Hania Aamir : పెళ్లి కాకపోవడమే వారికి పెద్ద సమస్య అనుకుంటా.. బాద్ ‏షాతో డేటింగ్ రూమర్స్ హీరోయిన్ రియాక్షన్..

ముఖ్యంగా బాద్ షా ప్రేమాయణం గురించి అనేక రూమర్స్ నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. కొన్నిరోజుల క్రితం హీరోయిన్ మృణాల్ ఠాకూర్‏తో బాద్ షా ప్రేమ అంటూ ప్రచారం జరిగింది. అందుకు కారణం వీరిద్దరు ఓ పార్టీలో సన్నిహితంగా కనిపించడమే. అయితే తమ మధ్య ఎలాంటి డేటింగ్ లేదని.. కేవలం స్నేహితులం మాత్రమే అని బాద్ షా క్లారిటీ ఇవ్వడంతో ఆ వార్తలకు అక్కడితో ఫుల్ స్టాప్ పడింది.

Hania Aamir : పెళ్లి కాకపోవడమే వారికి పెద్ద సమస్య అనుకుంటా.. బాద్ ‏షాతో డేటింగ్ రూమర్స్ హీరోయిన్ రియాక్షన్..
Hania Amir, Badshah
Follow us

|

Updated on: May 26, 2024 | 7:04 AM

సినీ పరిశ్రమలోని తారల వ్యక్తిగత జీవితాల గురించి నిత్యం ఏదోక వార్తల సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ముఖ్యంగా లవ్, డేటింగ్ అంటూ ఏదోక న్యూస్ తెరపైకి వస్తుంది. అయితే చాలా మంది ఈ రూమర్స్ గురించి అంతగా పట్టించుకోరు. కానీ మరికొందరు హీరోయిన్స్ తమపై వస్తున్న అసత్యాలపై రియాక్ట్ అవుతుంటారు. ఇదిలా ఉంటే.. బాలీవుడ్ సింగర్ బాద్ షా పేరు ఇటీవల ఎక్కువగా వార్తలలో వినిపిస్తుంది. ముఖ్యంగా బాద్ షా ప్రేమాయణం గురించి అనేక రూమర్స్ నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. కొన్నిరోజుల క్రితం హీరోయిన్ మృణాల్ ఠాకూర్‏తో బాద్ షా ప్రేమ అంటూ ప్రచారం జరిగింది. అందుకు కారణం వీరిద్దరు ఓ పార్టీలో సన్నిహితంగా కనిపించడమే. అయితే తమ మధ్య ఎలాంటి డేటింగ్ లేదని.. కేవలం స్నేహితులం మాత్రమే అని బాద్ షా క్లారిటీ ఇవ్వడంతో ఆ వార్తలకు అక్కడితో ఫుల్ స్టాప్ పడింది. అయితే ఇప్పుడు బాద్ షా మరో హీరోయిన్ తో ప్రేమాయణం సాగిస్తున్నాడని ప్రచారం నడుస్తుంది. పాకిస్తాన్ నటి హనియా అమీర్ తో బాద్ షా డేటింగ్ అంటూ సరికొత్త ప్రచారం తెరపైకి వచ్చింది. ఇటీవల వీరిద్దరు దుబాయ్ లో కలిసి కనిపించడంతో ఈ రూమర్స్ వెలుగులోకి వచ్చాయి.

తాజాగా ఈ డేటింగ్ రూమర్స్ పై నటి హనియా స్పందించింది. “మా ఇద్దరి మధ్య ఎలాంటి ప్రేమ లేదు. నాకు బాద్ షా పాటలంటే చాలా ఇష్టం. బాద్ షా నాకు మంచి స్నేహితుడు. బహుశా నేను పెళ్లి చేసుకోకపోవడమే పెద్ద సమస్య అనుకుంటా.. నేను వైవాహిక జీవితం మొదలు పెట్టి ఉంటే ఇలాంటి రూమర్స్ అన్నింటిని నేను దూరంగా ఉండేదాన్ని కావచ్చు” అంటూ చెప్పుకొచ్చింది. ఇక బాద్ షాతో స్నేహం గురించి ప్రశ్నించగా..”అది వ్యక్తిగత ప్రశ్న. నేను చేసిన రీల్ కు బాద్ షా కామెంట్ చేశాడు. అది చూసి నా స్నేహితురాలు చెప్పడంతో ఆశ్చర్యపోయాను. తను నాకు నేరుగా మెసేజ్ చేశాడు. మాట్లాడుకున్నాం. తను చాలా మంది వ్యక్తి. నేను బాధలో ఉన్న్పుపుడు సోషల్ మీడియాలో సైలెంట్ అయిపోతే ఏమైంది.. అంతా ఓకేనా ? అని అడుగుతాడు. తను నాకు దొరికిన గొప్ప స్నేహితుడు” అంటూ చెప్పుకొచ్చింది.

బాద్ షా, హనియా గతేడాది డిసెంబర్‌లో భారతీయ రాపర్‌తో కలిసి ఉన్న చిత్రాలను తమ ఇన్ స్టాలో పోస్ట్ చేశారు. దీంతో వీరిద్దరి డేటింగ్ రూమర్స్ తెరపైకి వచ్చాయి. ఇక గత నెలలో వీరిద్దరు కలిసి దుబాయ్ లో సందడి చేశాడు. దీంతో డేటింగ్ వార్తలకు మరింత బలం చేకూరింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Latest Articles
వ్యాపారం చేయాలనుకునేవారికి సువర్ణావకాశం..!
వ్యాపారం చేయాలనుకునేవారికి సువర్ణావకాశం..!
తారక్ ఫ్యాన్స్ కి పండగే.. అనుకున్న టైమ్‌ కన్నా ముందే రానున్న దేవర
తారక్ ఫ్యాన్స్ కి పండగే.. అనుకున్న టైమ్‌ కన్నా ముందే రానున్న దేవర
గాలొచ్చినా.. వానొచ్చినా.. మెట్రో ఆగదు.! ప్రయాణికులకు నిరంతర సేవలు
గాలొచ్చినా.. వానొచ్చినా.. మెట్రో ఆగదు.! ప్రయాణికులకు నిరంతర సేవలు
పెరుగు పుల్లగా మారకూడదంటే ఇలా చేయండి..
పెరుగు పుల్లగా మారకూడదంటే ఇలా చేయండి..
ఈ యానిమల్ యోగా పోజులు చేయడం వల్ల.. ఏం జరుగుతుందో తెలుసా?
ఈ యానిమల్ యోగా పోజులు చేయడం వల్ల.. ఏం జరుగుతుందో తెలుసా?
పువ్వుల ప్రేమికులా.. ఈ లోయపై ఓ లుక్ వేయండి.. ఏ సీజన్ బెస్ట్ అంటే
పువ్వుల ప్రేమికులా.. ఈ లోయపై ఓ లుక్ వేయండి.. ఏ సీజన్ బెస్ట్ అంటే
సొంతింటి కల ఆ పథకంతో సాకారం.. ప్రయోజనాలతో పాటు అర్హత ఏంటంటే..?
సొంతింటి కల ఆ పథకంతో సాకారం.. ప్రయోజనాలతో పాటు అర్హత ఏంటంటే..?
మీరు ఈ తప్పులు చేస్తున్నారా? మీ వాట్సాప్‌ శాశ్వతంగా నిషేధం!
మీరు ఈ తప్పులు చేస్తున్నారా? మీ వాట్సాప్‌ శాశ్వతంగా నిషేధం!
క్యాన్సర్ రోగులు రక్తదానం చేయవచ్చా? నిపుణులు ఏమి చెప్పారంటే
క్యాన్సర్ రోగులు రక్తదానం చేయవచ్చా? నిపుణులు ఏమి చెప్పారంటే
ఇలా చేశారంటే మంచి స్టైలిష్ బ్లాక్ బియర్డ్ మీ సొంతం
ఇలా చేశారంటే మంచి స్టైలిష్ బ్లాక్ బియర్డ్ మీ సొంతం