే అగైన్‌‌” అని కామెంట్‌ పెట్టారు. కాగా ఇటీవలే తనకు కాబోయే భర్త అంటూ చైతన్య ఫొటోను రివీల్ చేశారు నిహారిక. గుంటూరు పోలీసుశాఖలో ఐజీగా విధులు నిర్వర్తిస్తున్న జొన్నలగడ్డ ప్రభాకర్‌ కుమారుడు  చైతన్య కాగా.. వీరిద్దరి వివాహం ఈ ఏడాదిలోనే జరగనుంది.

Read This Story Also: నా మనసు మరోసారి విరిగిపోయింది: ‘దిల్‌ బేచారా’పై కృతి