ఆన్ స్క్రీన్, ఆఫ్ స్క్రీన్ .. సందర్భమేదైనా సల్మాన్ ఖాన్ ఎప్పుడూ స్టైలిష్‌గా కనిపిస్తుంటాడు. దుస్తులతో పాటు అతను ధరించే వాచ్ లు, బ్రేస్ లెట్స్ ఎప్పుడూ స్పెషల్ గానే ఉంటాయి. ముఖ్యంగా సల్మాన్ ఖాన్ తరచూ ఖరీదైన వాచ్‌లతో కనిపిస్తుంటాడు. అందులోనూ వజ్రాలు పొదిగిన వాచీలు అంటే సల్మాన్‌కు చాలా ప్రీతి. అలా తాజాగా జాకబ్ అండ్ కో బిలియనీర్ III లగ్జరీ వాచ్‌ను ధరించాడీ బాలీవుడ్ సూపర్ స్టార్. అంతేకాదు. అంతేకాదు ఈ కంపెనీ వ్యవస్థాపకుడు జాకబ్ అరబోను ఆలింగనం చేసుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియోను జాకబ్ స్వయంగా సామాజిక మాధ్యమాల్లో షేర్ చేశాడు. దీంతో ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. ఈ వాచ్ స్పెషాలిటీ ఏంటంటే..ఇందులో వందల కొద్దీ వజ్రాలు ఉన్నాయి. ఈ వాచ్ లో 152 తెల్లని వజ్రాలు ఉన్నాయి. ఒక్కో విభాగంలో 76 వజ్రాలు ఉంటాయి. అలాగే బ్రాస్లెట్లో 504 వజ్రాలు ఉన్నాయి. అలా మొత్తం కలిపి వాచ్‌లో 714 వజ్రాలు ఉన్నాయి. ఈ వాచ్ ధర సుమారు రూ.41.5 కోట్లు. ఈ వీడియో చూసి చాలామంది ఆశ్చర్యపోతున్నారు. ఈ వాచ్ అమ్మితే 5 రోల్స్ రాయిస్ లు వస్తాయంటూ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.
ఇదిలా ఉంటే సల్మాన్ ఖాన్ ఈ వాచ్ కొనలేదని తెలుస్తోంది. జాకబ్ తన స్వహస్తాలతో 714 వజ్రాలు పొదిగిన గడియారాన్ని సల్మాన్‌కు అలంకరించాడు. అనంతరం ఇద్దరూ కలిసి ఫొటోలకు పోజులిచ్చారు. అయితే సల్మాన్ తల్చుకుంటే ఈ ఖరీదైన వాచ్ కొనుక్కోవడానికి ఎక్కువ సమయం పట్టదంటున్నారు అభిమానులు.
ఇక సినిమాల విషయానికి వస్తే.. సల్మాన్ ఖాన్ ప్రస్తుతం ‘సికిందర్’ అనే పాన్ ఇండియా సినిమాలో నటిస్తున్నాడు. సాజిద్ నడియాద్వాలా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సౌతిండియన్ సెన్సేషనల్ డైరెక్టర్ ఏఆర్ మురుగదాస్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో రష్మిక మందన్న నటిస్తోంది. దీంతో పాటు అట్లీ సినిమాలో కూడా సల్మాన్ నటిస్తున్నట్లు సమాచారం. త్వరలోనే దీనికి సంబంధించి అప్ డేట్స్ రానున్నాయి.
Song Out Now… #YouAreMinehttps://t.co/0Qkk9LOcBp@ayaanagnihotri @VishalMMishra @sanjeevcomposer @HaiderKhanMe #SaajanSingh @SKF_Music pic.twitter.com/NQTFER4kxK
— Salman Khan (@BeingSalmanKhan) August 29, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.