ప్రభాస్-నాగ్‌ అశ్విన్‌ మూవీలో ఇస్మార్ట్ బ్యూటీ!

సవ్యసాచితో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన నిధి అగర్వాల్‌ ఇస్మార్ట్ శంకర్‌తో మంచి విజయాన్ని ఖాతాలో వేసుకుంది

ప్రభాస్-నాగ్‌ అశ్విన్‌ మూవీలో ఇస్మార్ట్ బ్యూటీ!

Updated on: Aug 24, 2020 | 11:53 AM

iSmart beauty in Prabhas film: సవ్యసాచితో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన నిధి అగర్వాల్‌ ఇస్మార్ట్ శంకర్‌తో మంచి విజయాన్ని ఖాతాలో వేసుకుంది. ప్రస్తుతం ఈ నటి అశోక్ గల్లా హీరోగా ఎంట్రీ ఇస్తోన్న చిత్రంలో నటిస్తోంది. ఇదిలా ఉంటే తాజాగా ఈ బ్యూటీకి ఓ బంపరాఫర్ వచ్చినట్లు తెలుస్తోంది. రెబల్‌ స్టార్ ప్రభాస్‌ హీరోగా నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తోన్న భారీ బడ్జెట్ చిత్రంలో రెండో హీరోయిన్‌గా ఈ బ్యూటీ పేరు వినిపిస్తోంది.

ఇందులో మొదటి హీరోయిన్‌గా బాలీవుడ్ భామ దీపికా పదుకొనే ఫిక్స్ అవ్వగా.. మరో హీరోయిన్‌గా నిధిని అనుకుంటున్నారట దర్శకనిర్మాతలు. దీనికి సంబంధించి నాగ్ అశ్విన్ త్వరలో ఆమెతో సంప్రదింపులు జరపబోతున్నట్లు తెలుస్తోంది. అసలే ప్రభాస్ సినిమా.. అందులోనూ పలు భారతీయ భాషల్లో తెరకెక్కే చిత్రం. అలాంటి మూవీలో ఆఫర్ వస్తే వదులుకోవడానికి ఎవ్వరూ ఇష్టపడరు. ఈ క్రమంలో నిధి కూడా ఈ ఆఫర్‌కి ఒప్పుకుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. మరి ఇందులో నిజమెంత..? నిధికి బిగ్‌ ఆఫర్ వచ్చినట్లేనా..? వంటి ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే. కాగా సైన్స్ ఫిక్షన్ కథాంశంతో తెరకెక్కబోతున్న ఈ చిత్రాన్ని అశ్వనీదత్ నిర్మించబోతున్నారు.

Read More:

సుశాంత్‌కి రియా ఇచ్చే మందులు హైడోసేజ్‌తో ఉండేవి

కరోనాతో మృతి చెందాడంటూ.. ఎన్నారై నుంచి 85వేలు వసూలు

Loading...
Unable to load recommendations.
Follow Us