Guess The Actress: తొలి సినిమాతోనే కుర్రాళ్ల గుండెల్లో బాంబు పేల్చిన బ్యూటీ.. ఈ బర్త్‌డే గర్ల్‌ ఎవరో చెప్పుకోండి.

|

Dec 05, 2022 | 12:18 PM

సినిమా రంగంలో ఒక్క సినిమాతోనే అందరి దృష్టిని ఆకర్షించిన వారు చాలా తక్కువ మంది ఉంటారు. ఒకే ఒక సినిమాతో ఇండస్ట్రీని షేక్‌ చేసిన తారామణుల జాబితా టాలీవుడ్‌లో చాలా చిన్నది. పైన ఫొటోలో కనిపిస్తోన్న హీరోయిన్‌ కూడా ఈ జాబితాలోకి వస్తుంది. మొదటి సినిమాలోనే..

Guess The Actress: తొలి సినిమాతోనే కుర్రాళ్ల గుండెల్లో బాంబు పేల్చిన బ్యూటీ.. ఈ బర్త్‌డే గర్ల్‌ ఎవరో చెప్పుకోండి.
Guess The Actress
Follow us on

సినిమా రంగంలో ఒక్క సినిమాతోనే అందరి దృష్టిని ఆకర్షించిన వారు చాలా తక్కువ మంది ఉంటారు. ఒకే ఒక సినిమాతో ఇండస్ట్రీని షేక్‌ చేసిన తారామణుల జాబితా టాలీవుడ్‌లో చాలా చిన్నది. పైన ఫొటోలో కనిపిస్తోన్న హీరోయిన్‌ కూడా ఈ జాబితాలోకి వస్తుంది. మొదటి సినిమాలోనే తన అందం, అభినయంతో మెస్మరైజింగ్‌ చేసిందీ బ్యూటీ. కేవలం అందంతోనే కాకుండా నెగిటివ్‌ రోల్‌లో ఉన్న పాత్రలో అద్భుతమైన నటనను కనబరిచిన ఈ బ్యూటీ తెలుగు కుర్రకారు మదలును దోచేసింది.

ముఖం కనిపించకుండా రెండు చేతులు అడ్డం పెట్టుకున్న ఈ బ్యూటీ పుట్టిన రోజు నేడు. ఇంతకీ అందాల తారను గుర్తుపట్టారా.? పేరుకు పంజాబీ ఇండస్ట్రీతో వెండి తెరకు ఎంట్రీ ఇచ్చినా టాలీవుడ్‌ ద్వారానే మంచి క్రేజ్‌ను సంపాదించుకుంది. కుర్రాల గుండెల్లో ‘ఆర్‌ఎక్స్‌’ అనే బాంబును పేల్చింది. అవును.. మీరు అనుకుంటోంది నిజమే. ఈ బ్యూటీ మరెవరో కాదు అందాల తార పాయల్‌ రాజ్‌పుత్‌. ఆర్‌ఎక్స్‌100లో ఇందు అనే పాత్రలో నటించిన మెప్పించిన ఈ బ్యూటీ అత్యంత తక్కువ సమయంలోనే టాలీవుడ్‌లో క్రేజీ్‌ హీరోయిన్‌గా పేరు సంపాదికుంది. వరుస సినిమా అవకాశాలు దక్కించుకుంటూ దూసుకుపోతోంది.

ఇవి కూడా చదవండి

ఇదిలా ఉంటే ఈరోజు (డిసెంబర్ 5) పాయల్‌ రాజ్‌పుత్ పుట్టిన రోజు. నేటితో 30వ వసంతంలోకి అడుగుపెట్టిందీ చిన్నది. సినిమాలకే పరిమితం కాకుండా 3రోజేస్‌ అనే వెబ్‌సిరీస్‌లోనూ నటించి మెప్పించింది. తాజాగా జిన్నా మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన పాయల్‌, ప్రస్తుతం తెలుగులో ఒక సినిమా, తమిళంలో ఒక సినిమాలో నటిస్తోంది. ఓ వైపు సినిమాలతో బిజీగా ఉంటూనే మరోవైపు షాపింగ్‌ మాల్స్‌ ఓపెనింగ్‌తోనూ బిజీ బిజీగా గడిపేస్తున్న ఈ బ్యూటీ ఇటీవలే హైదరాబాద్‌లో సొంతిళ్లు కొనుగోలు చేసింది. మరి ఈ అందాల తారకు మనమూ పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పేద్దామా.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..