
Parineethi Chopra Coments: దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన జొమాటో విషయం అందరికి తెలిసిందే. హితేషా చంద్రానీ అనే బెంగుళూరు యువతి జొమాటో నుంచి ఫుడ్ కి ఆర్డర్ ఇచ్చింది. అయితే ఎంత సేపయినా రాకపోవడంతో జొమాటో ఎగ్జిక్యూటివ్ కి ఫోన్ చేసి ఇక మీ ఫుడ్ వద్దని, ఇస్తే ఫ్రీగా ఇవ్వాలని, లేదా ఆర్డర్ క్యాన్సిల్ చేస్తానని హెచ్ఛరించింది. చివరి సారిగా ఫోన్ చేస్తుండగా జొమాటో డెలివరీ బాయ్ వచ్చాడని, ఇంత ఆలస్యంగా వస్తే తనీ ఫుడ్ తీసుకోనని, ఆర్డర్ రద్దు చేస్తున్నానని, తీసుకువెళ్లిపొమ్మని చెప్పినట్టు ఆమె వెల్లడించింది. దీంతో ఆ బాయ్ ఆగ్రహించి దుర్భాషలాడుతూ తన ముక్కుపై దాడి చేసి పరుగెత్తి పారిపోయాడని చంద్రానీ పేర్కొంది. అయితే ఇదంతా ఆమె వెర్షన్.. అసలు విషయం జొమాటో చెప్పేసరికి ఆమె చెప్పింది మొత్తం అబద్ధం అని తేలిపోయింది.
అయితే ఈ విషయంలో అందరు జోమాటో అబ్బాయిదే తప్పని అనుకున్నారు. కానీ అతని వివరణ విన్నాక మాత్రం నిర్దోషి అనే అభిప్రాయానికి వచ్చారు. సోషల్ మీడియాలో నెటిజన్లు తనకు మద్దతిస్తుండగా.. హీరోయిన్ పరిణీతి చోప్రా కూడా డెలివరీ బాయ్‌కు సపోర్ట్ చేస్తూ ట్వీట్ చేసింది. ‘జోమాటో ఇండియా – దయచేసి నిజమేంటో కనుగొని పబ్లిక్‌గా రిపోర్ట్ చేయండి. డెలివరీ బాయ్ నిర్దోషి అయితే (అతన్ని నేను నమ్ముతున్నాను), వెంటనే మహిళను శిక్షించేందుకు సాయపడండి. ఇది అమానవీయం, సిగ్గుచేటు మరియు హృదయ విదారకం.. నేను ఎలా సహాయం చేయవచ్చో తెలపండి.. #ZomatoDeliveryGuy’ అంటూ జొమాటోకు రిక్వెస్ట్ పెట్టింది.