వర్మను కెలికిన జొన్నవిత్తుల.. కౌంటర్‌ అటాక్‌లో నిలిచేనా..!

రామ్ గోపాల్ వర్మ అలియాస్ ఆర్జీవీ. సంచలనాలకు మారు పేరు. పలు వివాదాస్పద వ్యాఖ్యలతో ఎప్పుడూ వార్తల్లో ఉండే వర్మతో పెట్టుకునేందుకు అటు పేరు మోసిన రాజకీయ నాయకులు, ఇటు స్టార్ హీరోలు సైతం ముందడుగు వేయరు. అలాంటిది అనుకోకుండా వర్మతో పెట్టుకున్నాడు ప్రముఖ పాటల రచయిత జొన్నవిత్తుల. కమ్మరాజ్యంలో కడప రెడ్లు అంటూ రెండు వర్గాల మధ్య వర్మ విబేధాలు రెచ్చగొడుతున్నారంటూ జొన్నవిత్తుల ఏకిపారేశారు. ఓ ఛానెల్ చర్చా కార్యక్రమంలో పాల్గొన్న వర్మ.. జొన్నవిత్తులకు జొన్నవిత్తుల […]

వర్మను కెలికిన జొన్నవిత్తుల.. కౌంటర్‌ అటాక్‌లో నిలిచేనా..!
TV9 Telugu Digital Desk

| Edited By: Ram Naramaneni

Nov 01, 2019 | 3:34 PM

రామ్ గోపాల్ వర్మ అలియాస్ ఆర్జీవీ. సంచలనాలకు మారు పేరు. పలు వివాదాస్పద వ్యాఖ్యలతో ఎప్పుడూ వార్తల్లో ఉండే వర్మతో పెట్టుకునేందుకు అటు పేరు మోసిన రాజకీయ నాయకులు, ఇటు స్టార్ హీరోలు సైతం ముందడుగు వేయరు. అలాంటిది అనుకోకుండా వర్మతో పెట్టుకున్నాడు ప్రముఖ పాటల రచయిత జొన్నవిత్తుల. కమ్మరాజ్యంలో కడప రెడ్లు అంటూ రెండు వర్గాల మధ్య వర్మ విబేధాలు రెచ్చగొడుతున్నారంటూ జొన్నవిత్తుల ఏకిపారేశారు.

ఓ ఛానెల్ చర్చా కార్యక్రమంలో పాల్గొన్న వర్మ.. జొన్నవిత్తులకు జొన్నవిత్తుల చౌదరి అనే బిరుదు ఇవ్వగా.. దీనిపై ఆయన ఘాటుగా స్పందించారు. వర్మ బతికున్న శవం లాంటివాడు. అతడి దిక్కుమాలిన ఆలోచనల వలన సొసైటీకి దుష్పరిణామాలు ఎక్కువ. ఇంత బరితెగించినవాడు సమాజంలో ఉండకూడదు. అతిడిపై పప్పు వర్మ అనే బయోపిక్ తీస్తాను అంటూ కాస్త ఆవేశంతో మాట్లాడారు. అంతేకాదు చివర్లో వర్మపై ఓ సెటైరికల్‌ పాటను కూడా పాడారు. ఇక వీటిపై రివర్స్ కౌంటర్ ఇచ్చిన వర్మ.. తనదైన శైలిలో వ్యంగ్యంగా, కాస్త వివాదాస్పదంగా ఆయనపై ట్వీట్ చేశారు.

‘‘ఓ నా బుజ్జి జొన్నా.. నీ వీడియో చూశాన్రా కిస్సీ బాయ్. నువ్వు అప్పుడప్పుడూ దశాబ్దానికొకసారైనా ఒక స్త్రీతో ఎంజాయ్ చెయ్యి బేబి, లేకపోతే ఫ్రస్టేషన్‌తో చచ్చిపోతావ్ జొన్నా. నీ భార్య పిల్లలు నిన్నెలా భరిస్తున్నారు డార్లింగ్ వాళ్ల మీద జాలేస్తుంది స్వీట్ హార్ట్. కానీ ఐ లవ్ యు డా’’ అంటూ ఆ ట్వీట్‌లో కామెంట్లు చేశాడు వర్మ. అయితే ఇంకా దీనిపై జొన్నవిత్తుల స్పందించలేదు.

ఇదిలా ఉంటే ఇంతవరకు ఏ కాంట్రవర్సీల్లోనూ జొన్నవిత్తుల తలదూర్చలేదు. అలాంటిది ఇప్పుడు వర్మతో జొన్నవిత్తుల అనవసరంగా పెట్టుకున్నాడంటూ కొంతమంది కామెంట్లు పెడుతున్నారు. మరికొందరేమో పాపం జొన్నవిత్తుల అంటూ సంఘీభావం తెలుపుతుండగా.. ఇంకొందరేమో ‘నీ వరకు వస్తేగానీ ఆ బాధ తెలీదా’’ అంటూ వర్మకు కౌంటర్లు ఇస్తున్నారు. మరి ఈ వివాదం ఇప్పటికైనా ఆగుతుందా..? జొన్నవిత్తుల వెనక్కి తగ్గుతారా..? ఆర్జీవీ ఈ విషయాన్ని ఇప్పటికైనా వదిలేస్తారా..? ఇలాంటి ప్రశ్నలన్నింటికి కాలమే సమాధానం చెప్పాలి.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu