“రామాయణం” బాక్సాఫీస్ జైత్రయాత్ర.. యష్ “కేజీఎఫ్ 2” రికార్డును బ్రేక్ !!

రామాయణం .. నితీష్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ దృశ్యకావ్యంలో బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ రాముడిగా.. స్టార్ బ్యూటీ సాయి పల్లవి సీతగా నటించారు. అలానే కన్నడ స్టార్ హీరో యష్ రావణుడిగా కనిపించారు. ఈ చారిత్రక చిత్రం కలెక్షన్స్ 15 రోజులకు ప్రపంచవ్యాప్తంగా రూ.1,547 కోట్ల వసూళ్లను సాధించి యష్ 'కేజీఎఫ్: చాప్టర్ 2' లైఫ్ టైమ్ వసూళ్లను అధిగమించంది.

రామాయణం బాక్సాఫీస్ జైత్రయాత్ర.. యష్ కేజీఎఫ్ 2 రికార్డును బ్రేక్ !!
Ramayana Movie

Updated on: Nov 20, 2026 | 3:21 PM

రామాయణం .. భారతీయ సినీ చరిత్రలో బాక్సాఫీస్ రికార్డులన్నింటినీ తిరగరాస్తూ జైత్రయాత్రను కొనసాగిస్తోంది. నితీష్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ దృశ్యకావ్యంలో బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ రాముడిగా.. స్టార్ బ్యూటీ సాయి పల్లవి సీతగా నటించారు. అలానే కన్నడ స్టార్ హీరో యష్ రావణుడిగా కనిపించారు. హనుమంతుడిగా సన్నీ డియోల్, లక్ష్మణుడిగా రవీ దూబే, కైకేయిగా లారా దత్తా, రాజా దశరథుడిగా అరుణ్ గోవిల్ తదితరులు కూడా నటించారు. దీపావళి కానుకగా నవంబర్ 5న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ పౌరాణిక చిత్రం.. విడుదలైన నాటి నుంచే ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్ల సునామీ సృష్టిస్తుంది.

కాగా మొదటి రోజు నుంచే వసూళ్ల సునామీ కొనసాగిస్తోంది. కేవలం ఎనిమిది రోజుల్లోనే రూ.1000 కోట్ల క్లబ్‌లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన ఈ మూవీ.. పది రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.1,240 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను సాధించింది. అదే హవాను కొనసాగిస్తూ ఈ చిత్రం బాక్సాఫీస్ రికార్డుల లెక్కలు రోజురోజుకూ కొత్త శిఖరాలను అధిరోహిస్తున్నాయి. ఈ చారిత్రక చిత్రం కలెక్షన్స్ 15 రోజులకు ప్రపంచవ్యాప్తంగా రూ.1,547 కోట్ల వసూళ్లను దాటాయి. దీంతో యష్ నటించిన సూపర్ హిట్ కన్నడ చిత్రం ‘కేజీఎఫ్: చాప్టర్ 2’ లైఫ్ టైమ్ వసూళ్లను అధిగమించంది.

భారతీయ సినీ చరిత్రలో ఒక సినిమా రూ.1000 కోట్ల మార్క్‌ను దాటడమే ఒకప్పుడు అద్భుతం అనుకునేవారు. కానీ ఇప్పుడు ఏకంగా రూ.1500 కోట్ల క్లబ్ అనేది అగ్ర దర్శకులకు ప్రతిష్ఠాత్మక మైలురాయిగా మారింది. ఈ భారీ వసూళ్లతో దర్శకుడు నితేశ్ తివారీ చారిత్రాత్మక రికార్డును తన పేరిట లిఖించుకున్నారు. ఒకే దర్శకుడి రెండు సినిమాలు రూ.1500 కోట్లకు పైగా వసూళ్లు సాధించడం ఇదే మొదటిసారి అని చెప్పాలి. గతంలో నితేశ్ తివారీ ఆమిర్ ఖాన్ హీరోగా తీసిన ‘దంగల్’ బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించింది. ప్రపంచవ్యాప్తంగా రూ. 2000 కోట్లకు పైగా వసూళ్లతో ఇప్పటికీ నంబర్ వన్ స్థానంలో కొనసాగుతోంది.

రామాయణం 10 డేస్ కలెక్షన్స్..

రామాయణం’ మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా 155 కోట్ల రూపాయలతో భారీ ఓపెనింగ్ అందుకుంది. రెండో రోజు 105 కోట్లు, మూడో రోజు 145 కోట్లు, నాలుగో రోజు 120 కోట్ల రూపాయలు రాబట్టింది. ఇక ఐదో రోజు 165 కోట్ల రూపాయలతో తన అత్యధిక సింగిల్-డే వసూళ్లను నమోదు చేసింది. ఆ తర్వాత ఆరో రోజు 140 కోట్లు, ఏడో రోజు 100 – 110 కోట్లు, ఎనిమిదో రోజు 85 – 90 కోట్లు, తొమ్మిదో రోజు 80 కోట్ల రూపాయలను ఖాతాలో వేసుకుంది. పదో రోజైన శనివారం మళ్లీ పుంజుకుని 120 – 130 కోట్ల రూపాయల మధ్య వసూలు చేయడంతో మొత్తం పది రోజుల కలెక్షన్లు రూ. 1,240 కోట్లకు చేరుకున్నాయి.

భారతీయ బాక్సాఫీస్ ఆల్-టైమ్ టాప్ 4..

దంగల్ – రూ.2,070.30 కోట్లు

ధురంధర్ 2 – రూ.1,852.44 కోట్లు

బాహుబలి 2 – 1,788.06 కోట్లు

పుష్ప 2- రూ.1,742.10 కోట్లు

Loading...
Unable to load recommendations.
Follow Us