Dance Video Viral: టాలెంట్‌ఏ ఒక్కరి సొంతం కాదు.. ముగ్గురు చిన్నారుల డ్యాన్స్‌కు బాహుబలి భామ ఫిదా.. వీడియో వైరల్

Dance Video Viral: ప్రతిభ ఏ ఒక్కరి సొంతం కాదు.. అదే సమయంలో ప్రతిభ ఉన్నవారు పూరిగుడిసెలో ఉన్నా.. సరైన సౌకర్యాలు లేకున్నా ఎప్పుడోకప్పుడు ఏదొక సందర్భంలో..

Dance Video Viral: టాలెంట్‌ఏ ఒక్కరి సొంతం కాదు.. ముగ్గురు చిన్నారుల డ్యాన్స్‌కు బాహుబలి భామ ఫిదా.. వీడియో వైరల్
Nora Fatehi

Updated on: Nov 15, 2021 | 1:19 PM

Dance Video Viral: ప్రతిభ ఏ ఒక్కరి సొంతం కాదు.. అదే సమయంలో ప్రతిభ ఉన్నవారు పూరిగుడిసెలో ఉన్నా.. సరైన సౌకర్యాలు లేకున్నా ఎప్పుడోకప్పుడు ఏదొక సందర్భంలో వెలుగులోకి వస్తారు. తాజాగా ముగ్గురు చిన్నారులు ఒక పూరి గుడిసె ముందు ఓ బాలీవుడ్ సూపర్ హిట్ సాంగ్ కు డ్యాన్స్ చేసిన వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ముగ్గురు ముద్దుగుమ్మల డ్యాన్స్ వీడియో పలువురి సెలబ్రెటీలు ఆకర్షిస్తోంది. ఏకంగా బాహుబలి సినిమా మనోహరి సాంగ్ లో నర్తించిన నోరా ఫతేహిని కూడా ఆకర్షించింది.

తన ఇన్‌స్టాగ్రామ్‌లో ముగ్గురు అమ్మాయిలు డ్యాన్స్ చేస్తున్న వీడియో నోరా ఫతేహి షేర్ చేసింది. ఈ వీడియోలో ముగ్గురు అమ్మాయిలు.. బాలీవుడ్ పాటలకు, పంజాబీ పాటలను చక్కగా డ్యాన్స్ చేస్తున్నారు.

బాలీవుడ్ లోని సత్యమేవ జయతే 2లోని ‘కుసు కుసు’ పాటకు ముగ్గురు అమ్మాయిలు డ్యాన్స్ చేసిన వీడియో ఇంటర్నెట్‌లో  వైరల్‌గా మారింది. అమ్మాయిల ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్ ఒరిజినల్ సాంగ్‌లో నటించిన నోరా ఫతేహి దృష్టిని కూడా ఆకర్షించింది. నోరా తన ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్‌లో ఆ ముగ్గురు అమ్మాయి డ్యాన్స్ వీడియో షేర్ చేసింది.  నిజానికి వెండి తెరపై ఈ సాంగ్ లో నర్తించింది బాలీవుడ్ తార నోరానే.. నోరా చేసిన ఈ డ్యాన్స్ వీడియో ప్రస్తుతం నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటుంది. ఈ ముగ్గురు అమ్మాయిలు డ్యాన్స్ చూసిననెటిజన్లు ప్రశంసలు వర్షం కురిపిస్తున్నారు.  ‘ఫుల్ టాలెంటెడ్ గర్ల్స్’ అని కాంప్లిమెంట్ అందిస్తున్నారు. ఈ వీడియో ముందుగా ‘డాన్స్ దీవానే సీజన్ 3’ కంటెస్టెంట్ ఉదయ్ సింగ్ షేర్ చేశాడు. ఈ ఒరిజినల్ క్లిప్‌ను నోరా ఫతేహి రీపోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో లక్షల్లో వ్యూస్ సొంతం చేసుకుంది.

Also Read:   తనయుడు ఆర్యన్ కోసం బాడీ గార్డ్ వేటలో పడిన కింగ్ ఖాన్.. కుప్పలు తెప్పలుగా అప్లికేషన్స్..

Loading...
Unable to load recommendations.
Follow Us