కోయిలమ్మ ఫేం సమీర్ (అమర్) అరెస్ట్.. చర్లపల్లి జైలుకు తరలించిన పోలీసులు.. బొటిక్ వ్యాపారంలో గొడవలు..

|

Feb 10, 2021 | 12:28 PM

కోయిలమ్మ ఫేం సమీర్ అలియాస్ అమర్‏ను రాయదుర్గం పోలీసులు అరెస్ట్ చేశారు. కొన్ని రోజుల క్రితం బోటిక్ విషయంలో స్నేహితురాళ్ల మధ్య జరిగిన

కోయిలమ్మ ఫేం సమీర్ (అమర్) అరెస్ట్.. చర్లపల్లి జైలుకు తరలించిన పోలీసులు.. బొటిక్ వ్యాపారంలో గొడవలు..
Follow us on

కోయిలమ్మ ఫేం సమీర్ అలియాస్ అమర్‏ను రాయదుర్గం పోలీసులు అరెస్ట్ చేశారు. కొన్ని రోజుల క్రితం బోటిక్ విషయంలో స్నేహితురాళ్ల మధ్య జరిగిన గొడవలో భాగంగా అమర్ పై రాయదుర్గం పోలీస్ స్టేషన్లో కేసు నమోదైన విషయం తెలిసిందే. కాగా బుధవారం అమర్‏ను పోలీసులు అరెస్ట్ చేశారు. అతనికి కూకట్ పల్లి కోర్టు రిమాండ్ విధించగా.. చర్లపల్లి జైలుకు అమర్‏ను తరలించారు పోలీసులు.

అసలు విషయానికోస్తే.. శ్రీవిద్య, స్వాతి, లక్ష్మీ అనే ముగ్గురు మహిళలు మణికొండలో బొటిక్ వ్యాపారం నిర్వహిస్తున్నారు. అందులో నష్టం రావడంతో స్వాతి బొటిక్ వ్యాపారం నుంచి తప్పుకుంది. అయితే తనకు రావాల్సిన కుట్టు మెషిన్, డబ్బుల విషయంలో ఆ ముగ్గురి మధ్య గొడవలు జరుగుతున్నాయి. స్వాతి తనకు రావాల్సిన డబ్బులు మరియు వస్తువుల కోసం తన స్నేహితుడు కోయిలమ్మ సీరియల్ నటుడు అమర్‏తో కలిసి శ్రీవిద్య ఇంటికి వెళ్లి నిలదీశారు. క్రమంగా వీరి మధ్య మాటా పెరిగి గొడవకు దారి తీయడంతో.. పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళింది. తాగిన మత్తులో అమర్ అసభ్య పదజాలంతో తనను దూషించాడని శ్రీవిద్య రాయదుర్గం పోలీసులుకు ఫిర్యాదు చేసింది. అయితే అమర్, స్వాతిలు కూడా రికౌంటర్ కేసు పెట్టారు. కేసు నమోదు చేసుకున్న రాయదుర్గం పోలీసులు లోతుగా దర్యాప్తు చేపటడుతున్నారు.

Also Read:

Oscars 2021: ఆస్కార్ రేసు నుంచి తప్పుకున్న ‘జల్లికట్టు’.. భారత సినిమాకు మరోసారి తీవ్ర నిరాశే..