Ram Gopal Varma: సర్కార్ సిరీస్‌లో మరో సినిమా… క్లారిటీ ఇచ్చేసిన ఆర్జీవీ.. కుండబద్దలు కొట్టేశారుగా..!

బిగ్ బీ అమితాబ్ బచ్చన్.. డైరెక్టర్‌ రామ్‌ గోపాల్ వర్మ కాంబినేషన్లో తెరకెక్కిన సూపర్‌ హిట్ సిరీస్‌ సర్కార్‌. మూడు భాగాలుగా వచ్చిన ఈ సిరీస్‌లో నెక్స్ట్ ఇన్‌స్టాల్మెంట్‌ చూడాలని అభిమానులు చాలా కాలంగా కోరుకుంటున్నారు.

Ram Gopal Varma: సర్కార్ సిరీస్‌లో మరో సినిమా... క్లారిటీ ఇచ్చేసిన ఆర్జీవీ.. కుండబద్దలు కొట్టేశారుగా..!

Updated on: Jan 17, 2021 | 4:06 PM

Ram Gopal Varma: బిగ్ బీ అమితాబ్ బచ్చన్.. డైరెక్టర్‌ రామ్‌ గోపాల్ వర్మ కాంబినేషన్లో తెరకెక్కిన సూపర్‌ హిట్ సిరీస్‌ సర్కార్‌. మూడు భాగాలుగా వచ్చిన ఈ సిరీస్‌లో నెక్స్ట్ ఇన్‌స్టాల్మెంట్‌ చూడాలని అభిమానులు చాలా కాలంగా కోరుకుంటున్నారు. అయితే ఈ ఎక్స్‌పెక్టేషన్స్‌కు ఫుల్‌స్టాప్‌ పెట్టేశారు డైరెక్టర్‌ వర్మ.

సర్కార్‌ సిరీస్‌ సూపర్‌ హిట్ అయినా.. దానికి మరో సీక్వెల్‌ చేసే ఆలోచన అయితే లేదని చెప్పేశారు ఆర్జీవి. కావాలని సాగదీసే ఉద్దేశం తనకు లేదని.. అలా చేసినా సక్సెస్‌ కాదన్నారు. అయితే సర్కార్‌కి బదులు అమితాబ్‌తో మరో సినిమా ప్లాన్ చేస్తున్నట్టుగా చెప్పారు. కోవిడ్ రాకపోయుంటే ఈ పాటికే బిగ్‌బీతో సినిమా స్టార్ట్ అయి ఉండేదన్న వర్మ.. త్వరలోనే అమితాబ్ కాంబినేషన్‌లో ఓ ప్రాజెక్ట్‌ ఎనౌన్స్‌ చేస్తానంటూ చెప్పారు. అయితే ప్రజెంట్ తను చేస్తున్న ప్రాజెక్ట్స్ అన్నింటిని కంప్లిట్‌ చేసాకే బిగ్‌బీ సినిమాను స్టార్ట్ చేస్తానని చెప్పారు. సర్కార్‌ సిరీస్‌తో బిగ్‌బీకీ బ్లాక్‌ బస్టర్స్ అందించిన వర్మ.. ఇప్పుడు ఎలాంటి కథతో సినిమా చేస్తారో చూడాలి మరి.

Also Read: Alludu Adhurs : అదరగొడుతున్న ‘అల్లుడు అదుర్స్’.. బ్రేక్ ఈవెన్ సాదించిందన్న బెల్లంకొండ సురేష్

Loading...
Unable to load recommendations.
Follow Us