
Shoot Out At Alair: మెగాస్టార్ చిరంజీవి ఇవాళ 65వ పుట్టినరోజును జరుపుకుంటోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రముఖులు, అభిమానులు సోషల్ మీడియాలో మెగాస్టార్‌కి పుట్టినరోజు శుభాకాంక్షలను వెల్లడిస్తున్నారు. చిరంజీవి ఇలానే ఎంతోమందిని ఇన్స్పైర్ చేయాలని వారు కామెంట్లు పెడుతున్నారు. కాగా చిరు పుట్టినరోజు సందర్భంగా మెగా తనయ సుస్మిత కొణిదెల ఫ్యాన్స్‌కి స్పెషల్ గిఫ్ట్ ఇచ్చారు. తన భర్త విష్ణు ప్రసాద్‌తో కలిసి ఇటీవల గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ అనే నిర్మాణ సంస్థను సుస్మిత ప్రారంభించిన విషయం తెలిసిందే.
తమ నిర్మాణ సంస్థలో మొదటగా షూట్ అవుట్ ఎట్ ఆలేరు అనే వెబ్ సిరీస్‌ని తెరకెక్కిస్తుండగా.. దానికి సంబంధించిన ఫస్ట్‌లుక్ మోషన్ పోస్టర్ని ఇవాళ విడుదల చేశారు. థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కిన ఈ సిరీస్ మోషన్ పోస్టర్ అందరినీ ఆకట్టుకుంటోంది. ఇక ఇందులో ప్రకాష్ రాజ్, శ్రీకాంత్ కీలక పాత్రల్లో నటిస్తుండగా.. ఓయ్ ఫేమ్ ఆనంద్ రంగ దర్శకత్వం వహిస్తున్నారు. హైదరాబాద్‌లోని ఓ పోలీస్, కొంతమంది కరుడు గట్టిన నేరస్తుల కథల ఆధారంగా ఈ వెబ్సిరీస్ని తెరకెక్కించినట్లు చిత్ర బృందం వెల్లడించింది. ఇక ఈ వెబ్ సిరీస్ జీ 5లో త్వరలో విడుదల కాబోతోంది.
Read More:
సుశాంత్ కేసు: కీలక విషయం బయటపెట్టిన లాక్స్మిత్
ప్రణబ్ ఆరోగ్య పరిస్థితిపై ఆర్మీ ఆసుపత్రి ప్రకటన