కన్నడ హీరో యష్.. కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్‌గా మారిపోయాడు. సాధారణ రౌడీ ఓ పెద్ద మాఫీయా డాన్‌ను ఎదుర్కొవడం.. భారీ లక్ష్యాన్ని.. ఎలా చేరుకోవాలో చూపించిన తీరు ప్రేక్షకులను ఆకట్టుకుంది. మరోసారి యశ్ తో కలిసి.. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కేజీఎఫ్ చాప్టర్ 2 ను తెరకెక్కిస్తున్నాడు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఇదిలా ఉంటే.. యశ్ తదుపరి చిత్రం కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తాజాగా రాక్ స్టార్ నెక్ట్స్ మూవీకి సంబంధించి వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ముఫ్తీ ఫేం నార్తాన్ డైరెక్షన్ లో యశ్ సినిమా చేయబోతున్నట్లుగా టాక్. యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో పాన్ ఇండియా మూవీగా రాబోతున్న ఈ సినిమాకు యశ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా సమాచారం. అంతేకాదు.. ఇందులో యశ్ నెవీ ఆఫీసర్ గా కనిపించబోతున్నట్లుగా టాక్. ఈ సినిమాను జీ స్టూడియోస్, హోంబాలే ఫిల్మ్స్ సంయుక్తంగా నిర్మించనున్నట్లుగా తెలుస్తోంది. ఇక ఇందులో యశ్ సరసన తమన్నా హీరోయిన్ గా నటించబోతుందట. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలను ప్రకటించనున్నట్లుగా సమాచారం. అయితే ఇంతవరకు ఈ సినిమాకు టైటిల్ ఖారారు కాలేదు. ప్రశాంత్ నీల్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా ఉగ్రమ్, రథవారా చిత్రాలకు పనిచేశారు. ఆ తర్వాత 2017లో ముఫ్తీ సినిమాను తెరకెక్కించారు. ఈ మూవీ సూపర్ హిట్ సాధించింది.