సూపర్ స్టార్ మహేశ్ బాబు ఫ్యాన్స్‏కు గుడ్ న్యూస్.. సర్కారు వారి పాట రిలీజ్ డేట్ ఫిక్స్..

| Edited By: Pardhasaradhi Peri

Dec 12, 2020 | 12:37 PM

మహేశ్ బాబు ఫ్యాన్స్‏కు గుడ్ న్యూస్. సూపర్ స్టార్ నటించనున్న కొత్త సినిమా సర్కారు వారి పాట సినిమా షూటింగ్ వచ్చే ఏడాది మొదలు కానుంది.

సూపర్ స్టార్ మహేశ్ బాబు ఫ్యాన్స్‏కు గుడ్ న్యూస్.. సర్కారు వారి పాట రిలీజ్ డేట్ ఫిక్స్..
Follow us on

మహేశ్ బాబు ఫ్యాన్స్‏కు గుడ్ న్యూస్. సూపర్ స్టార్ నటించనున్న కొత్త సినిమా సర్కారు వారి పాట సినిమా షూటింగ్ వచ్చే ఏడాది మొదలు కానుంది. ఈ సినిమాకు పరుశురామ్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇందులో మహేశ్‏కు జంటగా మహానటి ఫేమ్ కీర్తి సురేష్ నటిస్తున్నారు. కాగా ఇటీవల ఈ సినిమా రీలిజ్ డేట్‏కు సంబంధించిన వార్త ఫీల్మ్ నగర్‏లో చక్కర్లు కోడుతుంది. ఈ మూవీని వచ్చే ఏడాది ఆగస్టు 7న విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే చిత్రయూనిట్ సినిమా షూటింగ్ పనులలో బిజి అయినట్లుగా టాక్. ఈ సినిమాలో మహేశ్ బ్యాంక్ ఎంప్లాయిగా కనిపించడంతోపాటు పాన్ బ్రోకర్‏గా కనిపిస్తాడని విశ్వసనీయ వర్గాల అంచనా. మరీ చూడాలి నిజాంగానే మహేశ్ సర్కారు వారి పాట్ వచ్చే ఏడాది థియెటర్లలోకి వస్తుందో లేదో. కాగ మహేశ్ నటించిన సరిలేరు నీకెవ్వరు సినిమా బాక్స్ ఫీసు దగ్గర కాసుల వర్షం కురుపించిన సంగతి తెలిసిందే.