బాలీవుడ్ మిస్టర్ పర్‌ఫెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్ ఆరోగ్యంపై ఆయన అభిమానులు ఆందోళన చెందుతున్నారు. స్టార్ హీరోకు ఏమైంది? ఎందుకలా మారిపోయారు? అంటూ సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున చర్చ కొనసాగుతోంది. దీనికి కారణం తాజాగా బయటకు వచ్చిన ఆమిర్‌ఖాన్ ఫొటోలే. ఇటీవల ఓ వివాహ వేడుకకు హాజరైన ఆయన చేతిలో స్టిక్ పట్టుకుని ఉన్నాడు. అంతేకాదు జాగ్రత్తగా మెల్లిమెల్లిగా అడుగులేస్తూ కనిపించాడు. దీనికి సంబంధించిన ఫొటోలు ఒక్కసారిగా వైరల్‌గా మారిపోయాయి. ఆమిర్‌కు ఏమైందా? అని ఆయన అభిమానులు కంగారు చెందుతున్నారు. ఆయన ఎందుకు స్టిక్ పట్టుకుని నడుస్తున్నారు? ఆయన కాలికి ఏమైంది? అంటూ ఫ్యాన్స్, నెటిజన్ల నుంచి ప్రశ్న వర్షం కురిపిస్తున్నారు. ఈ విషయంపై అటు ఆమిర్ కానీ, ఆయన కుటుంబ సభ్యులు ఎలాంటి క్లారిటీ ఇవ్వడం లేదు. దీనిపై ఆమిర్ స్పందించాలని, తన హెల్త్ అప్డేట్‌పై ఇవ్వాలంటూ సోషల్ మీడియా వేదికగా కోరుతున్నారు.
కాగా భారీ అంచనాలతో విడుదలైన ఆమిర్‌ఖాన్ లాల్‌సింగ్ చద్దా ఆశించిన విజయం సాధించలేకపోయింది. ఈ సినిమా రిలీజ్ తర్వాత పెద్దగా మీడియా ముందుకు కూడా రాలేదు. కొత్త ప్రాజెక్టులకు కూడా ఒకే చెప్పలేదు. అంతేకాదు కొన్ని రోజుల పాటు సినిమాలకు దూరంగా ఉంటానని ప్రకటించి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తారు. ఇప్పుడు జైపూర్ వేదికగా జరిగిన ఓ పెళ్లి వేడుకలో చేతిలో స్టిక్‌తో కనిపించడంతో ఫ్యాన్స్ తెగ కంగారుపడిపోతున్నారు. ది వాల్డ్ డిస్నీ కంపెనీ ఇండియా, స్టార్ ఇండియా అధ్యక్షుడు మాధవన్ కుమారుడి పెళ్లికి ఆయన హాజరయ్యారు. ఆమిర్‌తో పాటు అక్షయ్ కుమార్, మోహన్ లాల్, కరణ్ జోహార్, కమల్ హాసన్, పృథ్వీ రాజ్ తదితరులు ఈ పెళ్లి వేడుకలో సందడి చేశారు. ప్రస్తుతం ఈ వివాహ వేడుకకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..