Ranveer Singh: ఇంటికి మహాలక్ష్మి వచ్చింది.. కొత్త కారు కొన్న బాలీవుడ్ స్టార్.. ధర ఎంతంటే..

|

Oct 23, 2024 | 11:49 AM

బాలీవుడ్ స్టార్ కపూర్ రణవీర్ సింగ్, దీపిక పదుకొణె దంపతులు ఇటీవలే తల్లిదండ్రులుగా ప్రమోషన్ పొందిన సంగతి తెలిసిందే. అలాగే కూతురు పుట్టిన తర్వాత ఇద్దరూ తమ ప్రాజెక్ట్స్ నుంచి బ్రేక్ తీసుకున్నారు.

Ranveer Singh: ఇంటికి మహాలక్ష్మి వచ్చింది.. కొత్త కారు కొన్న బాలీవుడ్ స్టార్.. ధర ఎంతంటే..
Ranveer Singh
Follow us on

బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్ ఇటీవలే తండ్రిగా ప్రమోషన్ పొందిన సంగతి తెలిసిందే. స్టార్ హీరోయిన్ దీపిక పదుకొణె పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. కొద్దిరోజుల క్రితమే కూతురితో కలిసి ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యింది. ఈ క్రమంలో స్టార్ హీరో రణవీర్ సింగ్ కొత్తగా లగ్జరీ కారు కొన్నట్లు తెలుస్తోంది. రణవీర్ సింగ్ కొత్త కారు కోసం భారీ మొత్తంలో ఖర్చు చేశాడని సమాచారం. కూతురు రాకతో సంతోషంలో ఉన్న రణవీర్, దీపిక దంపతులు తమ ఇంట్లోకి ఇప్పుడు మరో అతిథిని ఆహ్వానించారు. ఈ క్రమంలోనే ఈ లగ్జరీ కారును కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. రణవీర్ సింగ్ వద్ద ఇప్పటికే చాలా లగ్జరీ కార్లు ఉన్నాయి. దానికి తోడు ఇప్పుడు ఐషారామి మరో కారును కొనుగోలు చేశాడు.

ఇప్పటికే చాలా మంది సెలబ్రెటీస్ దగ్గర ఉన్న రేంజ్ రోవర్ కారును కొనుగోలు చేశాడు. ఈ కారు కోసం రణవీర్ సింగ్ రూ.4.74 కోట్లు చెల్లించాడు. ఈ కారుకు ప్రత్యేక నంబర్ కూడా ఉంది. ఇందుకోసం అప్పట్లో భారీ మొత్తం చెల్లించాడు. రణ్‌వీర్ సింగ్ రేంజ్ రోవర్ 4.4 ఎల్‌డబ్ల్యుబి కారును కొనుగోలు చేశాడు. రేంజ్ రోవర్ కార్ సిరీస్‌లోని అత్యుత్తమ, టాప్ ఎండ్ కార్లలో ఇది కూడా ఒకటి. రణవీర్ సింగ్ ఈ కారులో కొన్ని ప్రత్యేకమైన కస్టమ్ మేడ్ మార్పులు చేసాడు. రణవీర్ సింగ్ ఈ కారుకు 6969 నంబర్ ఉంది. ఇది తనకు ఇష్టమైన నంబర్ అని తెలుస్తోంది.

తండ్రి అయిన తర్వాత రణవీర్ సింగ్ కొంతకాలం సినిమాలకు విరామం తీసుకున్నాడు. రణవీర్ సింగ్, దీపిక జంటగా నటించిన ‘సింగం ఎగైన్’ చిత్రం వచ్చే వారం విడుదల కానుంది. ఇది కాకుండా రణ్‌వీర్ సింగ్ ‘ధురందర్’ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఆ తర్వాత డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తమిళ చిత్రం ‘అన్నియన్’ హిందీ రీమేక్‌లో రణవీర్ నటించనున్నాడు. తెలుగులో ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రణ్‌వీర్ ఓ సినిమాలో నటించాల్సి ఉంది కానీ ఆ ప్రాజెక్ట్ తాత్కాలికంగా ఆగిపోయినట్లు తెలుస్తోంది. దీపిక చివరిసారిగా కల్కి చిత్రంలో నటించింది.

ఇది చదవండి :  Mathu Vadalara 2 Riya: హే.. రియా నువ్వు ఆ షార్ట్ ఫిల్మ్ చేశావా.. ? ఆ ఒక్క వీడియోతో ఫేమస్ చేసిందిగా..

Prema Kavali : వారెవ్వా.. ఏం మారింది భయ్యా.. నెట్టింట గత్తరలేపుతోన్న ప్రేమ కావాలి హీరోయిన్..

Aadi Movie: ఆది సినిమాలో ఈ నటి గుర్తుందా.. ? ఇప్పటికే అదే అందంతో మెస్మరైజ్ చేస్తోందిగా..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.