సినిమా ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది. పారాసైట్ సినిమాకు ఆస్కార్ అవార్డు గెల్చుకున్న ప్రముఖ హాలీవుడ్ నటుడు లీ సన్-క్యున్ అనుమానాస్పదంగా మరణించారు. బుధవారం (డిసెంబర్ 27) ఒక కారులో అతని మృతదేహం లభ్యమైంది. కాగా లీ సన్-క్యున్ గత కొన్ని నెలలుగా మాదకద్రవ్యాల వినియోగానికి సంబంధించి ఆరోపణలు ఎదుర్కొన్నాడు. విచారణకు కూడా హాజరవుతున్నాడు. ఇంతలోనే నటుడి హఠాన్మరణం పలు అనుమానాలకు తావిస్తోంది. అయితే నివేదికల ప్రకారం, లీ సన్ క్యున్ ఆత్మహత్యకు పాల్పడినట్లు అనుమానిస్తున్నారు. లీ సన్ క్యున్ తన నివాసంలో నోట్ రాసి, కారులోనే వదిలేసి విషం తాగి ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. గత అక్టోబర్‌లో లీ సన్ క్యూన్పై డ్రగ్స్ వినియోగం కేసు నమోదైంది. సియోల్‌లోని ఓ బార్లో వెయిటర్‌తో కలిసి డ్రగ్స్ తీసుకున్నట్లు తెలిసింది. అయితే తాను డ్రగ్స్ తీసుకోలేదని లీ సన్ క్యూన్ తెలిపారు. బార్ వెయిట్రెస్ ఇచ్చిన డ్రింక్ తాగానని, అది మందు అని తనకు తెలియదని చెప్పాడు. అయితే లీ నా నివాసానికి వచ్చి చాలాసార్లు గంజాయి సేవిస్తున్నాడని ఆ మహిళలు ఆరోపిస్తున్నారు. అయితే మహిళల ఆరోపణలను తోసిపుచ్చిన లీ.. తాను పరీక్షకు సిద్ధమేనని చెప్పారు. లీపై డ్రగ్ పరీక్ష అసంపూర్తిగా ఉంది. కాబట్టి లీని విచారించారు. లీని మూడుసార్లు విచారించారు. లీ తన మరణానికి 19 గంటల ముందు కూడా విచారణలో ఉండడం గమనార్హం. కాగా లీ మరణానంతరం పోలీస్ డిపార్ట్మెంట్ ఒక ప్రకటన విడుదల చేసింది, “లీ దర్యాప్తు సమయంలో మరణించడం దురదృష్టకరం. అతని హఠాన్మరణంపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపడతాం. అయితే లీ మరణానంతరం పోలీసుల వ్యవహరించిన తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సెలబ్రిటీలు కూడా మనుషులే’ అనే హ్యాష్‌ట్యాగ్ ట్రెండింగ్‌లో ఉంది.
సెంట్రల్ సియోల్ పార్క్‌లోని కారులో లీ మృతి చెందినట్లు దక్షిణ కొరియా అత్యవసర కార్యాలయం బుధవారం తెలిపింది. బుధవారం సియోల్‌లోని ఒక గుర్తుతెలియని ప్రదేశంలో నటుడు అపస్మారక స్థితిలో ఉన్నట్లు పోలీసు అధికారులు ఇంతకు ముందు చెప్పారు. అందిన సమాచారం ప్రకారం, లీ సన్ క్యున్ ఇంటి నుండి వెళ్లిపోయిన తర్వాత, అతని భార్య పోలీసులకు సమాచారం అందించింది. లీ సన్ క్యూన్ సూసైడ్ నోట్ కూడా లభ్యమైంది. కాగా ఉత్తమ చిత్రం, ఉత్తమ విదేశీ చిత్రం, ఉత్తమ సినిమాటోగ్రఫీ, ఉత్తమ దర్శకుడు విభాగాల్లో ఆస్కార్ అవార్డు గెల్చుకుంది పారాసైట్. ఇందులో లీ నటనకు విమర్శకుల ప్రశంసలు కూడా దక్కాయి.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.