Comrade Kalyan Review: కామ్రేడ్ కళ్యాణ్ సినిమా రివ్యూ.. నక్సలైట్ గా శ్రీ విష్ణు మెప్పించాడా..?

కింగ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ శ్రీ విష్ణు హీరోగా కోన వెంకట్ స్క్రీన్ ప్లే అందించిన సినిమా కామ్రేడ్ కల్యాణ్. ఇందులో మహిమా నంబియార్ కథానాయికగా నటించింది. డైరెక్టర్ జానకిరామ్ మారెళ్ల దర్శకత్వంలో వచ్చిన ఈ తెలుగు పీరియాడిక్ యాక్షన్ డ్రామా అక్టోబర్ 9న అడియన్స్ ముందుకు వచ్చింది.ే నక్సలిజం బ్యాక్గ్రౌండ్ లో వచ్చిన ఈ కామెడీ ఎంటర్టైనర్ ప్రేక్షకులను ఎంతవరకు మీరు పిలిచిందో చూద్దాం..

Comrade Kalyan Review: కామ్రేడ్ కళ్యాణ్ సినిమా రివ్యూ.. నక్సలైట్ గా శ్రీ విష్ణు మెప్పించాడా..?
Comrade Kalyan Review

Edited By:

Updated on: Oct 09, 2026 | 8:39 AM

మూవీ రివ్యూ: కామ్రేడ్ కళ్యాణ్

నటీనటులు: శ్రీ విష్ణు, మహిమ నంబియార్, సత్య, సుదర్శన్, షైన్ టామ్ చాకో, రాధికా శరత్ కుమార్, శత్రు, సాయి చందు తదితరులు

ఎడిటింగ్: చోటా కే ప్రసాద్

సినిమాటోగ్రఫీ: సాయి శ్రీరామ్

సంగీతం: విజయ్ బుల్గనిన్

స్క్రీన్ ప్లే: కోన వెంకట్

కథ, దర్శకుడు: జానకిరామ్ మారెళ్ళ

కింగ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ శ్రీ విష్ణు హీరోగా కోన వెంకట్ స్క్రీన్ ప్లే అందించిన సినిమా కామ్రేడ్ కల్యాణ్. నక్సలిజం బ్యాక్గ్రౌండ్ లో వచ్చిన ఈ కామెడీ ఎంటర్టైనర్ ప్రేక్షకులను ఎంతవరకు మీరు పిలిచిందో చూద్దాం..

కథ:

90వ దశకంలో నక్సలైట్ల ప్రభావం తీవ్రంగా ఉన్న అటవీ ప్రాంతం నేపథ్యంలో ఈ చిత్రం మొదలవుతుంది. ఆ ఊరికి స్పెషల్ టాస్క్ ఫోర్స్ అధికారిగా వచ్చిన జార్జ్ కుట్టి(షైన్ టామ్ చాకో)పై అన్నల దళం ఎటాక్ చేస్తుంది. సరిగ్గా అదే సమయంలో మాడగుల అనే పల్లెటూరిలో సినిమా హాల్ ఆపరేటర్‌గా పని చేస్తుంటాడు కళ్యాణ్ (శ్రీ విష్ణు). ఆ ఊరికి వలస వచ్చిన సితార (మహిమ నంబియార్) అనే అమ్మాయిని చూసి తొలిచూపులోనే ప్రేమిస్తాడు. అయితే ఆమె కుటుంబం చేసిన అప్పుల కారణంగా బిష్వాస్ (ఉపేంద్ర లమాయే) అనే వడ్డీ వ్యాపారి వాళ్ళను ఇబ్బంది పెడుతుంటాడు. పైసలు తిరిగి ఇవ్వకపోతే సితారని బలవంతంగా పెళ్లి చేసుకుంటానని బెదిరిస్తాడు. ఆమెను కాపాడుకునేందుకు ఆ డబ్బును తాను కడతానని కళ్యాణ్ మాటిస్తాడు. ఆ భారీ మొత్తాన్ని తీసుకురావడానికి తన స్నేహితులతో కలిసి హీరో వేసిన ప్లాన్ ఏంటి? ఆ ప్రయత్నంలో ఊహించని విధంగా కామ్రేడ్ కళ్యాణ్‌గా ఎలా మారాడు? చివరికి తన ప్రేయసిని దక్కించుకున్నాడా లేదా అనేది మిగతా సినిమా.

కథనం:

పోలీసులు, నక్సలిజం, ప్రభుత్వ వ్యవస్థల చుట్టూ తిరిగే చాలా బరువైన పాయింట్‌ను తీసుకుని, దానికి పూర్తిగా ఎంటర్టైన్మెంట్ ముడిపెట్టి డైరెక్టర్ ఈ చిత్రాన్ని నడిపించాడు. ఇలాంటి సీరియస్ సబ్జెక్ట్‌ను కామెడీ యాంగిల్‌లో చెప్పాలనుకోవడం సాహసమే. అయితే లాజిక్స్ పక్కనపెట్టి కేవలం వినోదం కోణంలో చూస్తే మాత్రం చాలా చోట్ల బాగా నవ్వులు పూస్తాయి. ప్రథమార్థం మొత్తం పాత్రల పరిచయం, హీరో లవ్ ట్రాక్, డబ్బు కోసం చేసే ప్రయత్నాలతో చాలా సరదాగా టైంపాస్ అయిపోతుంది. ముఖ్యంగా కామెడీ సన్నివేశాలు బాగా పేలడంతో మొదటి భాగం ఎక్కడా బోర్ కొట్టదు. కానీ ద్వితీయార్థం మొదలయ్యాక అడవి నేపథ్యంలో సీన్స్ ఉండటంతో నవ్వించే స్కోప్ బాగా తగ్గిపోయింది. చుట్టూ తుపాకులు పట్టుకున్న వాళ్ల మధ్య ఫన్ క్రియేట్ చేయడం కష్టంగా మారడంతో ఇక్కడి నుంచి సినిమా కాస్త నెమ్మదిస్తుంది. మధ్యలో రాజకీయ నాయకుడి కిడ్నాప్ ఎపిసోడ్ ద్వారా మళ్లీ కొంత వినోదాన్ని రాబట్టే ప్రయత్నం చేసినా అది అప్పటికే చాలా సినిమాల్లో చూసేసిన ఫీలింగ్ కలుగుతుంది. కొత్త క్యారెక్టర్లు ఎంట్రీ ఇవ్వకపోవడం, ఉన్న పాత్రలనే మళ్లీ మళ్లీ వాడుకోవడంతో ద్వితీయార్థంలో ఫ్రెష్‌నెస్ మిస్ అయింది. పైగా హీరో మార్క్ కామెడీని పక్కనపెట్టి, పతాక సన్నివేశాల్లో భారీగా సందేశాలు ఇవ్వడం కొంత ఇబ్బందిగా మారుతుంది. సినిమాను మెసేజ్‌లతో కాకుండా సరదాగా ఎండ్ చేసి ఉంటే రిజల్ట్ ఇంకాస్త బెటర్‌గా ఉండేది.

నటీనటులు:

తనదైన టైమింగ్‌తో ఈ సినిమాను ఒంటిచేత్తో ముందుకు తీసుకెళ్లాడు హీరో శ్రీవిష్ణు. పెద్దగా బలం లేని డైలాగులకు కూడా తన మార్క్ యాక్టింగ్‌తో ప్రాణం పోసి ప్రేక్షకులను నవ్వించాడు. ఇక ఈ చిత్రానికి మరో ప్రధాన బలం కమెడియన్ సత్య. ఫస్ట్ హాఫ్‌లో విదేశాల నుంచి వచ్చిన వాడిగా ఎంట్రీ ఇచ్చి కడుపుబ్బా నవ్వించాడు. తన బాడీ లాంగ్వేజ్, పంచ్ డైలాగ్స్ సినిమాకు చాలా ప్లస్ అయ్యాయి. విలన్‌గా చేసిన ఉపేంద్ర నటన కాస్త రొటీన్‌గా అనిపిస్తుంది. పోలీస్ ఆఫీసర్‌గా నటించిన షైన్ టాం చాకోకి పెద్దగా స్కోప్ దొరకలేదు. హీరోయిన్ పాత్ర కథలో ఉన్నప్పటికీ పెర్ఫార్మెన్స్ చేయడానికి పెద్దగా ఛాన్స్ దక్కలేదు. సీనియర్ నటి రాధిక క్యారెక్టర్ మొదట్లో యాక్టివ్‌గా అనిపించినా ఆ తర్వాత సైడ్ అయిపోయింది.

టెక్నికల్ టీం:

సంగీత దర్శకుడు విజయ్ బుల్గనిన్ అందించిన పాటల్లో హీరోయిన్ మీద వచ్చే సాంగ్ తో పాటు అడవి నేపథ్యంలో వచ్చే ఒక విప్లవ గీతం చాలా బాగున్నాయి. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా సన్నివేశాలకు తగ్గట్లుగా సెట్ అయింది. ఒక పాటను ట్రిమ్ చేయాలన్న ఎడిటింగ్ టీం నిర్ణయం సినిమా నిడివిని కాపాడింది. కెమెరా వర్క్ పల్లెటూరి వాతావరణాన్ని, అటవీ ప్రాంతాన్ని చాలా అందంగా, సహజంగా చూపించింది. మాటల రచయితలు రాసిన ట్రెండీ డైలాగ్స్ చాలా చోట్ల బాగా వర్కవుట్ అయ్యాయి. పోటీగా వేరే సినిమాలు లేకపోవడం, వరుస సెలవులు రావడం ఈ చిత్రానికి బాక్సాఫీస్ దగ్గర బాగా కలిసిరానుంది.

పంచ్ లైన్:

ఓవరాల్ గా కామ్రేడ్ కళ్యాణ్.. కామెడీ కళ్యాణ్..!

Loading...
Unable to load recommendations.
Follow Us