Urvashi Rautela: సెలబ్రిటీల లైఫ్ స్టైల్ అంటేనే లగ్జరీగా ఉంటుంది. ప్రతీ వస్తువును స్టేటస్ సింబల్‌గా భావిస్తుంటారు. మరీ ముఖ్యంగా సినీ పరిశ్రమలో ఉండే వారు అన్ని విషయాల్లో ఆడంబరం ఉట్టిపడేలా వ్యవహరిస్తుంటారు. ఈ క్రమంలో ఇంటిలో అంకరణకు ఉపయోగించే వస్తవుల నుంచి చివరికి లిప్‌స్టిక్ వరకు అన్నీ లగ్జరీ ప్రొడక్ట్స్ వాడాలని చూస్తుంటారు. తాజాగా బాలీవుడ్ ముద్దుగుమ్మ ఊర్వశి రౌతేలా ఇలాంటి ఓ లగ్జరీ వస్తువుతోనే అందరి దృష్టిని తనవైపు తిప్పుకుంది. వివరాల్లోకి వెళితే.. ఊర్వశి ఇటీవల ఓ ప్రైవేటు జెట్‌లో ప్రయాణించిన వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ఇందులో భాగంగానే ఈ అమ్మడు పట్టుకున్న బ్యాగ్ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
ఊర్వశి ఉపయోగిస్తున్న హ్యాండ్ బ్యాగ్ అలాంటి ఇలాంటి బ్యాగ్ కాదు. దీని విలువ ఏకంగా అక్షరాల రూ. 2 లక్షలు. క్రిస్టియన్ డయార్ అనే లగ్జరీ బ్రాండ్ కంపెనీకి చెందిన ఈ హ్యాండ్ బ్యాగ్‌ను ఎక్కువగా సెలబ్రిటీలు మాత్రమే ఉపయోగిస్తుంటారు. ప్రపంచవ్యాప్తంగా అత్యంత ధర పలికే బ్రాండ్లలో క్రిస్టియన్ డయార్ మొదటి వరసులో ఉంటుంది. ఇక ఊర్వశి పోస్ట్ చేసిన ఈ ఫొటోల్లో ధరించిన డ్రస్ కూడా అందరి దృష్టిని ఆకర్షించింది. యల్లో కలర్లో ప్రింట్‌తో ఉన్న ఈ డ్రస్‌లో మెస్మరైజ్ చేసిందీ బ్యూటీ.
ఇక ఊర్వశి సినీ కెరీర్ విషయానికొస్తే.. ఈ అందాల భామ 2013లో వచ్చిన ‘సింగ్ సాబ్ ది గ్రేట్’ సినిమాతో చిత్ర సీమకు పరిచయమైన ఈ చిన్నది. తొలి సినిమాతోనే ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక అనంతరం పలు విజయవంతమైన చిత్రాల్లో నటించిన ఈ చిన్నది.. ‘బ్లాక్ రోజ్’ అనే సినిమాతో త్వరలోనే తెలుగు ప్రేక్షకులను కూడా పలకరించనుంది. ఈ సినిమా హిందీతో పాటు తెలుగులోనూ విడుదల కానుంది. కేవలం సినిమాలే కాకుండా పలు వెబ్ సిరీస్‌లలోనూ నటించిందీ బ్యూటీ.
Also Read: Telangana Crime News: మద్యం మత్తులో స్నేహితుల మధ్యన ఘర్షణ.. కత్తితో దాడి చేసి హత్య చేసిన స్నేహితుడు
Bank Holidays in September: వచ్చే నెలలో 7 రోజులు బ్యాంకులు పనిచేయవు..ఎప్పుడెప్పుడో తెలుసుకోండి!
youtube videos: పది లక్షల వీడియోలను తొలగించిన యూట్యూబ్.. వీటిలో దానికి సంబంధించినవే ఎక్కువ.