ఆమె ఓ ఫేమస్ యూట్యూబర్. ఇప్పుడిప్పుడే టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది. తెలుగులో వరుస ఆఫర్స్ అందుకుంటూ బిజీగా ఉంటుంది. అటు సినిమాలు.. ఇటు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ నిత్యం ఏదోక పోస్ట్ చేస్తూ నెటిజన్లను ఆకట్టుకుంటుంది. ఇక తాజాగా సంక్రాంతి పండగ సందర్భంగా తన తన ఇన్ స్టాలో చీరకట్టులో వయ్యరాలు ఒలకబోస్తూ వీడియోస్, ఫోటోస్ షేర్ చేస్తూ నెటిజన్స్ గుండెలను పిండేస్తుంది. పైన ఫోటోలో కనిపిస్తున్న అమ్మడు అచ్చ తెలుగు సోయగం. చీరకట్టులో పక్కింటి అమ్మాయిలా కనిపించే ఈ బ్యూటీ పక్కా హైదరాబాదీ . ఇంతకీ ఆ వయ్యారి ఎవరో తెలుసా.. ? తనే హీరోయిన్ కుషిత కల్లపు. నటనపై ఆసక్తితో మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టింది కుషిత. కానీ హైదరాబాద్ డ్రగ్స్ కేసులో ఆమె పేరు తెరపైకి వచ్చింది. డ్రగ్స్ కోసం వెళ్లలేదు.. చీజ్ బజ్జీల కోసమే పబ్ కు వెళ్లానంటూ కుషిత చెప్పిన మాటలు నెట్టింట హాట్ టాపిక్ అయ్యాయి.
దీంతో ఈ అమ్మాడి పేరు సోషల్ మీడియాలో మారుమోగింది. ఇక ఆ తర్వాత నెట్టింట ఈ బ్యూటీ సైతం తెగ యాక్టివ్ అయ్యింది. ట్రెడిషనల్, మోడ్రన్ డ్రెస్సింగ్ లో వరుస ఫోటోషూట్స్ షేర్ చేస్తూ ఫాలోయింగ్ పెంచుకుంది. ఆ తర్వాత తెలుగులో ఆఫర్స్ అందుకుంది. ఛాంగురే బంగారు రాజా, నీతోనే నేను సినిమాల్లో నటించింది. ఆ తర్వాత మనోహరం సినిమాలో కనిపించింది. తెలుగులో ఇప్పుడిప్పుడే గుర్తింపు సంపాదించుకుంటున్న ఈ అమ్మడు.. ఇప్పుడు నెట్టింట క్రేజీ వీడియోస్ షేర్ చేసింది.
సంక్రాంతి పండగ సందర్భంగా చీరకట్టులో ఊర్లో తన ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేసినట్లుగా తెలుస్తోంది. కోడి పందాలు, పొలాల్లో వరుస ఫోటోషూట్స్ చేస్తూ నెట్టింట ఫాలోయింగ్ పెంచుకుంటుంది. తాజాగా ఈ అమ్మడి క్యూట్ ఫోటోస్ తెగ ఆకట్టుకుంటున్నాయి.
ఇది చదవండి : Tollywood: తస్సాదియ్యా.. గ్లామర్ బ్యూటీలో ఈ టాలెంట్ కూడా ఉందా..? ఎవరో తెలుసా..
Tollywood: 7 సంవత్సరాల్లో 3 పెళ్లిళ్లు చేసుకున్న హీరోయిన్.. ఇప్పటికీ ఒంటరిగానే జీవితం.. ఎవరంటే..
Tollywood: వారెవ్వా.. మెంటలెక్కిస్తోన్న మల్లీశ్వరి చైల్డ్ ఆర్టిస్ట్.. ఎంతగా మారిపోయింది.. ?
Tollywood: ఇండస్ట్రీలోనే అత్యంత ఖరీదైన విడాకులు.. ఆ స్టార్ హీరో భార్యకు ఎంత భరణం ఇచ్చాడంటే..