Actor : ఇండస్ట్రీలో పెద్ద హీరో.. లగ్జరీ లైఫ్ పక్కన పెట్టి పల్లెటూరిలో ఉంటున్న నటుడు.. 25 ఎకరాల్లో సొంత ఇల్లు..

ఒకప్పుడు ఆయన తోపు హీరో. సుధీర్ఘ కాలంగా నటుడిగా ప్రేక్షకులను అలరిస్తూ తనదైన ముద్ర వేశారు. ఇప్పటికీ కీలకపాత్రలు పోషిస్తూ వెండితెరపై అలరిస్తున్నారు. ఒక్కో సినిమాకు కోట్లలో పారితోషికం తీసుకునే ఈ నటుడు మాత్రం సాధారణ జీవితం గడుపుతున్నాడు. హాడావిడి పట్టణానికి దూరంగా ఉంటున్న ఈ నటుడి గురించి తెలుసుకోండి.

Actor : ఇండస్ట్రీలో పెద్ద హీరో.. లగ్జరీ లైఫ్ పక్కన పెట్టి పల్లెటూరిలో ఉంటున్న నటుడు.. 25 ఎకరాల్లో సొంత ఇల్లు..
Nana Patekar Luxurious Farm House

Updated on: Aug 30, 2026 | 4:14 PM

బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరో నానా పటేకర్. 1978లో ‘గమన్’ చిత్రంతో సినీ రంగ ప్రవేశం చేసిన నానా పటేకర్ దాదాపు 4 దశాబ్దాలుగా చిత్ర పరిశ్రమలో ఉన్నారు. ఈ సమయంలో నానా అనేక చిత్రాలలో నటించారు. నానాకు దాదాపు 10 మిలియన్ డాలర్ల (72 కోట్ల రూపాయల) విలువైన ఆస్తి ఉందని సమాచారం. ఇందులో ఆయన ఫామ్‌హౌస్, కార్లు, ఇతర ఆస్తులు ఉన్నాయి. అయినప్పటికీ, నానా సాధారణ జీవితాన్నే గడపడానికి ఇష్టపడతారు. పూణే సమీపంలోని ఖడక్‌వాస్లాలో 25 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఒక అద్భుతమైన ఫామ్‌హౌస్ నానా పటేకర్‌కు ఉంది. నగర కోలాహలం నుండి దూరంగా నానా పటేకర్ సాధారణ జీవితం గడుపుతున్నారు. తన ఇంటి వద్ద ధాన్యాలు, గోధుమలు , ఆకుకూరలను కూడా పండిస్తారు. నానా పటేకర్ ఫామ్‌హౌస్‌లో 7 గదులు , ఒక పెద్ద హాల్ ఉన్నాయి.

ఎక్కువమంది చదివినవి : Tollywood: కొత్తింట్లోకి అడుగుపెట్టిన టాలీవుడ్ హీరోయిన్.. ఫ్యామిలీతో కలిసి గృహ ప్రవేశం.. ఫోటోస్ వైరల్..

నానా ఇష్టానికి అనుగుణంగా, ఇందులో సాధారణ చెక్క ఫర్నిచర్ , టెర్రకోట ఫ్లోర్లు ఉన్నాయి. నానా తన అవసరాలకు అనుగుణంగా తన ఇంటిని అలంకరించుకున్నారు. దీనితో పాటు, ఇంటి సమీపంలో అనేక రకాల చెట్లు , పొదలను నాటారు. ఫామ్‌హౌస్‌లో పెద్ద సంఖ్యలో ఆవులు , గేదెలు ఉన్నాయి. నానా పటేకర్ రూ. 81 లక్షల విలువైన ఆడి క్యూ7 కారును కలిగి ఉన్నారు. దీనితో పాటు, ఆయన రూ. 10 లక్షల విలువైన మహీంద్రా స్కార్పియో , రూ. 1.5 లక్షల విలువైన రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350 బైక్‌లను కూడా కలిగి ఉన్నారు.

ఎక్కువమంది చదివినవి : Nagarjuna : ఆయన తినే రైస్ మనం తినలేము.. నాగార్జున డైట్ రివీల్ చేసిన మేకప్ ఆర్టిస్టు..

పూణేలోని ఖడక్‌వాస్లాలోని డోంజే గ్రామంలో అతనికి ‘నానాచీ వాడి’ అనే వ్యవసాయ క్షేత్రం ఉంది. అతను సింహగడ్ పర్వత పాదాల వద్ద 7 నుండి 8 ఎకరాల విస్తీర్ణంలో ఈ వ్యవసాయ క్షేత్రాన్ని సాగు చేస్తున్నాడు.

ఎక్కువమంది చదివినవి : Cinema : దేశాన్ని కుదిపేసిన నిజమైన సంఘటనతో తీసిన సినిమా.. ఓటీటీలో భయం పుట్టించింది.. ట్రెండింగ్‌లో నంబర్ వన్..

ఎక్కువమంది చదివినవి : Soundarya: సౌందర్య ఫస్ట్ సినిమా హీరో ఇప్పుడేం చేస్తున్నాడో తెలుసా.. ? 13 ఏళ్లకే స్టార్ డమ్.. ఇప్పుడు ఇలా..

Loading...
Unable to load recommendations.
Follow Us