అప్పుడు తమన్నాను పెళ్లి చేసుకునేదాన్ని: శ్రుతీ హాసన్

మిల్కీ బ్యూటీ తమన్నాను పెళ్లి చేసుకునేదాన్ని అంటూ హాట్ కామెంట్స్ చేసింది లోకనాయకుడి తనయ శ్రుతీహాసన్. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన శ్రుతీ, తమన్నాపై మరోసారి తన ప్రేమను వ్యక్తపరిచింది. ఈ నేపథ్యంలో ఓ ప్రశ్నకు స్పందిస్తూ ఒకవేళ తాను మగాడిలా పుట్టింటే తమన్నాను పెళ్లి చేసుకునేదాన్ని అంటూ తెలిపింది. ఆమె అందం చూసి మాత్రమే కాదని, తను చాలా మంచి అమ్మాయి అని, అంత ఈజీగా తమన్నాను వదులుకునేదాన్ని కాదంటూ శ్రుతీ తెలిపింది. కాగా శ్రుతీహాసన్, […]

అప్పుడు తమన్నాను పెళ్లి చేసుకునేదాన్ని: శ్రుతీ హాసన్
Follow us

| Edited By:

Updated on: Mar 15, 2019 | 11:42 AM

మిల్కీ బ్యూటీ తమన్నాను పెళ్లి చేసుకునేదాన్ని అంటూ హాట్ కామెంట్స్ చేసింది లోకనాయకుడి తనయ శ్రుతీహాసన్. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన శ్రుతీ, తమన్నాపై మరోసారి తన ప్రేమను వ్యక్తపరిచింది. ఈ నేపథ్యంలో ఓ ప్రశ్నకు స్పందిస్తూ ఒకవేళ తాను మగాడిలా పుట్టింటే తమన్నాను పెళ్లి చేసుకునేదాన్ని అంటూ తెలిపింది. ఆమె అందం చూసి మాత్రమే కాదని, తను చాలా మంచి అమ్మాయి అని, అంత ఈజీగా తమన్నాను వదులుకునేదాన్ని కాదంటూ శ్రుతీ తెలిపింది.

కాగా శ్రుతీహాసన్, తమన్నా మంచి స్నేహితులు. హాలీడేస్ వస్తే ఈ ఇద్దరు కలిసి ఫారిన్‌లకు చెక్కేస్తారు. అయితే ఈ ఇద్దరు కలిసి ఇంతవరకు ఏ సినిమాలో నటించకపోగా.. అవకాశం వస్తే కచ్చితంగా చేస్తామంటూ శ్రుతీ, తమన్నా పలు సందర్భాలలో తెలిపారు. కాగా తమన్నా ప్రస్తుతం సైరా, దటీజ్ మహాలక్ష్మి చిత్రాలలో నటిస్తుండగా.. శ్రుతీ హాసన్ మ్యూజిక్ షోలను చేస్తూ బిజీగా గడుపుతోంది.