సుశాంత్‌కి నివాళులర్పించిన ‘ఇంటర్నేషనల్ స్పేస్‌ యూనివర్సిటీ’

ఆత్మహత్య చేసుకొని తనువు చాలించిన బాలీవుడ్ యువ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌కి ఫ్రాన్స్‌లోని ఇంటర్నేషనల్ స్పేస్ యూనివర్సిటీ నివాళులు అర్పించింది.

సుశాంత్‌కి నివాళులర్పించిన 'ఇంటర్నేషనల్ స్పేస్‌ యూనివర్సిటీ'
Follow us

| Edited By:

Updated on: Jun 16, 2020 | 5:01 PM

ఆత్మహత్య చేసుకొని తనువు చాలించిన బాలీవుడ్ యువ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌కి ఫ్రాన్స్‌లోని ఇంటర్నేషనల్ స్పేస్ యూనివర్సిటీ నివాళులు అర్పించింది. ఈ మేరకు ఓ ప్రకటనను విడుదల చేసిన ఆ యూనివర్సిటీ.. ”భారతీయ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆకస్మిక మరణం మమ్మల్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. ఆయన స్టెమ్‌ విద్యకు(సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమ్యాటిక్స్‌) చాలా మద్దతును ఇచ్చేవారు. అంతేకాదు ఇంటర్నేషనల్ స్పేస్ యూనివర్సిటీని ఆయన ఫాలో అయ్యేవారు. గతేడాది వేసవిలో యూనివర్సిటీ సెంట్రల్ క్యాంపస్‌ని సందర్శించాలని ఆయనను కోరాము. ఇక్కడకు వచ్చేందుకు ఆయన కూడా ఓకే చెప్పారు. కానీ కమిట్‌మెంట్‌ల వలన సుశాంత్ రాలేకపోయారు. ఆయన ఙ్ఞాపకాలు మాకు ఎప్పుడూ గుర్తుంటాయి. భారతదేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా అభిమానుల గుండెల్లో ఆయన ఎప్పుడూ నిలిచి ఉంటారు” అని కామెంట్ పెట్టారు.

కాగా చదువుల్లో మంచి బ్రిలియంట్ స్టూడెంట్‌ అయిన సుశాంత్ ఏఐఈఈఈ(AIEEE)లో ఆల్‌ ఇండియా 7వ ర్యాంకును సాధించారు. నేషనల్ ఫిజిక్స్‌ ఒలంపియాడ్‌లో బంగారు పతకాన్ని సాధించారు. అంతేకాదు ఫిజిక్స్‌, ఆస్ట్రానమీలో ఎంతో ఆసక్తి కలిగిన సుశాంత్ ‘చందమామ దూర్‌ కే’ అనే చిత్రంలో నటించేందుకు ప్రఖ్యాత అంతరిక్ష పరిశోధన కేంద్రం నాసాలో ట్రైనింగ్ తీసుకున్నారు. కానీ కారణాలు తెలీదు గానీ ఈ సినిమా సెట్స్‌ మీదకు వెళ్లకుండానే ఆగిపోగింది. ఇక తన కోరికల లిస్ట్‌లోనూ ఫిజిక్స్‌, ఆస్ట్రానమీ, మోర్స్ కోడ్, మెషిన్ లెర్నింగ్ వంటి విషయాలను సుశాంత్ పొందపరిచిన విషయం తెలిసిందే.

Read This Story Also: భారత్‌కి అందిన 100 వెంటిలేటర్లు

https://www.instagram.com/p/CBfHyEuDEQW/?utm_source=ig_embed

Latest Articles